పాడలేని పాట
తోడురాని దారి
కవ్వింపులాగవు.
నలిగే మనసుగుచ్చుకునే పూలు
ముద్దుపెట్టే ముళ్ళు
తప్పుకుపోనీయవు.
రగిలే వయసుకలల పంతాలు
వంతుల జీవితాలు
కలువవెన్నటికీ.
మరిగే ప్రాణంఫలించీ ఫలించని అన్వేషణల్లోనే
ఘర్షణ.
అగ్గిరాజుకునే దాకా
తెలుసుగా, అసహనం నేరం.
రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ... పూర్తిగా »