రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జ్ఞాపిక

రచన: రఘు శేషభట్టార్
నవంబర్ 2023

గుర్తుందా?!
మనం ఒక్కటై ఉండక ముందు
మన ఉంగరాలు దండల్లా మారకముందు
మొసళ్ళ వంటి మనుషులకు
కట్టుకథల చేపలు విసిరి ఇద్దరం
సాయంత్రాలు పూచే పసుపు ఎండలో
తడిసినప్పుడు
నిరీక్షలు చొక్కాల్లా ఆరేసి
చలి నీడల కంబళిలో తలలుంచి దాక్కున్నప్పుడు
దూరలేని ఘుమఘుమ ఏదో
గుండె వెనకే తొణికేది
మన ఇళ్ళ మధ్య చలిగాలులు
రాయబారుల్లా తిరిగేవి

మళ్ళీ ఇన్నేళ్ళకు ఉత్కంఠల గొడుగులెత్తి
పక్షి నీడలు పుల్లల్లా చెదిరే ఈ గులక దారిలో నడిచినప్పుడు
మాజీ ఉదయాల గుంపులు నీటి పువ్వుల్లా చేతులెత్తి
నా మార్మిక సరోవరంలోకి తేలుతూ వచ్చాయి
ఎన్నో వరదానాల రెక్కలతో ఎగురుతున్న ప్రాణిని
నన్నీ ధూళి అలికిన లోకంలో దువ్వెనలా చేశాయి

నీకైనా నాకైనా కాలాన్ని రాట్నంలా తిప్పటం
వెంటాడే తారల్ని ముద్దచుట్టి విసరటం
చెదిరే ఏకాంతాల చెమ్మల మీద మృదుసంతకాలు అద్దటం
ఒక ఆట కనక
విడుపు కోసం
మన ఆత్మకథల మిలమిలలు
వేలికొనల్లో దాచాను
దానికి కొంచెం కల్పన పులిమి ఖండికలా రాశాను

ఇబ్బందులు తలకిందులుగా తిప్పుకుంటూ
బతికిన వాళ్ళం కదా!
మన లోకాలకు పూలద్దిన మృత్తికను
జ్ఞాపికలా దాచాలి…

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నమ్రత రాసిన పద్యం
  • కచేరి తర్వాత…
  • జ్ఞాపిక
  • ఒక అనాసక్త బహుమతి

ఇటువంటివే…

  1. ‘జ్ఞాపిక’
  2. స్మైల్‌ – ఓ జ్ఞాపిక
  3. తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ – రచనలకు ఆహ్వానం
  4. నాయినమ్మ యిల్లు
  5. జవాబు ఫలితం

నవంబర్ 2023 సంచికలో ...

  • An Appeal to Telugu Diaspora
  • అంతే…
  • అదృశ్యం
  • అలా నచ్చుతుంది
  • ఇమేజెస్ ఆఫ్ సబూ
  • ఊహల ఊట 30
  • ఎల్ల లోకములు ఒక్కటై…
  • ఒకానొక నిస్పృహ
  • కన్యాశుల్కం లోని ‘ఎత్తడం’ ఆట
  • గడినుడి – 85
  • గుళిక వాదంలో భాష్యాలు – నోబెల్ ఆవిష్కరణలు
  • జలదృశ్యం
  • జ్ఞాపిక
  • ది వేస్ట్ లాండ్: 6. వాట్ ది థండర్ సెడ్
  • నవంబర్ 2023
  • నాకు నచ్చిన పద్యం: పొలయలుక
  • నాసదీయసూక్తం – తెలుగు అనువాదం
  • నిన్ను ఎవరైనా పలకరిస్తే
  • నేత్రోన్మీలనం
  • పులి – మేక
  • ప్రసంగాలు – పాటలు
  • మనమెరుగని మధ్య అమెరికా 7
  • మాస్కాట్!
  • మోహన రాగ మహా!
  • యూట్యూబ్‍లో ఈమాట: అక్టోబర్ 2023
  • వారణాసి
  • విశాఖదత్తుని ముద్రారాక్షసం
  • విశ్వమహిళానవల 25: తొరూ దత్
  • వెంటాడే పద్యం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అదృశ్యం
జలదృశ్యం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.