రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒక తియ్యని కల

రచన: ప్రసూన రవీంద్రన్
జనవరి 2014

అన్ని నక్షత్రాలనూ దాటుకుని
ఆ కల మళ్ళీ వస్తుంది.
ఎదురు చూడని ఏ రాత్రిలోనో
కాస్తంత వెన్నెలని
కొంగున కట్టి పోతుంది.

ఊహలకు మల్లే
కుంచెలూ, రంగులూ
మేళవించే మెళకువలు
ఏవీ అనుమతించని కల
నిద్ర ముఖం మీద
చల్లటి చిలకరింపై
తనకు తానుగా
అలంకరించుకు వస్తుంది.

హద్దులకో పద్దులకో భయపడి
ఏ మలుపుల్లోనో
నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని
ఆ నిరభ్యంతరపు క్షణాల్లో
నిర్భయంగా చూపిస్తుంది

వాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల
నన్ను చుట్టుకునే ఉంటుంది.

నావి కాలేకపోతున్న క్షణాలతో
నేను పడుతున్న ప్రయాసలో
చెమటని తుడిచే
చిరుగాలై వస్తుంది.
బలవంతపు సంతకాలలో
బరువు దించే నిట్టూర్పై వస్తుంది.

అవును. అన్ని నక్షత్రాలనూ దాటుకుని
నిద్ర సిగలో వికసించడానికి
ఆ కల మళ్ళీ వస్తుంది.

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    krishibsk@gmail.com January 8, 2014 10:06 pm

    ఎంత బాగుందో ప్రసూన! నిద్ర సిగలో వికసించే కల. ఎంత చక్కని ప్రయోగం ?

  2. 2
    poornima January 10, 2014 2:37 am

    చాలా బావుందండి

  3. 3
    arun January 12, 2014 7:50 am

    చాల చాల బాగుంది. చాల రొజుల తరవాత మంచి కవిత చదివాను. ముఖ్యముగ:

    “హద్దులకో పద్దులకో భయపడి
    ఏ మలుపుల్లోనో
    నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని”

    “నావి కాలేకపోతున్న క్షణాలతో
    నేను పడుతున్న ప్రయాసలో”

    బాగ నచ్చినవి.

  4. 4
    S A Rahman,Chittoor. January 24, 2014 4:24 am

    వాడిన దండ తీసేసినా..

    ఎంత చక్కగా ఉంది! మంచి కవిత అందించినందుకు సంపాదకులవారికి ధన్యవాదములు.

  5. 5
    Mohanatulasi February 3, 2014 5:35 pm

    నిద్ర సిగలో వికసించే కల. ఎంత బాగుంది ప్రస్…! బ్యూటిఫుల్!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఒక తియ్యని కల
  • పగటి వాన

ఇటువంటివే…

  1. గరళం
  2. నిద్రానుభవం
  3. దూరాలు
  4. ఖాళీపాత్ర
  5. ఇంకా ఎందుకు మిగిలావు

జనవరి 2014 సంచికలో ...

  • అసమయాల అమావాస్య
  • ఈమాట జనవరి 2014 సంచికకు స్వాగతం!
  • ఈమాట నియమావళి, మరొక్కసారి
  • ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు
  • ఒక తియ్యని కల
  • కృషితో దుర్భిక్షం
  • కృష్ణ: లలిత గీతాలు
  • కొంచెం అది కొంచెం ఇది
  • ఖాళీపాత్ర
  • గరళం
  • ఘర్షణ
  • చెలియలికట్ట: విశ్వనాథ
  • జనరంజని: సాలూరు రాజేశ్వరరావు
  • నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు
  • నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు
  • పన్నీరు బుడ్డి
  • పలుకుబడి: రంగులు
  • పొడవూ వెడల్పుల లోతు
  • బంతిపూల పడవ మీద పోదాం పదవా!
  • మంచు
  • మనుషులెందుమూలంగా జీవిస్తారు?
  • మాధవీమధుసేనము
  • రెక్కలు కట్టేవాడు
  • వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము
  • సొంతం
  • స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా?
  • స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రెక్కలు కట్టేవాడు
పన్నీరు బుడ్డి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.