తెలుగు క్రియాంత భాష కాబట్టి, సాధారణంగా తెలుగు భాషా లక్షణాలను వివరించేందుకు రాసిన సంప్రదాయ వ్యాకరణంలోనైనా, ఆధునిక వ్యాకరణంలోనైనా క్రియకు ప్రాధాన్యం ఉండటం సహజం. అందువల్ల ఈ విషయాన్ని వెల్చేరుగారు మొదటగా కానీ, ప్రత్యేకంగా కానీ ‘కనిపెట్టా’రన్నట్టు చెప్పడం సబబు కాదు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: అయినవోలు ఉషాదేవిఇతరపేర్లు:
సొంత ఊరు: నర్సంపేట (వరంగల్ జిల్లా)
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు.
అయినవోలు ఉషాదేవి రచనలు
ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు.
ఆధునిక వర్ణనాత్మక భాషశాస్త్రజ్ఞుల వలె సూత్రాలను ఉదాహరణలతో అతి తక్కువ పారిభాషిక పదాలతో తన వ్యాకరణాన్ని 191 పద్యాలతో రాసిన కేతన తొలి తెలుగు వ్యాకర్త. సంస్కృత సంప్రదాయంలో పాణినీయ పరిభాషకు భిన్నంగా తేలికైన మాటలతో రాసిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణం. అందరూ చదవదగ్గది, చదివి ఆలోచించదగ్గదీను!
చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.
వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు.
తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే.
వ్యాకరణ రచనల్లో సంజ్ఞ (వర్ణాక్షరాల, పదాల పరిచయం), సంధి తర్వాత చెప్పే అంశం ‘విభక్తి’, ‘విభక్తి’ నామాలకు సంబంధించింది. వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు.
కేతన చెప్పిన సంధి సూత్రాలు ఆనాటి భాషను కూడా పూర్తిగా వివరించేవి కావు, కానీ ఆయన చెప్పిన మేరకు అవి ఆ కాలపు కావ్య భాషలోని అనేక తెలుగు సంధులను ఉదాహరణలతో సూత్రీకరించిన తీరు లోని సరళత ఆధునిక వ్యాకర్తలకు, భాషా శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం కావాలి.
సంస్కృతంలోని మాటలు తెలుగులో ఎలా మార్పు చెందుతాయో, చక్కగా స్పష్టంగా తెలుగు ఎంత భిన్నమైనదో, ఎట్లా సంస్కృత పదాలను మార్చుకుందో వివరించిన కేతన భాషా వ్యవస్థలలో మాటలు, వ్యాకరణం ఈ రెండు భాషల్లో ఎంత తేడా ఉందో నిరూపించారు.
మూలఘటిక కేతన కవి, వ్యాకర్త, ధర్మశాస్త్రకర్త. తిక్కన మహాకవికి సమకాలికుడై ఆయనకు తన దశకుమారచరితము అనే దండి మహాకవి కావ్యపు తెలుగుసేతను అంకితమిచ్చి ఆయన మన్ననలు పొందిన కేతన ఇంత గట్టిగా తానే తెలుగుకు మొదటగా వ్యాకరణం రాస్తున్నాను అని చెప్పుకున్నాడు.