భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.
Category Archive: వ్యాసాలు
ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”.
పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.
బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్ళు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది.
ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది.
అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.
“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.
నా జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకోవడం ఇంటర్నెట్టులో తెలుగు వికాసానికి, ఈమాట పుట్టుకకి సంబంధించిన చారిత్రకాంశాలను — పాక్షికంగానైనా — కొత్తతరం వారికి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందన్న నమ్మకమే ఈ వ్యాస రచనకు పూనిక.
“ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.
ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.
ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు – చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).
విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.
ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.