నాలో ఎగిరిపోతున్న ఆలోచనల్ని
కాగితం మీద పెట్టడం కష్టమే
కానీ ప్రయత్నిస్తాను.
నా ఆలోచనల తోటలో, నువ్వొక జోరీగలా
నన్ను పదే పదే తీయగా బాధించినా
నేను సంతోషంగా భరిస్తాను.
నాస్తిక వాదం నాది
కానీ అనుక్షణం
నీ మంత్రమే దీక్షగా జపిస్తాను.
నువ్వక్కడా, నేనిక్కడా
కానీ
వసంతం కోసం పుట్టబోయేపువ్వులా
నీకై నేను తపిస్తాను