‘నాన్నగారూ, మిమ్మల్ని కదలొద్దని చెప్పాను. ఒక చోట కూర్చోండి నేను చెప్పేవరకు’ ఇందాకటి గొంతే. పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సాయం చేద్దామని ఉన్నా వాళ్ళకి చేసే ఓపికుండదు. కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు. ప్చ్! సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో పెద్దగా ‘నాన్నగారూ!’ అన్న కేక వినిపించింది. పెద్దాయన్ని మరీ అంత ఘట్టిగా కోప్పడుతోంది. ఎంత తండ్రి అయినా పాపం కదూ! కూతురు కేకలకి బిక్కచచ్చిపోయుంటాడు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: అనూరాధ నాదెళ్ళఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
అనూరాధ నాదెళ్ళ రచనలు
ఇప్పుడే ఒక కరపత్రం చేతికొచ్చింది. అది మా కాలనీలో అంచెలంచెలుగా పెరుగుతున్న ఒక స్కూల్ రాబోయే సంవత్సరంలో మా పిల్లల కోసం తమని ఎంచుకోమంటూ ఇచ్చిన పిలుపు. ప్రత్యేకతలేంటో తెల్సా, పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కలిగేలా చేసి, విసుగుని, అసహనాన్ని తగ్గిస్తారుట. మంచి మాటకారితనం, తెలివి పెంచుతారట. ఇంకా, ఉద్వేగాలను నియంత్రించుకోవటం నేర్పి, తిరుగుబాటు ధోరణులను అరికడతారట.
క్రితం నెల దాదాపు పదహారు పదిహేడేళ్ళ తరువాత నా పుట్టింటి వాళ్ళనందరినీ కలిశాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ గురించి, ఆకాశ్ గురించీ వాళ్ళు రాలేదేమనీ అడిగారు. రఫీతో కాపురంలో పుట్టింటివాళ్ళను నేను పెద్దగా మిస్సవలేదు కాని, నావాళ్ళ మధ్య ఇన్నేళ్ళ తర్వాత కలిసి కూర్చుని మంచిచెడ్డలు పంచుకుంటుంటే ఎంత బావుండిందో! ఇప్పటికయినా నావాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను.
తల్లిదండ్రులు పిల్లల చదువులు, కెరియర్లు వరకూ ఎంతైనా శ్రమపడతారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసులో ఆ పిల్లల్లో మానసికంగా ఎలాటి భావనలు కలుగుతున్నాయో, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారేమో అనేవాటి గురించి మాత్రం పట్టించుకోరు. అయినా బిడియపడకుండా, భయపడకుండా పిల్లలు తమ సమస్యను అమ్మ, నాన్నలతో చెప్పుకునే వాతావరణం ఎంతవరకు ఉంది?
ఇలాటి వర్షపురోజులు ఎలా గడిచేవి చిన్నప్పుడు?! స్కూలుకి అప్పటికప్పుడు సెలవు ప్రకటించేసేవారు. తడుచుకుంటూ ఇంటికెళ్ళేసరికి అమ్మ అననే అనేది, ‘వర్షం కాస్త తగ్గేక పిల్లల్ని వదలచ్చుకదా’ అంటూ. నీళ్ళోడుతున్న తల తుడిచి, పొడిబట్టలు మార్పించేది. నేను ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళటం చూసేకే అన్న స్కూల్ బ్యాగ్ గుమ్మంలోంచి లోపలికి విసిరి అమ్మ చేతికి అందకుండా పారిపోయేవాడు. ఆ చిన్ననాటి ప్రేమ ఏమయిపోయింది?
పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు
నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి.
గాజు తలుపులు, మెరుపు వెలుగులు
నిన్ను పరివేష్టించి ఉంటాయి.
ఇక్కడ ఆకలిదప్పులే కాదు,
నిద్ర కూడా నిన్ను పలకరించదు.
నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక
నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు.
సాయంత్రం గంగా హారతికి ఇంకా సమయముంది. ముగ్గురం ఒక చోట కూర్చున్నాం. అతను విదేశీయుడిలా కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే భారతీయతను కలవరించి, భారతీయతను తొడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాడు. ఇద్దరి ముఖాల్లో అనిర్వచనీయమైన ఆనందం. మురళి కూడా వచ్చిఉంటే ఎంత బావుణ్ణు అనిపించిందోక్షణం. పక్కనే కలకలం వినిపించి చూస్తే ఒక ఏడాది పాపాయి పాకుతూ గంగా ప్రవాహపు అంచు వరకూ వెళ్ళింది.
ఆరుబయలు ఆటస్థలాలు,
ఆకుపచ్చని పరిసరాలు,
సుతిమెత్తని నీటి ప్రవాహాలు
పంచే సందడిని ప్రేమించాను.
ఓటి మాటల చప్పుడు జొరబడకుండా
కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను!
నాకేదో అయిపోయినట్టు, అంతలోనే ఏమీ కానట్టు…
రెండు రెండుగా ఆలోచిస్తున్నారు.
రెండు రెండుగా చూస్తున్నారు.
జాలిచూపులు దాచుకోలేక అవస్థ పడుతున్నారు!
నిజం నాకు తెలుసని వాళ్ళకీ,
వాళ్ళకి తెలుసని నాకు తెలియనిదేమీ కాదు.
గంభీరముద్రతో కదులుతున్న ఒంటరితనాలు
చిక్కగా కమ్ముకుంటున్న మబ్బుల గుంపులై,
చివరికి ఎప్పుడో, ఎక్కడో నిష్పూచిగా కురిసేందుకు
సమాయత్తమవుతున్నట్టే ఉన్నాయి!
ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!
పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.