“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.
Category Archive: సంచికలు
ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే!
పికిలిపిట్ట పేరు పెట్టుకుని
సముద్రాన్ని దాటి వచ్చిన
చక్రవాత వర్షపాత మొకటి
నిన్న ఆదివారం మా ఊళ్ళో
వృక్షయాగం చేసింది.
లేతమొక్కలా కూలిపోయిన నీవు
నిలబడతావు, నిలబడతావు
ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక సర్దుకొంటూ
మేఘాలు నుదుటిని చుంబించేవరకూ
కళ్ళు మూసుకున్నంతసేపు
రెక్కలు రెపరెపలాడిస్తూ
గిరికీలు కొట్టే భావాలు
పెన్ను మూతవిప్పగానే
ఎక్కడికో ఎగిరిపోతాయి.
చూపులతో దారి మళ్ళించి
అర్థరాత్రి.
అలికిడి.
తడబడి
విడివడి
దూరందూరంగా…
సాహిత్యంలో పూర్తి మాతృక అన్నది నిజం కాదని గుర్తిస్తే చాలు. నమ్రత ఉన్న ప్రతి కథకుడికీ ఈ విషయం తెలుసు. మంచి రచయిత అయితే, వాడి చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. కథలో రకరకాల అందమైన లోతులు కనిపిస్తాయి. విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి.
ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!
నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.
తన గురువుగారైన శ్రీపాద కృష్ణమూర్తి గారి గురించి శ్రీ వేదుల సత్యనారాయణ శర్మ పంచుకున్న సంగతుల ఆడియో ప్రసంగం. – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.
ఆధునిక కాలంలో వేమనకు గుర్తింపు రావడానికి కట్టమంచి రామలింగారెడ్డిగారు నిర్వహించిన పాత్ర చాలా పెద్దది. ఇక్కడ మీకు వినిపించుతున్న సి. ఆర్. రెడ్డిగారి రేడియో ప్రసంగం Caste-less society – Vemana అన్న శీర్షికతో అక్టోబర్, 1948లో ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
చేకూరి రామారావు (1 అక్టోబర్ 1934 – 24 జులై 2014): చేరాగా సుపరిచితమైన భాషాశాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు ఇక లేరు. నోమ్ చామ్‌స్కీ భాషాసిద్ధాంతాలని తెలుగు భాషకు అనువర్తించి చేసిన పరిశోధనలకు కార్నెల్ యూనివర్సిటీ నుండి భాషాశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్న చేరా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా తెలుగు వాక్యం, భాషాంతరంగం, భాషాపరివేషం వంటి ఎన్నో పుస్తకాలు వెలువరించారు. చేరాతలు శీర్షిక ద్వారా తెలుగులో ఎందరికో కవులుగా గౌరవం కల్పించారు. వచన పద్య లక్షణాలపై కోవెల సంపత్కుమారతో జరిపిన చర్చ ఎంతో ప్రసిద్ధమైంది. సాహిత్య విమర్శ, పరామర్శలలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న చేరా 2002లో రాసిన స్మృతికిణాంకం సంకలనానికి కేంద్రసాహిత్య ఎకాడమీ అవార్డు లభించింది.
సత్తిరాజు లక్ష్మీనారాయణ (15 డిసెంబర్ 1933 – 31 ఆగస్ట్ 2014): బాపూ అన్న కలంపేరుతో తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న సత్తిరాజు లక్ష్మీనారాయణ తుది శ్వాస విడిచారు. సాక్షి, బాలరాజు కథ, ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, సీతాకళ్యాణం, అందాల రాముడు, త్యాగయ్య, వంశవృక్షం, పెళ్ళి పుస్తకం, శ్రీరామరాజ్యం వంటి సినిమాల దర్శకుడు, బాపూరమణల పడుగూపేకలో పేక; బుడుగు, సీగానపెసూనాంబ, రాధా గోపాళం – ఇలా రమణ అక్షరానికి రూపమిచ్చిన గీతగాడు, రామభక్తుడు, మితభాషి, ప్రపంచంలో అగ్రశ్రేణి లైన్‌డ్రాయింగ్ ఇలస్ట్రేషనిస్టుల సరసన ఠీవిగా కూర్చున్న కొంటెబొమ్మల బాపూ ఇక మనమధ్య లేకపోయినా, తన చేతిరాతతో మన గుండెలపై చేసిన బాపూ సంతకం మాత్రం శాశ్వతంగా మనతోనే ఉంటుంది.
ఈ సంచిక ఇలా ఇద్దరు ప్రముఖుల మరణాలతో, ఒక ఉజ్వలమైన తెలుగు తరం క్రమంగా అస్తమిస్తున్నదన్న చేదునిజంతో విడుదల చేయవలసి రావడం మాకు ఎంతో బాధ కలిగిస్తున్న విషయం.
ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు. ఆయన మాత్రం ప్రాచీన సాహిత్యం చదివి పాండిత్యాన్ని, భాషాపాటవాన్ని పెంచుకున్నాడు.
మన కాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడు కూడా బాపూ తన బొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగు దేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకో పోనిచ్చాడు.
ఇంతలో ఏదో జ్ఞాపకాల వాసన. ఉడకబెట్టిన శెనక్కాయల వాసన. శెనక్కాయలమ్మే నడివయసామె వచ్చింది. బుట్ట దించి నా ముందు పెట్టింది. చూద్దును కదా బుట్టనిండా నా జ్ఞాపకాలే! వాడు, శెనక్కాయలమ్మేదానిలాగా… అవును వాడే. ఆమె చీర గుండెల మీద నుంచి జారిపోయి ఇంకేవో కొత్త జ్ఞాపకాలను నా ముందు పరిచింది.
వెనకటికి మా అమ్మ మేనమామ కూడా అన్నింటికీ ‘బరువు, బరువు’ అంటుండేవాడుట! మీరు వస్తువుల్లో బరువు చూసినట్టుగా ఆయన డబ్బు, హోదాల బరువు చూసేవాడుట. ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ ఆస్తిపాస్తులను తూకం వేసి బరువుగా వుందనుకుంటేనే పెళ్ళిళ్ళు చేసేవాడుట! ఇక తన ఇంటికి వచ్చే కోడళ్ళని, బాగా బరువుగా కట్నాలు ఇచ్చుకోగలిగే వాళ్ళను చూసి మరీ ఎంచుకునే వాడుట!
అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.
హఠాత్తుగా ఉన్నటుండి ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో భూకంపం కన్నా వంద రెట్ల స్త్రీకంపం వచ్చింది. అటెండరు నుండి, ఆచార్యుల వరకూ అందరూ దాని బాధితులే! స్టూడెంట్స్ అయితే చెప్పనవసరం లేదు. ఇంతటి కంపనం సృష్టించింది కాలేజీలో కొత్తగా చేరిన సువర్ణ అనే కొత్తమ్మాయి. నడిచొచ్చే పాలరాతి శిల్పంలా ఉంది. దానికితోడు ఎంతో అందమైన చీర కట్టు.
హోమర్ పనిచేసే న్యూక్లియర్ పవర్ ప్లాంటుకి హెన్రీ కిసింజర్ వస్తాడు. ఈ కథనం ప్రారంభంలో కిసింజర్ ట్రేడ్మార్క్ కళ్ళజోడు టాయిలెట్లో పడిపోతుంది. ఎవరికన్నా చెపితేనవ్వుతారని కిమ్మనకుండా ఆయన బయటికి వస్తాడు. తరువాత హోమర్ ఆ టాయిలెట్ గుంటలో కళ్ళజోడు తీసి తను పెట్టుకుంటాడు. అంతే! అక్కడే ఒక గణితసూత్రం నెమరువెయ్యడం మొదలుపెడతాడు, హోమర్. ఒక సమద్విభుజత్రికోణము లో ఏ రెండు భుజముల వర్గమూలము కూడినా… అని.