Colonial Park

తెలతెలవారే ముందు
అలలు లేని కొలను
ఆ పై ఆవరించుకుని
సొగసులద్దే
పొగమంచు

తళతళ లాడే సూర్యుడు
అలలపై రాలే ఆకులను
వెలిగిస్తాడు


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...