ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నది, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.
గతనెలలో కొత్తగా:
వేలూరి వెంకటేశ్వర రావు గారి సంస్మరణ –
1. అడియోకథ – స్వర్గంలో స్ట్రిప్ టీజ్, స్వరం: కొప్పర్తి రాంబాబు
2. ఆడియోవ్యాసం – బాపూ, స్వరం: కొలచిన భార్గవి
3. వేలూరి గారికి చాలా ఇష్టమైన పద్యం – కాటుక కంటినీరు, స్వరం: రాజేష్ భరద్వాజ
4. తెలుగు నిఘంటువు – వేలూరి గారి విశ్లేషణ ఆడియోలో, స్వరం: రాజేష్ భరద్వాజ
5. ఆడియోవ్యాసం – వార్ధక్యం, స్వరం: లక్ష్మణాచార్యులు పాతపట్నం
6. ఆడియో కథా సారాంశం – కావ్యదహనోత్సవం, స్వరం: కొప్పర్తి రాంబాబు
7. వేలూరి వారి జ్ఞాపకాలు (ప్రివ్యూ) : ఈమాట నిర్వహించిన వేలూరి వేంకటేశ్వర రావు గారి సంస్మరణ సభలోని కొన్ని అంశాలు.