గుఱ్ఱం జాషువా


సొంత ఊరు:
చాట్రగడ్డపాడు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (1895 – 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వ రీతినుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.


 

విజ్ఞప్తి సహృదయులారా! కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని. గ్రంథనామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోచవచ్చును. కానీ అందలి కథానాయకుడు ప్రణయసందేశము […]

నవయుగకవి చక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా రచనల్లో అగ్రగణ్యం “గబ్బిలం”. ఆయన కవిత్వంలో కనిపించే ముఖ్యగుణాలు భావనాపటిమ, సామాజికస్పృహ, మానవతాదృక్పథం ఇందులో విస్తృతంగా దర్శనమిస్తాయి. తేలిక భాషలో లోతైన భావాల్ని చెప్పే ఈ కావ్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాక అవశ్యపఠనీయం కూడ.

జాషువా కథాకావ్యాల్లో ప్రసిద్ధమైంది పిరదౌసి. అద్భుతమైన కవిత్వాన్నిరాసి అందుకు తగిన గుర్తింపునూ ప్రతిఫలాన్నీ పొందలేక పోవటం ఈ ఇద్దరు కవులవిషయంలోనూ ఉన్న సామ్యం. ఐతే […]