ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు.

నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి.

ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం.

త్యాగరాజుకి స్వతహాగా తమిళ భాషలో ప్రవేశమున్నా, ఒక్క కృతీ అందులో రచించలేదు. అంతే కాదు పరాయి భాషా పదాల్ని కూడా ఎక్కడా రానీయ లేదు.

ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’

పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…

మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు.

నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.

రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

ఈ పదేళ్ళ కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.