రచయిత వివరాలు
పూర్తిపేరు: అయినవోలు ఉషాదేవిఇతరపేర్లు:
సొంత ఊరు: నర్సంపేట (వరంగల్ జిల్లా)
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు.
అయినవోలు ఉషాదేవి రచనలు
- తెలుగుదారి ఒకదారి మాత్రమే మే 2024 » సమీక్షలు
- మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు ఏప్రిల్ 2022 » వ్యాసాలు
- కేతన ఆంధ్ర భాషాభూషణము-8 వ్యాసాలు » సెప్టెంబర్ 2021
- కేతన ఆంధ్ర భాషాభూషణము-7 ఆగస్ట్ 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్ర భాషాభూషణము-6 జులై 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్ర భాషాభూషణము-5 జూన్ 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్ర భాషాభూషణము-4 మే 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 3 ఏప్రిల్ 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2 మార్చి 2021 » వ్యాసాలు
- కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం ఫిబ్రవరి 2021 » వ్యాసాలు