రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నడిచొచ్చిన తోవ

రచన: రేఖాజ్యోతి
డిసెంబర్ 2018

ఏం కాలేదులే
కళ్ళు తుడుచుకో

చెప్పానా పిల్లా?
ఆ జ్ఞాపకాల పెట్టె తెరవకని.
పోనీలే, ఏదీ మనది కాదులే
మన పేరన ఏ ఆకాశమూ
రాసిపెట్టి లేదులే!

కొత్తేం కాదుగా, ఇద్దరికీ
పగిలిన గుండె ముక్కలు
అబ్బా, చెదురుమదురుగా,
ఏది నీదో ఏది నాదో
విడివిడిగా మూటగడదాంలే!

నువ్వేం వినలేదులే
నేనేదీ గుర్తుంచుకోనులే
కలబోసుకున్న కథలిక్కడే వదిలి
గొంతులో చిక్కుబడ్డ
దిగుళ్ళన్నింటినీ గుటక వేసి
నడుద్దాం కాసేపు, లే!

ఏదీ, నవ్వు ఒకసారి
ఈ కథ విప్పకముందు లాగా.
ఎటుపోయిందీ ఆ నవ్వు
నా నవ్వుతోపాటుగా?

రా, వెళ్ళి వెతుకుదాం
సూటిగానో, పక్కగానో
వెనక్కి మాత్రం వెళ్ళొద్దు
ఇంకెప్పుడూ… ఇక లే.

ఆ పెట్టె మూసెయ్యవా!

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    సురేష్ వెంకట్ December 3, 2018 10:31 pm

    Profound! అభినందనలు 💐

  2. 2
    Amarendra Dasari December 4, 2018 4:24 am

    బాగుందండీ.

  3. 3
    కె.కె. రామయ్య December 9, 2018 8:42 pm

    ప్రియమైన దాసరి అమరేంద్ర గారూ!

    రేఖాజ్యోతి గారు లాంటి వర్ధమాన కవిహృదయానికి, సందర్భోచితమో కాదో చూసుకోకుండా కామ్రేడ్ శివసాగర్ గళాన్ని వినిపించటం సభా మర్యాదలను అతిక్రమించటం క్రింద వస్తుందేమో కదూ

    ఆకాశంలో సగం నీవు
    అనంతకోటి నక్షత్రాల్లో
    సగం నీవూ సగం నేను
    తూరుపుపవన సంగీతంలో
    రాగం నీవు తానం నేను
    మనిద్దరం కలసి
    ఉద్యమిస్తే ఉప్పెన
    మనిద్దరం కలసి
    విప్లవిస్తే విజయం

    విప్లవపథంలో మనిద్దరం
    ఒకరికొకరం బాస చేసుకునే వేళ
    విప్లవపథానికి మనిద్దరం
    కలిసికట్టుగా బాసచేసిన వేళ
    త్యాగం మన పేరు
    పోరాటం మన ఊరు

    ఆకాశంలో సగం నీవు
    అనంతకోటి నక్షత్రాల్లో
    సగం నీవూ సగం నేను
    విప్లవాకాశంలో.

    – శివసాగర్

  4. 4
    Teja December 11, 2018 9:28 am

    U could really made me close the box.. it’s so touchy.. wish u would continue ur magic with words… thanku so much for this..

  5. 5
    ప్రసన్న మద్దిరాల June 4, 2020 4:08 am

    ప్రేమాగ్ని ని చల్లార్చే ప్రయత్నంలో మీ మాటలు… రేఖ గారూ ఏమని చెప్పమంటారు …. అద్బుతం మీరు….

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ముక్కోణాలు
  • శెలవు రోజున
  • నడిచొచ్చిన తోవ
  • #పంచనామా
  • సడి లేని సంభాషణలు

ఇటువంటివే…

  1. వో షామ్ కుచ్ అజీబ్ థీ…
  2. కొన్ని దూరాలంతే!
  3. కాళీ పదములు 5
  4. నేనే కవిత్వాన్ని
  5. బతుకు ఎంత పొరపాటై పోయేది!

డిసెంబర్ 2018 సంచికలో ...

  • అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం
  • కాళీ పదములు 5
  • కొన్ని దూరాలంతే!
  • గడినుడి – 26
  • గానుగెద్దు
  • డిసెంబర్ 2018
  • నడిచొచ్చిన తోవ
  • నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం
  • నేనే కవిత్వాన్ని
  • నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన
  • పాతికేళ్ళ ప్రేమకథ
  • పెరటి తలుపు
  • బతుకు ఎంత పొరపాటై పోయేది!
  • బేతాళ కథలు: కథన కుతూహలం-7
  • మంటో కథలు: కాలీ సల్వార్
  • మా అమ్మంటే నాకిష్టం!
  • విషమ సీసము
  • వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయము
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 26
  • సఫేద్ ఝూట్
  • సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ
  • స్టాంప్ ఆల్బమ్‌
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పెరటి తలుపు
కాళీ పదములు 5

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.