నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ కంటే ఈనాడు మన అరచేతిలో ఉన్న ఫోనులోని కంప్యూటర్ కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్న ఆనాటి కంప్యూటరు కంటే ఈనాటి సెల్ ఫోనులో ఎన్నో వేల రెట్లు ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆనాటి కంప్యూటరు ఒక అంతస్తులో సగభాగం ఆక్రమిస్తే, ఈనాటి సెల్ ఫోనులు అరచేతిలో పట్టేస్తాయి.

ప్రస్తుతం వస్తున్నవి డయాస్పోరా కాదని నా ఉద్దేశం. లొకేషన్‌ మారితే అవి డయాస్పోరా అవుతాయనుకోవడం తప్పు. అమెరికా నుండి వచ్చే సాహిత్యం డయాస్పోరా సాహిత్యం కావాలంటే మనం నూతన సమాజంలో ప్రవాసులుగా ఒక హైబ్రిడ్ సంస్కృతిని రూపొందించుకొని, ఆ సమాజంలో మనకే ప్రత్యేకమైన సమస్యలు, సంక్లిష్టతలు, అనుభవాలతో ఒక కొత్త జాన్రా సృష్టించుకోగలగాలి. అప్పుడు ఆ సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చు.

కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది.

అయినా ఇప్పుడు నేను చేశానని చెప్పినా నా మాట ఎవడు నమ్ముతాడు? నా ఆధారాలు ఎవడు నిజమనుకుంటాడు? అనవసరంగా నా భార్యాపిల్లలకు జీవితాలలో సుఖము శాంతి లేకుండా చేయడం తప్ప ఒరిగేదేముంది? పొరపాటు పని కాదా? ఏది ఒప్పు ఏది తప్పు? జనం ఏమంటారు? మెచ్చుకుంటారా? నా మంచితనాన్ని గుర్తిస్తారా? నా నిర్ణయాన్ని గౌరవిస్తారా?

మా అందరి సామాజిక నేపథ్యం, పుట్టిన ఊర్ల, చదువుకున్న చదువుల, పెరిగిన పద్దతుల వాతావరణాలు వేరు. యవ్వనంలో స్నేహం అనేదానికి వ్యత్యాసాల అంటరానితనం ఉండదు. మాలో ఏ ఇద్దరికీ వ్యక్తిగత అభిరుచులు, వ్యాపకాలు ఒకటి కావు. అవేమీ లేకపోయినా, గంటలకొద్దీ ఆడుకోవడానికి కబుర్లు, కాలు సాగేకొద్దీ నడవడానికి దారులు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి సమయం పుష్కలంగా ఉండేది.

ఇదేనా అసలు కారణం? లేక వేరేదైనా రహస్యం ఉందా? సార్వత్రిక విషాణు వత్సలాలని తయారుచెయ్యడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఆయా మందులు తయారుచేసినా వాటి ధరలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. కనుక ప్రభుత్వాల దన్ను లేకుండా సార్వత్రిక విషాణు వత్సలాలు వాడుకలోకి వస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు ఏటేటా టీకాలు పొడిపించుకోవడం వల్ల లాభపడేది ఎవరు?

మాట్లాడితే మనుస్మృతిని రామాయణాన్ని పురాణాలని పురాణ పాత్రల్ని విమర్శిస్తూ వాటి వెనక నక్కి ఆధునిక యుగంలో తమ ఆలోచనలు ఆచరణ తీసుకువచ్చిన విషమ పర్యవసానాలను గుర్తించడంలో ప్రగతి శీల మేధావులందరూ విఫలమయ్యారు.

‘శ్రీరమణ’ అని కాలర్‌ ఐడీ చూపిస్తోంది. శ్రీరమణగారేనా, ఇంకెవరైనా? ఇప్పుడు నేను ‘సార్‌ నమస్తే’ అన్నట్టుగా సిద్ధం కావాలా, ఎదుటివాళ్ళు మాట్లాడేదాకా ఆగి రియాక్ట్‌ కావాలా? కొందరు మనం హలో అనేదాకా ఏమీ మాట్లాడరు. కొందరు ఏమిటంటే ఆ చిన్న పాజ్‌ నిశ్శబ్దాన్ని కూడా భరించలేక వాళ్ళే ముందు మాట్లాడేస్తారు.

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?

ఆకుల మధ్య ఖాళీల్లో ఇరుక్కుపోయిన సూర్యుడు పెరోల్ మీద పలకరింపుకొస్తాడు. అక్కడక్కడా కొన్ని గడపలకు చేతులు మొలిచి గాల్లో ఊగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకునే తలుపు పాడే నిరసన పాటకు గోడలు దాచుకున్న నిశ్శబ్దం మట్టిబొమ్మ పగులుతుంది.

తియ్యని రాత్రి, నమ్మదగని
అసంగతం కాని రాత్రి
ఆకాశంలో చంద్రుడు
నిండుకున్నాడు.

ఎన్ని ప్రభూతులం గలవరింతల తాకితినో రవంత వి-
చ్ఛిన్నతలేని పున్నెముల శీతలపుంజము కోరి; యెంత కా-
వ్యాన్నమునాబ చేత ముఖమంతట కూరితినో, గురూక్తిగా
విన్న పురాకవీశ్వరుల వేదనలో, సిరిలో, ప్రపత్తిలో
మన్ననలో, గవేషణము మానక సల్పితినో; చికాకు లో-
గొన్న మనమ్ము గింజుకొన కూరిమి బల్మిని క్రుక్కికొంటినో

పూల మీది రంగుల్లా పుట్టాల్సినవాడివి
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలా,
ఇంద్రధనువులోని చెమ్మగాలిలా,
అడవిచెట్ల నీడల్లా ఉండాల్సినవాడివి
ఇలా ఎందుకున్నావని దుఃఖపడతావు

“తాము కోల్పోబోతున్న అస్తిత్వ మూల్యం తెలియని బాల్యం గవర్నమెంటు వాళ్ళేసిన టెంట్లలో నవ్వుతూ ఆడుకుంటుంది” అంటాడు మునక గ్రామాన్ని ఖాళీ చేసే సందర్భంలో… ఆ పిల్లల భవిష్యత్తులో ఉండే బాధనూ లోటునూ ఏ కళ్ళతో చూశాడో ఈ రచయిత!

ఈ ముక్కుపుల్లలు అన్నీ అధివాస్తవ చిత్రాలే. సర్రియలిస్ట్ కవిత్వమంటే – పాశ్చాత్య దేశాలలో మొదలెట్టిన సర్రియలిజం కాదు. అంతకు వందల వేల సంవత్సరాల క్రితం భారతీయత కళారూపాల్లో అంతర్భాగమైపోయిన సర్రియలిజం.

తమిళనాడుకు చెందిన ‘మానసా పబ్లికేషన్స్’ సంస్థ ప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ కుమార్తె, రచయిత్రి జె. చైతన్య, మరో రచయిత్రి కృపాలక్ష్మిలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ. మానసా పబ్లికేషన్స్, యువ రచయిత్రుల నుంచి ఆంగ్ల నవలల్ని ఆహ్వానిస్తోంది. మానసా సాహితీ పోటీల (మానసా లిట్ ఫెస్ట్) పేరుతో ఇందుకోసం ఓ సరికొత్త వేదికను కల్పిస్తోంది. తెలుగు లేదా ఇతర భారతీయ భాషల్లో రాసిన నవలల్ని రచయిత్రులు ఆంగ్లంలోకి అనువదించి కూడా పంపించవచ్చు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.