ముగ్గు

నిద్రపోతూ ఉన్నా.
నా కంటి ముందు
గరికపూల రంగుల్లో
మెరుస్తున్న చుక్కలు

ఇంకాసేపటికి
రెక్కలతో పిలుస్తూ
సీతాకోక చిలుకలు

తర్వాత
ఇంతేసి కళ్ళతో
మాట్లాడుతున్న
తామర పూలు

లేవండి లేవండి
అనే మాటలు వినిపించి
కళ్ళు నులుముతూ చూశానా

వాకిట్లో
అదే ముగ్గు.


సుంకర గోపాలయ్య

రచయిత సుంకర గోపాలయ్య గురించి:

సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.

 ...