రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నిశీధిసంద్రం

రచన: చంద్ర శేఖర్ ప్రతాప
జనవరి 2025

సాయం సంధ్య వేళల్లోనో
అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకువై
ఆరుబయట తిరుగుతూనో!
అప్రయత్నంగా పైకి చూసినప్పుడు…

చాన్నాళ్ళ కింద ఎటో వెళ్ళిపోయి
హఠాత్తుగా మార్కెట్‌లో కలిసిన మిత్రుడిలా
ఒరైయన్ నక్షత్ర మండలం
కనిపించి మురిపిస్తుంది!
వృషభ రాశిలో పైన మూడు
కింద రెండు మధ్యలో
అడ్డంగా మూడు నక్షత్రాలతో
కాల పురుషుడు నాలోని స్తబ్దతను
తరుముతుంటాడు!

ఓ నవమినాటి వెన్నెల
చెంపల్ని చల్లగా నిమురుతుంది!
నీలో ఏ మూలోవున్న దిగులు
తెలిమబ్బై తేలిపోతుంది!

మర్నాడెప్పుడో ఓ చీకటి సాయంత్రం వేళ
చంద్రుడింకా క్షితిజం మీదకు ఎగబాగక ముందు…
నిర్మానుష్యపు తావులలో…
ఒంటరిగా నడుస్తున్నప్పుడు…
శుక్రవంక నీలివెన్నెలలో
నీ నీడకనిపించి మనసు అంబరమౌతుంది!

పగటి వగలు మొహంమొత్తి
డాబా మీదకెక్కి ఎప్పట్లాగే
ఆకాశంలోకి దూకుతాను!

ఉత్తరాన సప్త ఋషులు
దక్షిణాన వృశ్చిక రాశుల
ప్రదక్షిణా వాలులలో
మహా ఇష్టంగా ఈదుతాను!

భయపెట్టే శని కూడా
ఓ పౌర్ణమినాటి నడిరేయి
చంద్రుడి వెనక్కు వెళ్ళి
నాతో దాగుడమూతలు ఆడతాడు!

అరుదుగా ఎప్పుడో
ఓ శుక్ల పక్షపు తొలిరోజున
నెలవంక కొనమీద శుక్రవంక
ముక్కెరయి మెరుస్తుంది!
స్తబ్దంగా కనిపించే నిశీధిలో
మనసు పాలపుంతై విరుస్తుంది!

ఉలికిపడే ఉల్కల క్షణికావేశాలు
గ్రహాల గ్రహణాల అహాల పట్టువిడుపులు
తరచి చూస్తే ఎన్ని అందాలు అర్థాలు!

నీలతారలు అరుణతారలు
ధవళతారలు జంటతారలు
వామనతారలు బృహత్తారలు
నవ్యతారలు కాలం తీరిన వృధ్ధతారలు!
నిష్ఠగా అడిగితే నిశీధి నీ మెడకు
తారాహారాలు వేనవేలు
ప్రసాదిస్తుంది!

మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ1 ఉన్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364 రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!

కథ కంచికి చేరేలోపు
విహారం కట్టిపెట్టి
ఇంటి పెట్టె తెరుస్తాను!
ఇక్కడా ఓ చిన్న
ఆకాశం దర్శనమిస్తుంది!
నా చుట్టు తిరిగే నక్షత్రంలా మావిడ!
మాబుల్లి ఉపగ్రహాలు!
ఒక్కటిలా కనిపించే
సిరియస్2 జంట నక్షత్రంలా
ఒక్క క్షణం అర్థం కాదు
ఎవరు ఎవరిచుట్టూ తిరుగుతారో!

తను లేకుండా ఈ విహరాలేంటని
అర్ధాంగి అరుణతారౌతుంది
ఉక్రోషాల ఉల్కాపాతాలు కురిపిస్తుంది!
అప్పటికి నివ్వెరపడి చిన్నబుచ్చుకున్నా…
అలకల అమావాస్యలు తీరి
మర్నాటికి మోమున
చిర్నవ్వుల నెలవంకలు
వికసించడం చూసి
మనసు మానస సరోవరం అవుతుంది!

శుక్లపక్షాలు కృష్ణపక్షాలు అలవాటై
ఇరుపక్షాల సంధ్యలలో
నేను మరోసారి ఆకాశంలోకి దూకేస్తాను!


  1. Gandhian Star disappears on 30th January every year, and it can be seen rest of the days. Dineb is the name of this Star it has been named as Gandhian Star in token of recognition of his service.
  2. Sirius is a dual star. It looks as single star to normal eyes. But with telescope it can be seen in Orion constellation.

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Kishore Karnam January 2, 2025 9:59 pm

    చంద్ర శేఖర్ ప్రతాప గారు, చాలా బాగా Astronomy ని కవిత్వాన్ని కలిపారు.

  2. 2
    Chandra Shekhar Pratapa January 8, 2025 6:20 am

    కిషోర్ కర్ణం గారు! ధన్య వాదాలు సర్!🙏🏻🙏🏻

  3. 3
    Lyla Yerneni January 10, 2025 11:29 am

    The account of stars, himself, his own delightful home life in this Telugu poem నిశీధిసంద్రం charmed me. I was wondering if the voice in the poem could be that of an engineer, an airline pilot, or an explorer, besides being that of a charming తెలుగు గృహస్థు. These thoughts are because I have been reading this enchanting Spanish book, “El Principito.” Unless you read the book, you will not know my line of thought.

    It seems the original book ‘Le Petit Prince’ became a hot favorite of old and young alike, since its publication in French and English, in 1940s. It is translated into over 500 and odd languages. The French author, Antoine De Saint-Exupery -who happened to be an avid aviator, took the trouble of drawing charming watercolor illustrations too.

    I must be such a poor reader, even though I am around, on planet earth, almost as long as this book, I have never read this best seller before. Only because of my current interest in learning Spanish, and a Spanish librarian picking the book for me, I was able to read it now. How lucky can I get! I sincerely thank the people who introduce new languages, new artworks to me, and thereby grant me access to different cultures, thoughts and expressions.

    As I read this tiny book of 83 glossy pages; as a backup, and verification method, I read the English translation by Richard Howard, on the net. (This American scholar, poet and acclaimed translator helped me before, in my reading and understanding of ‘Les Fleurs du mal’ by Baudelaire, by providing B’s French verse and his (R.H) English translation in free verse, in one single big volume.)

    In his book, Antoine De Saint-Exupery’s ‘Little Prince’ speaks in a child’s voice, about adults and their various traits. Won’t enumerate and take away the fun.
    He speaks about stars all along, and particularly so many times about his rose plant, I feel like sharing this poem I wrote some years back. Once again -unless Saint-E’s novella is read, one will not know why I recalled this poem about a rose.

    (ఏక్ హీ కలీ.)
    బగీచాలో నాట్యమాడే
    సహస్ర గులాబ్ సాహిబాలకూ
    జార్జియా ఒకీఫ్ వందపూల
    పెయింటింగుల కితాబులో
    ఘుమఘుమ రోజా షహజాదీలకూ
    నీ ఖిల్లా ముందు బాగ్ లో ఊగే తూగే
    ఒక్క గులాబీ బాలకూ
    అందంలో నీతో బంధంలో ఉంది ఫరక్!
    నీ చేతుల్తో నువ్వు మొక్క నాటితే
    రోజాకి రోజూ జరా నీళ్లు పోస్తే
    అది ఒక్కగానొక్క మొగ్గ వేస్తే
    గులాబీ రేకు విడిచినపుడల్లా -అల్లా!
    నీ గుండె గుబగుబలాడుతుంది
    గులాబీ గాలికి ఊగినపుడల్లా -అల్లా!
    నీ మనసు రెపరెపలాడుతుంది.
    ఈ గులాబీబాల నిన్నేలే మలికిన్
    ఈ ఒక్క కలీ కే లే నీ గులామీ బెహన్.
    -Lyla

    PS: There is a darling prose poetry for about two pages, by Albert Camus in the story ‘The adulterous Wife’ about night skies and stars. I read it in my translated copy of ‘Exile and the Kingdom.’ Hope readers find it and consummate with constellations.

  4. 4
    Chandra Shekhar Pratapa January 13, 2025 8:25 pm

    ధన్యవాదాలు మీకు lyla గారు!🙏🏻🙏🏻 Please watch my YouTube channel for vedeo, I tried, for this poem https://youtu.be/7nyzSBafFNc?si=mf4zo4dziMHwzEnj.

  5. 5
    కె.కె. రామయ్య January 19, 2025 10:38 pm

    A few lines from Albert Camus’s 1957 short story “The Adulterous Woman”

    The woman’s name is Janine, she and her husband Marcel are French-Algerians in Algeria near the end of World War II. Marcel runs a small “dry goods” store. Janine and Marcel have been married for 25 years, no children, living in three rooms above the shop. So on a bus journey, after all the years in this alien, though also too-familiar environment, Janine entertains a glance from a soldier, and her world goes into a spin.

    Since the beginning of time, on the dry earth of this limitless land scraped to the bone, a few men had been ceaselessly trudging, possessing nothing but serving no one, poverty-stricken but free lords of a strange kingdom. Janine did not know why this thought filled her with such a sweet, vast melancholy that it closed her eyes.

    She knew that this kingdom had been eternally promised her and yet that it would never be hers, never again, except in this fleeting moment perhaps when she opened her eyes again on the suddenly motionless sky and on its waves of steady light, while the voices rising from the Arab town suddenly fell silent.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అనుకోని అతిథి
  • భూమీ! నీకో సందేశం!
  • నిశీధిసంద్రం

ఇటువంటివే…

  1. బ్లిస్ హోమ్
  2. నడిచొచ్చిన తోవ
  3. కొన్ని జీవ వాక్యాలు
  4. వర్ల్‌డ్ వితిన్
  5. నిద్రా సమాధి స్థితిః

జనవరి 2025 సంచికలో ...

  • అక్కమహాదేవి వచనాలు – 1
  • అస్తిత్వవాద సాహిత్యం: 1. కీర్కెగాడ్
  • ఆకాశంలో వినిపించే స్వరాలు
  • ఎవరెస్ట్ బేస్ కాంప్ – 3
  • ఐడెంటిటీ ఉద్యమాలు – స్త్రీలు
  • కాలం కథ
  • కొన్ని జీవ వాక్యాలు
  • జనవరి 2025
  • జాగృత స్వప్నం: కలల కథలు
  • జీవకాంతి
  • తానా నవలల పోటీ – 2025
  • దంపతులు
  • నిద్రా సమాధి స్థితిః
  • నిశీధిసంద్రం
  • నో ఎగ్జిట్.3
  • బ్లిస్ హోమ్
  • భారత కథలో పునరావృతమయే బాణీలు
  • యాత్రానువాదం అంటే సహయానమే!
  • యుద్ధపు ఉనికి
  • యూట్యూబ్‍లో ఈమాట: డిసెంబర్ 2024
  • వర్ల్‌డ్ వితిన్
  • విశాఖ సముద్రపు హోరు వినిపించే ఎన్నెమ్మ కతలు
  • సంపాదకునికి ఉత్తరం
  • సార్థక నామం: అధోలోకం
  • ‘గోధుమరంగు ఆట’ లో ప్రతీకాత్మక తాత్వికత
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిద్రా సమాధి స్థితిః
అక్కమహాదేవి వచనాలు – 1

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.