ఈమాట జనవరి 2014 సంచికకు స్వాగతం!

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఈమాట నవంబర్ 2013 సంచికలో ప్రచురించిన ఏల్చూరి మురళీధరరావు సాహిత్య వ్యాసం పైన పాఠకులు ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సంచికలో ఆ వ్యాసానికి ప్రతిగా తమ విమర్శలను వ్యాస రూపంలో జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. ఇలా సాహిత్య వ్యాసాలపై స్పందనలు, ప్రతిస్పందనలు సామరస్యంగా తెలుపుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. ముందు ముందు ఇలాంటి సాహిత్య చర్చలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంచికలో కొత్త రచయితలు ఈమాటను తమ రచనలకు వేదికగా చేసుకొనడం చూస్తుంటే ఈమాట మరింతగా ఎదుగుతోందని మాకు నమ్మకం కలుగుతోంది. నాకు నచ్చిన పద్యం, పలుకుబడి లాంటి శీర్షికలు, సాహిత్య పరిశోధనాత్మక వ్యాసాలు, ఆడియోలు ఈమాటకు వన్నె తెస్తున్నాయి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, అందిస్తున్న ప్రోత్సాహాలతో ఈ సాహితీప్రయాణం ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తున్నాం.


ఈ సంచికలో:

  • కవితలు:– ఘర్షణ – మానస చామర్తి; పొడవూ వెడల్పుల లోతు – భగవంతం; కొంచెం అది కొంచెం ఇది – పాలపర్తి ఇంద్రాణి; గరళం – భాస్కర్ కొండ్రెడ్డి; ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు – కనకప్రసాద్; సొంతం – హెచ్చార్కె; రెక్కలు కట్టేవాడు – గరిమెళ్ళ నారాయణ; మాధవీ మధుసేనము – తిరులమ కృష్ణదేశికాచారి; ఒక తియ్యని కల – ప్రసూన రవీంద్రన్; పన్నీరు బుడ్డి – అట్లూరి ప్రసాద్; కృష్ణ: లలిత గీతాలు – తఃతః; ఖాళీపాత్ర – బివివి ప్రసాద్‌.
  • కథలు: కృషితో దుర్భిక్షం -బులుసు సుబ్రహ్మణ్యం; అసమయాల అమావాస్య – సాయి పద్మ; మంచు – మూలా సుబ్రహ్మణ్యం, బంతిపూల పడవ మీద పోదాం పదవా! – ఆర్. దమయంతి; మనుషులెందుమూలంగా జీవిస్తారు? – ఆర్. శర్మ దంతుర్తి.
  • వ్యాసాలు: నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు – సాయి బ్రహ్మానందం గొర్తి; స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా? – జెజ్జాల కృష్ణ మోహన రావు; స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం – పరుచూరి శ్రీనివాస్; వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము – తలిశెట్టి రామారావు.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు – భైరవభట్ల కామేశ్వరరావు; పలుకుబడి: రంగులు – సురేశ్ కొలిచాల.
  • శబ్దతరంగాలు: జనరంజని: సాలూరు రాజేశ్వరరావు; చెలియలికట్ట: విశ్వనాథ – పరుచూరి శ్రీనివాస్.