విమానాన్ని చూసిన ప్రతిసారీ
వినమ్రంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది

ఎగిరే రేకుల డబ్బాలా కాక
చేపా హంసలు ఒక్కటై దర్శనమిచ్చే
దేవతా సోయగంలా అనిపిస్తుంది

సంజీవ పర్వాతాన్ని అమాంతంగా
మోసుకు పోతున్న హనుమంతుడి
కార్యోన్ముఖుత ని గుర్తుకు తెస్తుంది

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి

మళ్ళీ ఏమైంది?
ఎవరో పిలిచారు నేలపైకి.

ఒక్క నిముషం,
నిన్నొకసారి సర్దేసి వెళ్ళనీ.
మిగిలిన రెండు జాజిపూలనీ
దిండుమీదే వదిలేసి ఉంచనీ.

ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.

గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే.

రచయిత బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేది గురించి ఈమాట పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నవలను రేడియో కోసం పాలగుమ్మి పద్మరాజు 1960లలో నాటికగా మలిచారు. ఆ నాటికను మీకోసం ఈ సంచికలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం ఆంధ్రభారతి శాయిగారితో కలిసి తెలుగు నిఘంటువులు, పదకోశాలు పోగు చేసే కార్యక్రమంలో ఒకరోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ‘విద్యార్థి కల్పవల్లి’ కోసం వెతుకుతుంటే ఊహించని విధంగా వింజమూరి శివరామారావుగారి గేయసంకలనం కల్పవల్లి-గీతికాలతాంతాలు (1958) అన్న పుస్తకం కనబడింది. చిన్నప్పుడు విజయవాడ రేడియో కేంద్రం నుండి విన్న ఎన్నో లలితగేయాల పూర్తి పాఠాలు ఒక్కసారి కళ్ళముందుంటే కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.

కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2015కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2015.

రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.

తమ అనుభవాలు ఆలోచనలు భావుకతతో బాధతో ఆవేశంతో ప్రేమతో పదిమందికీ పంచుకుందామనీ, సమాజానికి దిశానిర్దేశనం చేద్దామనీ, కవిగా గొప్ప పేరు తెచ్చుకుందామనీ ఎందరో ఉత్సాహపడుతుంటారు. కానీ వీరికి ఇప్పటిదాకా ఆచరణలో పెట్టగలిగే సూచనలిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా ఏ ప్రయత్నమూ లేకపోవడం విచారకరం. సాహిత్యంపై తన అపోహలను బాహాటంగా ఒప్పుకుంటూ, వాటికి ప్రాయశ్చిత్తంగా కవి కావాలనుకునే వారు వెంటనే పాటించగలిగే సూచనలిస్తూ మాధవ్ మాౘవరం రాసిన బోధనాత్మక సోదాహరణ వ్యాసం కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు ఈ సంచికలో. ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కవిత్వ పద్ధతులతో పాటుగా కవిత్వం నిజంగా ఏమిటి, కవి ఏర్పరచుకోవలసిన లక్షణాలు, కవిగా కొనసాగడం ఎలా? వంటి ఉపయుక్త అంశాలు కూడా ఈ వన్‌స్టార్ గైడ్ లాంటి వ్యాసంలో చర్చించబడ్డాయి.


ఇంకా: ప్రసాద్, మానస, తఃతః, రవిశంకర్‌ల కవితలు; ఆర్ శర్మ, శివకుమార శర్మ, శ్యామలాదేవిల కథలు; వేంకటేశ్వర రావు, మురళీధరరావు, వేంకటేశ్వరరావుల వ్యాసాలు; కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; శ్రీనివాస్ సమర్పిస్తున్న కట్టమంచి రామలింగారెడ్డి, వేదుల సత్యనారాయణ శర్మల ఆడియో ప్రసంగాలు…

నెలరోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్ళే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు.

మనం అక్కడ వున్నన్నాళ్ళు ఇల్లు పెళ్ళివారి ఇల్లులా సందడి సందడిగ, హడావిడిగా వుండేది! మనల్ని చూడ్డానికి మీవైపు వాళ్ళు నావైపు వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే వుండేవారు. వస్తూ వస్తూ ఎంబ్రాయిడరీ చేసిన జేబురుమాళ్ళు, గాజులు, పూసల గొలుసులు, పార్కర్ పెన్నులు, కఫ్ లింక్స్, బందరు లడ్డూలు, కాకినాడ కాజాలు, ఇలా ఏవో ఒకటి మనకోసం ప్రేమగా తెచ్చేవారు.