ఇదీ నన్నయ్యగారి దేవయాని! తెలుగు భారతంలో ఆమె అసాధ్యురాలు, గొప్ప గడసరి కూడా! అందుకే మొదలుపెడుతూనే నిష్ఠూరాలు! తప్పంతా యయాతిపై తోసేసింది. ఆ రోజు నన్ను బావినుండి బయటకు తీసే సందర్భంలో సూర్యుని సాక్షిగా నీ ఉన్నతమైన దక్షిణహస్తంతో నా దక్షిణహస్తాన్ని పట్టుకున్నావు. కాబట్టి ముందే నన్ను పాణిగ్రహణం చేశావు. అది నువ్వు మరచిపోవడం న్యాయమా? అని యయాతిని నిలదీసింది!
Category Archive: సంచికలు
గౌరీదేవి బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా తొలగిపోతోంది.
ఓయి కవీ!
గురజాడ జాడ నడవఁగ
దొరకొంటివి గాదె! యిపుడు దూరమ్మై యా
కఱకైన కత్తి మొనతో
విరచింతువు కవితలరయ విడ్డూరంబౌ!
ఒళ్ళూ పయి తెలీకుండా
నెల్ల పిల్లడి లాగగాలాడని సాయంకాలం
గంగసాగరం లాగఎర్రటి కన్ను ఆర్పకుండా
దివ్వసోడి లాగ
నీ చేతిని తాకి ఉండేవాణ్ణి
నా చేతిలోకి తీసుకోగలిగీ ఉండేవాణ్ణి
నీ కంటిమీదపడుతున్న వెంట్రుక పాయను
వెనక్కి సర్ది ఉండేవాణ్ణి
అక్కడికక్కడే ఆగి ఆపి ఉండేవాణ్ణి
సన్నని సెగలో కాలే కోర్కెల్ని దాస్తూ
ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
ఏవో ఆశల్ని పరుస్తాడతను.
రొట్టెలొత్తే చేతుల ఎర్రమట్టిగాజులు
గలగలలతో లయగా ఊకొడుతూంటాయి.
పొద్దుపొడుపు చుక్క
మసక వెలుతురులో కరిగిపోయిన చోట
తొండమెత్తి
మొదటి కిరణాన్ని రారమ్మని పిలుస్తోంది
ఒక ఆవిరి ఏనుగు.
ఈ ప్రయత్నం అంతా ఎందుకు? అంటే లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. ప్రామాణికమైన గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.
గంగనార్యుడు, పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా పద్యాన్ని కదనుతొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువుతీరింది. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.
జీవి నాడిని పట్టి జీవతత్త్వాన్ని ఒక డాక్టరు ఎట్లా గ్రహిస్తాడో చేరా తెలుగు భాషా తత్తాన్ని ఇంకా చెప్పాలంటే ద్రావిడ భాషా తత్త్వాన్ని నామ్నీకరణాలతో ఆవిష్కరిస్తారు. విభక్యర్థక నామ్నీకరణంలో ఏయే నామాలు సాధ్యమో, నామ్నీకరణ ప్రక్రియల్లో నామ విభక్తుల లోపాన్నిబట్టి అంతరువులు ఉన్నాయని ఏడవ దశకంలోనే నిరూపించిన ఘనత ఆయనది.
చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది.
దుర్భిణిని అంతరిక్షంలో ఉంచటం వల్ల చాల లాభాలు ఉన్నాయి. భూమి వాతావరణం వల్ల చెదరకుండా ప్రతిబింబాలు ఖణిగా కనిపిస్తాయి. నక్షత్రాల దగ్గర బయలుదేరిన విద్యుదయస్కాంత తరంగాలలో కొన్ని భూమిని చేరలేవు కనుక మన దుర్భిణిని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి.
పొద్దుట లేచిన మొదలుకొని
నిద్దుర వరకూ నెగులుకొని
అద్దువ చూపుకు ఒద్దిక చూపే
అణకువనైతే కానవుగా?!
ఈ పర్యాయం కొన్ని దేశభక్తి గేయాలు, జయజయప్రియభారత జనయిత్రీ, కలగంటిని, శ్రీపురాణధాత్రికి, – కృష్ణశాస్త్రి, రాయప్రోలు తదితరులు రచించినవి, ఇంకా కొన్ని మీ ముందుంచుతున్నాను. నా చిన్నతనంలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా తరచుగా ప్రసారమైన పాటలివి.
కవి బిల్హణుడు 11వ శతాబ్దపు కాశ్మీర కవి. చోరపంచాశికా అనే ప్రేమకవిత ద్వారా జగత్ప్రసిద్ధుడు. కావ్యకథనమైన ఈ కవి ప్రణయోదంతాన్ని ఒక చక్కటి పద్యనాటికగా సాహిత్యపునఃసృష్టి చేసిన తిరుమల కృష్ణదేశికాచార్యుల రచన, బిల్హణీయము; తెలుగు పద్యాలలో అన్నిటికన్నా ఎక్కువ భావక్లిష్టత ఉన్న పద్యంగా ఒక పద్యంపై తన నిర్ణయాన్ని వివరిస్తున్న ఏల్చూరి మురళీధరరావు వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం!; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం అమ్మా కనకమ్మా; ప్రముఖగాయకుడు, మాధవపెద్ది సత్యం ప్రత్యేక జనరంజని కార్యక్రమం, లలితగీతాల ఆడియోలు, ఈ సంచికలో…
ఇంకా: ఇంద్రాణి, సమవర్తి, మానస, శ్రీవల్లీరాధిక, కనకప్రసాద్, బివివి ప్రసాద్, మోహనరావుల కవితలు; సాయి బ్రహ్మానందం, ఆర్ శర్మ, శ్యామలాదేవిల కథలు; రమాసుందరి నవలాసమీక్ష; వేంకటేశ్వరరావు, మోహనరావుల వ్యాసాలు; ఛందం సాఫ్ట్‌వేర్ గురించి పరిచయం; కామేశ్వరరావు ధారావాహిక నాకు నచ్చిన పద్యం.
మా అమ్మమ్మా వాళ్ళు కార్తిక మాసంలో అరటి దొప్పల్లో దీపాల్ని వెలిగించి, నదిలో వదిలే వారు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాల్లాగా, నీళ్ళలో అందరూ వదిలే ఆ దీపాల్ని చూడటానికి అమ్మమ్మ కొంగు పుచ్చుకుని గజగజా వణుకుతూ ఆవిడ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ మధ్య వూరువెళ్ళినప్పుడు మా చిన్న మావయ్య కోడలు షాలిని, వుయ్ లీవ్ లైట్స్ ఇన్ ద లేక్. యు వాంట్ టు కమ్ అండ్ సీ? అంది.
మీకు తెలిసే ఉంటుంది. రాజు నిన్న మధ్యాన్నం మద్రాసు హాస్పిటల్లో పోయారట. ఈయన చెప్పారు! పాపం అంత పేరూ, డబ్బూ ఉండి చివర్లో కేన్సరు బారిన పడటం తలుచుకుంటే బాధేస్తుంది. మరీ అరవయ్యో పడిలో పడకుండానే పిట్టలా రాలిపోవడం అన్యాయం. కూతురి పెళ్ళయినా అయ్యింది. కొడుకులిద్దరికీ పెళ్ళీ అవీ ఇంకా కాలేదు. సంబంధాలు కుదిరాయనీ ఈయన చెప్పారు. పాపం!
“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”
వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్‌గా మారే ముందు దశను రచయిత మధురాంతకం నరేంద్ర జాగ్రత్తగా పట్టుకొని వస్తారు. భూముల స్థలీకరణకు మానవ ప్రతిఘటన బలహీనమైన ఈ అవస్థలో రోసిరెడ్డి ఒక ప్రశ్న వేస్తాడు. “మడుసులంతా ఈ మాదిరి కొంపలు గట్టుకొనేదానికి కయ్యలు, కాలువలు గావాలంటే కుదిరితిందా? నేలుండేది దున్నిపంట చేసేదానికా? కడగాలేసి గోడల్లేపే దానికా?”