రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నిరీక్షణ

రచన: పద్మావతి రాంభక్త
జనవరి 2023

పాతికేళ్ళ నాటి మిత్రుడొకడు
కలుస్తానన్నాడు.

ఎప్పుడొస్తాడో
అనే ఆలోచనలో
గడియారం ముల్లు
చీమలా పాకుతోంది

తాజా ఉదయం
పాత జ్ఞాపకాలను
వెచ్చగా నెమరేస్తోంది
మాటిమాటికీ కాలాన్ని
మణికట్టుపై కొలుస్తున్నాను

నాలుగు టీలు నడిచాయి
కళ్ళు తలుపులకతుక్కుని
ఆశతో వేళ్ళాడుతున్నాయి
కాళ్ళు పదిమార్లు
గుమ్మం వరకూ వెళ్ళొచ్చాయి

పదే పదే చదివిన
పత్రికలోని అక్షరాలు
పక్షుల్లా ఎగిరిపోయి
కాగితం తెల్లముఖం వేసింది

బెల్లు మోగి
ఆత్రంగా తలుపు తీస్తే
ఇస్త్రీ బట్టలవాడు
నిరీక్షణా వీక్షణాల మీద
నీళ్ళు చల్లాడు

వస్తానన్న వాడు
రాకుండా ఉండడు
కనీసం నా కలల్లోకైనా
తప్పక వస్తాడు.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Poduru v s Pardhasaradhi January 4, 2023 4:47 am

    పద్మావతిగారి కవితలు సరళమైన బాషలో అపారమైన భావాన్ని సృజించే ప్రజ్ఞాశాలి… ఎందుకో ఈ కవిత నాకు అసంపూర్తిగా అనిపిస్తోంది.

  2. 2
    S A RAHMAN January 15, 2023 4:57 am

    పద్మావతి రాంభట్ల గారి నిరీక్షణ చాలా బాగుంది. నిరీక్షణ కాబట్టి వచ్చేవరకు నిరీక్షించాల్సిందే.

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • తెరుచుకోవు
  • నిష్క్రమణ
  • అదృశ్యం
  • వికసితం
  • కొన్ని సందర్భాలు

ఇటువంటివే…

  1. నిరీక్షణ
  2. అదృశ్య దృశ్యాలన్నీ…
  3. ఏమైనా చేస్తాను
  4. అక్షరాలు
  5. మాగ్నెట్

జనవరి 2023 సంచికలో ...

  • (భ)m + గ + (స)n = (భ)m+n + గ
  • అశక్త
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 15
  • ఊ!
  • ఊహల ఊట 20
  • ఊహలకందని మొరాకో -3
  • గడినుడి – 75
  • జనవరి 2023
  • తన్మాత్ర: లేతకాంతిలోకి…
  • తాళంచెవి
  • ది వేస్ట్‌ లాండ్: 1. కావ్యప్రవేశం
  • నాకు నచ్చిన పద్యం: లాక్షణికులు గుర్తించని అనురాగభేదము
  • నిరీక్షణ
  • నేన్
  • ముగ్గు
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • వన్ నైట్ స్టాండ్
  • విభాజకం
  • విశ్వమహిళానవల 21: నెలీ బ్లై
  • సాంగత్యం
  • సోల్జర్ చెప్పిన కథలు: బద్‍లా
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ముగ్గు
నేన్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.