రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అదృశ్య దృశ్యాలన్నీ…

రచన: కమలప్రసాద్ బొల్లోజు
జనవరి 2009

రాలిన నందివర్ధనం పూలలా
గడప ముందే జారిపడిన
జ్ఞాపకాల్ని ఏరుకుంటూంటే
ఎక్కడో మూలాల్లో వేళ్ళు
చిగుర్లు తొడుక్కుంటాయి
అప్ర యత్నంగానే
కాళ్ళు భారంగా నన్ను
మోసుకుంటూ ఇక్కడకే వస్తాయి

ముడుచుకున్న పొరలు
ఒకటొకటిగా విచ్చుకుంటూ
ఇదిగో ఇక్కడే
పురి విప్పిన నెమళ్ళలా
అనుభవాల వింజామరలు
మబ్బుల్ని మోసుకొచ్చి
చిరుజల్లుల్ని చిలకరిస్తాయి

దుప్పట్లో దగ్గర చేర్చుకున్నంత వెచ్చగా
ఇల్లంతా ఒక్కసారే నన్ను చుట్టేస్తుంది
గదులు వస్తువుల్ని
ఎక్కడివక్కడే సర్దు కుంటాయి
కేలండర్లని మింగిన మేకు
గోడమీద నిద్రపోతూంటుంది
మోగి మోగి మూగబోయిన
కాలింగ్ బెల్
నాయింటికి నేనే అతిథి నయ్యానని
నవ్వుకుంటుంది

అమ్మ పాడిన ‘బాబా’ పాట
గదంతా ఏరులై పారుతూంటుంది
పూజగదిలో అగరు బత్తి వాసన
ఘుప్పున కౌగిలించుకుంటుంది!
తిరిగి తిరిగి వచ్చిన కొడుక్కి
ప్రేమని వడ్డించిన తల్లిలా
వంట గది. అంతేనా..
గదులన్నీ నోళ్ళు తెరుచుకుని
బావురుమంటూ ఒకటొకటిగా
నా ముందు వాలి పోతూంటాయి

ఎవరికేమయినా నాకు మాత్రం
స్మృతి ఒక వరం
విస్మృతి ఒక శాపం.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    prasad February 17, 2009 5:29 am

    కమల ప్రసాద్ గారు మీ కవిత చాలా బావుంది
    నాకు బాగా నచ్చింది. ఈ కవిత రాయడానికి మూలం ఎవరొ చెబుతారా

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అదృశ్య దృశ్యాలన్నీ…

ఇటువంటివే…

  1. అలిగితివా…
  2. రెండో పాత్ర
  3. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
  4. నాతి చరామి
  5. టేబుల్ పై చేతి వాచీ

జనవరి 2009 సంచికలో ...

  • ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా
  • అదృశ్య దృశ్యాలన్నీ…
  • ఈ మాసపు పాట
  • ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం
  • ఒఖడే
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం
  • కవి స్మైల్ గురించి మరొక్కసారి…
  • కవిరాజశిఖామణి
  • కొండ నుంచి కడలి దాకా
  • ఖాళీ సీసాలు
  • గడ్డిపూవు
  • జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం
  • టేబుల్ పై చేతి వాచీ
  • తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్
  • నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం
  • నాతి చరామి
  • పాఠం
  • పెంపకం
  • బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు
  • మనకు తెలియని మన త్యాగరాజు – 3
  • రచయితలు – ఎడిటర్లు
  • వానకు తడిసిన పువ్వొకటి
  • స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత
  • స్మైల్‌ – ఓ జ్ఞాపిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్
నాతి చరామి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.