యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో

ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఎందరో ఔత్సాహికులు ఈమాట లోని కథలను కవితలను ఆడియోరూపం లోకి తెస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. వాటిని ఈ ఛానల్ ద్వారా ప్రచురించబోతున్నాం. కథలతో పాటు అలనాటి పాటలు, రూపకాలు, అరుదైన సాహితీవేత్తల గొంతులు, సంభాషణలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేట్ గీతాలు ఇలా అన్నింటినీ ఇక్కడ పొందుపరచబోతున్నాం. ఇలా ఈమాటలోని ఆడియోలు అన్నీ సమయానుకూలంగా అక్కడ అందరికీ సులభంగా అందుబాటులో ఉంచబోతున్నాం. అంతే కాక, సరికొత్త ఆడియో వీడియో రచనలకు కూడా చోటు కల్పించబోతున్నాం. ఈ మహాప్రయత్నంలో మాకు సహకరించి, ముందుండి నడిపిస్తున్న ప్రశాంతి చోప్రాగారికి, సహాయ సహకారాలందిస్తున్న పరుచూరి శ్రీనివాస్, తదితరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.


గతనెలలో కొత్తగా:

  1. ఆడియో ప్రసంగం: నా కోరిక, నా ప్రార్థన
    మూలం: బల్‌రాజ్ సాహని
    అనువాదం: సాయి బ్రహ్మానందం గొర్తి
    చదివిన వారు: కొప్పర్తి రాంబాబు
  2. ఆడియో కథ: అనగా అనగా ఒకరాత్రి
    రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి
    చదివిన వారు: ప్రశాంతి చోప్రా
  3. ఆడియో: ఆండాళ్ గోదా కళ్యాణగీతం
    అనువాదం: సురేశ్ కొలిచాల
    గాత్రం: ప్రశాంతి చోప్రా
  4. ఆడియో కథ: శిరోముండనం
    రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
    చదివిన వారు: కొప్పర్తి రాంబాబు
  5. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర
    గానం: బి. సుబ్బులు

    (పరుచూరి శ్రీనివాస్ అందించిన అలనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట 1930లలో రికార్డు చేయబడిందని, ఈ పాట పాడింది శ్రీమతి డి. సుబ్బులు అనే గాయని అని మాత్రమే–అదీ ఆ రికార్డు లేబుల్ మీద ఉన్న వివరణ ద్వారా–మనకు తెలిసిన సమాచారం.)