రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

తెరుచుకోవు

రచన: పద్మావతి రాంభక్త
డిసెంబర్ 2020

ఎన్నిమార్లు తట్టినా
తెరుచుకోని తలుపుల వద్ద
చేతులు జోడించి
ప్రాథేయపడతాను
తలుపుల వెనుక దాగిన
తలపుల మడతలు విప్పుదామని
శతవిధాల ప్రయత్నిస్తాను.
ఆ ఏకాంతసౌధంలో మూలమూలన
వేళ్ళాడే చీకటిబూజులను దులుపుదామని
మౌనపు పొరలను తొలగిద్దామని
అల్లకల్లోలమవుతాను.

నాలుగు గోడల నడుమ
పోగుపడిన దుఃఖాన్ని
చెదరగొడదామని
ఒంటరితనపు కిటికీలు తెరచి
ఒక్క వెలుగుకిరణాన్నైనా
బహూకరిద్దామని
దిగులుపొగను ఊదేసి
నులివెచ్చని ఓదార్పవుదామని
సున్నితంగానే మునివేళ్ళను తాకిస్తాను.

లోపల ఎన్ని యుగాల
కల్లోలసముద్రమో మరి
తన కెరటాల హోరును వినిపించదు
రహస్యతుఫానుల జాడ విప్పదు
పెదవులు విడివడి
ఒక్క పలుకైనా రాలదు
చూపులు సాగదీసి
అగాధంలోకి ఎంతగా తొంగిచూసినా
ఏమీ పట్టుబడదు
దబదబా బాదినా
తలుపులలోనూ
వెనుక గడ్డకట్టిన నిశ్శబ్దంలోనూ
కదలిక రాదు.

కొన్ని తలపులూ తలుపులూ అంతే
ఎప్పటికీ తెరుచుకోవు
చమురంతా ఆవిరైపోయి
వేసారిన ప్రాణదీపం ఆరిపోయినా సరే!

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    దివాకర్ December 7, 2020 11:58 pm

    ఈమె చాలా చక్కగా తనదైన శైలిలో ప్రకృతిని మనకు కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ కవితల రాసారు. అందరూ తప్పక చదవండి.
    హృద్యంగా కవిత రాయడం ఈమె ప్రత్యేకత..

  2. 2
    పార్థసారధి పోడూరు December 8, 2020 12:51 am

    తేట నైన తెలుగులో, చక్కని ,చిక్కని పదజాలం తో, లోతైన భావవ్యక్తీకరణ అద్బుతం.. అసామాన్యం..

  3. 3
    Ramu GSV December 8, 2020 9:08 am

    Very Good.

  4. 4
    D Venkata sujatha December 8, 2020 10:09 am

    Very nice . Always some personal issues can not share to anybody. Inside our heart only. Very neatly expressed in above Kavitha.

  5. 5
    G Madhu Babu December 10, 2020 9:55 am

    Very nice Padma. All the best, keep it up.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అప్పుడిక
  • గాజుసముద్రం
  • వ్రాయలేనితనం
  • బుడగ
  • అదృశ్యం

ఇటువంటివే…

  1. శూన్యం చెక్కిన శిల్పం
  2. ఒక ఖాళీ ఉదయం
  3. స్మృతి
  4. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  5. రంగులప్రవాహం

డిసెంబర్ 2020 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 1
  • Timeline
  • అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ
  • ఆమె నవ్వు
  • ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ
  • ఆహ్వానం: అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్
  • కవిత్వం: దోహదక్రియలు
  • కాపరుల జీవిత దర్పణం: కొండపొలం
  • కిక్
  • క్షణికాలు
  • గడినుడి – 50
  • గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్
  • చివరికి అంతా తెలిసిపోతుంది!
  • డిసెంబర్ 2020
  • తెరుచుకోవు
  • మరి, సరి, లాగా!
  • మాయలాంటి మనం
  • లీలా లీలా…
  • విశ్వ మహిళా నవల: 5. సోఫీ ల ఱోష్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 50
  • సత్యం
  • స్వేచ్ఛ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కాపరుల జీవిత దర్పణం: కొండపొలం
చివరికి అంతా తెలిసిపోతుంది!

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.