రచయిత వివరాలు

పూర్తిపేరు: విజయ కర్రా
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

సాహిత్యం ఇష్టంగా చదివేవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండాలని లేదు. అక్కడొచ్చే లైకులన్నీ రీడర్స్‌‌వి అనుకోవడం మన భ్రమ. కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలంటే వారి అనుభూతులకి, వారుంటున్న కాలానికి సరిపడే రచనలు రావాలి. ఓ సామాన్య పాఠకుడిగా నేనైతే సీరియస్ కథనాలతో పాటు జీవితంలో సౌందర్యాన్ని, ప్రేమని, ఉత్సవాన్ని, ఆశావాదాన్ని ప్రకటించే రచనలు కూడా విరివిగా రావాలని కోరుకుంటాను.

వీడుకోలు సమయంలో నవ్వుతూ నవ్విస్తూ బాగానే నటించావు. బండి కదిలాకే ఇక నటించాల్సిన అవసరం లేకపోయింది. గుండెల్లో తడి కాస్త ముఖంలోంచి ఆవిరవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఓ రెండుసార్లు లేచి మొహం కడుక్కొని వచ్చావు. ఇదంతా చూసి చూడనట్లు చూస్తునే వున్నాడు నీ ఎదుటి సీట్లో కుర్రాడు. ఆ అంట కత్తెర క్రాఫ్ వాడు. నీలాంటి దుస్తులే వేసుకున్నవాడు. చెలిమి చేసే ప్రయత్నంలో ఊర్లు, పేర్లు కలబోసి భయ్యా అంటూ వరస కూడా కలిపాడు.

ఈసారి ఆయన నాకేసి మరింత కోపంగా చూశాడు. ఊ… అంటూ ఓసారి దీర్ఘం తీసి, ‘ఇంకెక్కడి నందు వాళ్ళమ్మ? నేనెప్పుడో దాన్ని పీక పిసికి చంపేశానుగా’ అన్నాడు. ఆ మాటతో నా గుండెలవిసిపోయాయి. కాళ్ళ క్రింద భూమి కదలిపోయింది. ఆ పరాయి ఊరిలో… ఆ చీకట్లో…

నిద్ర మధ్యలో మెలుకువ ఒచ్చింది ఆమెకి. కుడివైపుకి తిరిగి చూసింది. పక్కన పడుకునివున్న అతడి కళ్ళు తెరచి వున్న గవాక్షంగుండా కనిపించని దూరాలలోకి చూస్తున్నాయి. దగ్గరగా జరిగింది. “ఏమిటా ఆలోచనలు నిద్రవేళ?” అంటూ అతడి చెక్కిలిపైన చేతిని వేసి తన వైపుకి తిప్పుకుంది. ఆ రాత్రివేళ ఒకానొక అడవిలో ఓ పర్ణశాలకి పహారా కాస్తూన్న తన కవల సోదరుడు ఆలోచనలనిండా నిండివున్నాడని అతడు చెప్పలేదు.

కలో మెలుకువో తెలియని క్షణాలలో
పలుమార్లు కనికరిస్తుంది
ఆశించిన క్షణాల్లో ఆవిరై పరీక్షిస్తుంది
మొండికేస్తుంది – గారాలు పోతుంది
అలుగుతుంది – అంతలో ఆశీర్వదిస్తుంది
ఎప్పుడొచ్చి చేరిందో – ఎలా వొచ్చి కలిసిందో

మెట్ల మీద లయగా నా మెట్టెల ధ్వని
పాదరక్షలు లేని కాళ్ళకి చీరకుచ్చిళ్ళే గొడుగు
కంటి చూపుకి లంకె వేసే ఇరు వైపుల పచ్చదనం
నడక ఆగి సేద తీరి – అచ్చంగా నాదనిపించే సమయం.

సుమారు నూటతొంబై ఏళ్ళ తరువాత అంతకు మించి ఎన్నో రెట్ల శక్తితో వస్తోంది శాండీ! తీవ్రంగా వచ్చి తాకే హరికేన్ వేగానికి, హడ్సన్ నది అల్లకల్లోలమై – నగర వీధులు, రాకపోకలని సుగమం చేసే టనల్స్, సబ్‌వేలు జలమయమై పోయి, కరెంటు పోయి రెండు నగరాలూ ఊహకి అందనంత భారీనష్టం ఎదుర్కోవలసి రావచ్చని వాతావరణ నిపుణుల అంచనాలు చెపుతున్నాయి. కానీ ఈ విషయాలు దూరాన వున్న త్యాగికి చెప్పి అనవసరపు ఆందోళన కలిగించడం ఎందుకు?

పరమశివుని కనులు విచ్చుకున్నాయి. ఆర్తిగా చూస్తున్న పార్వతి నయనాలతో చూపులు పెనవేసుకున్నాయి. ఆ పద్మనయని ముగ్ధమోహన రూపాన్ని మంత్రముగ్ధుడై చూస్తుండిపోయాడు. లజ్జతో తత్తరపాటుతో ఆమె కనురెప్పలు బరువెక్కినాయి. మోహం కాలాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసి విఫలమైంది.

ఇంతకు ముందు ఆమె ఇలా వుండేది కాదు. ఈ రెండు మూడు నెలల నుండే! మనసులో ఆందోళనో, తీరిక చిక్కనివ్వని పనులో, మరింకేమిటో?! అప్పటికీ సహాయానికి దిగాడు. అదే మూకుడు. అదే నూనె. కానీ ఆ ఆలూ వేపుడు ఓసారి కుదిరినట్లు మరింకోసారి కుదరదు. ఎందుకో అర్థంకాదు. పోనీ గిన్నెలు కడిగి పెడదామంటే జిడ్డు వదలలేదంటుంది. తానూ ఆఫీస్ పనితో పాటు మరెన్నో పనులు చక్కబెట్టుకుని వస్తోంది కదా!

ఈ ప్రపంచం ఎంత వింతైనదంటే, ఒకే వీధిలో ఏళ్ళ తరుబడి వుంటూ కూడా పలకరించుకోకుండా, ఎదురైతే కనీసం నవ్వకుండా జీవితాలు గడిపేసేవాళ్ళు ఎందరో?! అందులో ఇతడు పరాయివాడికన్నా ఎక్కువే. అందుకే ఎదురైతే ముభావంగా పక్కకి తప్పుకుని పోయే మేమిద్దరం మాట్లాడుకోవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ నిన్నటి రోజున అదే జరిగింది.