రచయిత వివరాలు

స్వర్ణ చందూరి

పూర్తిపేరు: స్వర్ణ చందూరి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

అన్నపూర్ణమ్మ గారు మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. ఓ చిన్న జమీందారు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటినుంచే వంటిమీద ఓ మణుగు బంగారం ఉన్న మనిషి. ఓ సారి నా చిన్నతనంలో వాళ్ళ యింటికి పెళ్ళికి వెళ్ళినపుడు చూశాను. సూర్యుడు, చంద్రుడు, పెద్ద బంగారు జడ, మెడలో కాసులపేరు, వరహాలపేరు, ఇంకా ఇంకా ఏవో సత్తరకాయలపేర్లు, ఎన్నో ఎన్నెన్నో. వాటితో పాటు మెడకు హత్తుకుని కంటె, సరే నడుముకు వెడల్పుగా పచ్చలు, కెంపులు, వజ్రాలు పొదిగిన లక్ష్మిబిళ్ళతో వఢ్డాణం. ఆవిడని ఎరగని వారుండరు మా కుటుంబాల్లో.