[ఈ రచన ఈమాట నవంబర్ 2007 సంచికలో ప్రచురించబడిన “విద్యాసుందరి” అన్న వ్యాసానికి అనుబంధం. — సంపాదకులు]
ఓం శ్రీమదస్మత్సద్గురుస్వామినశ్చరణారవిందాభ్యాం నమోనమః
ఓం మహాగణపతిసరస్వతీధ్యానసేవాయత్తచిత్తాయ నమః
ఓం శ్రీమత్కాకర్లవంశాబ్ధిచంద్రాయ నమః
ఓం రామబ్రహ్మపుత్రరత్నాయ నమః
ఓం శాంతాంబాగర్భశుక్తిమౌక్తికాయ నమః
ఓం శ్రీమత్కమలాలయపుణ్యక్షేత్రజన్మక్షేత్రాయ నమః
ఓం శ్రీమత్పంచనదక్షేత్రనివాసాయ నమః
ఓం శ్రీకావేరీతీరవాసాయ నమః
ఓం శ్రీత్యాగరాజనామాంకితాయ నమః
ఓం శొంఠివేంకటరమణార్యాదిసద్గురుపరంపరానుసంధానాధీనమానసాయ నమః
ఓం అనేకకోటిరామమంత్రపురశ్చరణతపస్సిద్ధియుక్తాయ నమః
ఓం పరమరామభక్తాగ్రేసరాయ నమః
ఓం వాల్మీక్యంశసంభూతాయ నమః
ఓం శ్రీమద్రామాయణరహస్యార్థప్రకాశాయ నమః
ఓం నారదానుగ్రహలబ్ధస్వరార్ణవాయ నమః
ఓం పరస్సహస్రశ్రీరామనామకృతిపతయే నమః
ఓం ఉంఛవృత్తిప్రియాయ నమః
ఓం హరినామసంకీర్తనప్రియాయ నమః
ఓం ప్రహ్లాదభక్తవిజయప్రబంధరచనాధురంధరాయ నమః
ఓం నౌకాచరిత్రకవయిత్రే నమః
ఓం పరబ్రహ్మానుసంధానాయత్తచిత్తాయ నమః
ఓం నాదసుధారసపరిపూర్ణాయ నమః
ఓం మానసికపూజాధురంధరాయ నమః
ఓం సదాశిష్యబృందపరివేష్టితాయ నమః
ఓం సర్వసమదర్శినే నమః
ఓం లోకక్షేమకరావతారాయ నమః
ఓం నిరస్తనరస్తుతయే నమః
ఓం శ్రీరామచంద్రపూజాధురంధరాయ నమః
ఓం సంగీతశాస్త్రప్రవీణాయ నమః
ఓం నవతులసీమాలాభూషణాయ నమః
ఓం శ్రీరామచంద్రచిత్తహితాయ నమః
ఓం నిరాశాయ నమః
ఓం యదృచ్ఛాలాభసంతుష్టాయ నమః
ఓం సంగీతవిద్వజ్జనభుక్తిముక్తిప్రదాయకాయ నమః
ఓం ఆంధ్రభూసురకల్పద్రుమాయ నమః
ఓం ద్రవిడదేశతిలకాయ నమః
ఓం గానభజనానందకీర్తనతత్పరాయ నమః
ఓం శంకరప్రియాయ నమః
ఓం తామసాదిగుణరహితాయ నమః
ఓం శిష్యహృత్తాపహరాయ నమః
ఓం సదానాదోపాసనతత్పరాయ నమః
ఓం గీతాద్యఖిలోపనిషత్సారవేత్త్రే నమః
ఓం పరమపావనాయ నమః
ఓం అఖండానందస్వరూపాయ నమః
ఓం సదానందబోధాయ నమః
ఓం సచ్చిదానందరూపాయ నమః
ఓం పరమకారుణికగురవే నమః
ఓం సత్యజ్ఞానానందస్వరూపాయ నమః
ఓం సర్వధీసాక్షిభూతాయ నమః
ఓం తత్త్వమస్యాదిమహావాక్యలక్ష్యార్థస్వరూపాయ నమః
ఓం శాంత్యతీతకళాత్మకాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పుణ్యశీలాయ నమః
ఓం అవ్యాకృతాకాశాయ నమః
ఓం శుద్ధబుద్ధముక్తసత్యస్వరూపాయ నమః
ఓం శివవిష్ణుభేదరహితాయ నమః
ఓం బ్రహ్మానందరసనిమగ్నహృదయాయ నమః
ఓం అనేకరాగప్రకాశకాయ నమః
ఓం పవమానసుతానుగ్రహపాత్రాయ నమః
ఓం శ్రీరామచంద్రదర్శనోత్సుకాయ నమః
ఓం భక్తజనహృత్పంజరశుకాయ నమః
ఓం నాదసరసీరుహభృంగాయ నమః
ఓం నానాతానగానానుపమానవిజ్ఞానాయ నమః
ఓం పునరావృత్తిరహితాయ నమః
ఓం కరధృతతాళతంబురాదిభజనసాధనాయ నమః
ఓం సీతారామలక్ష్మణాంజనేయవిగ్రహారాధనతత్పరాయ నమః
ఓం శ్రీరామచంద్రదివ్యమంగళవిగ్రహసందర్శనానందితాంతరంగాయ నమః
ఓం మహనీయాయ నమః
ఓం శతరాగమాలికారచయిత్రే నమః
ఓం శ్రీజనకజామృదుపాదారవిందదాసాయ నమః
ఓం సుస్వరరాగతాళరసికాయ నమః
ఓం వివాదిమదహరణప్రభావాయ నమః
ఓం శ్రీత్రిపురసుందరీసేవకాయ నమః
ఓం జితారిషడ్వర్గాయ నమః
ఓం విమలహృత్కమలాయ నమః
ఓం ప్రహ్లాదనారదపురందరరామదాసాదిహరిభక్తస్తుతికరాయ నమః
ఓం నిష్కామకర్మోపాసకాయ నమః
ఓం సజాతీయవిజాతీయస్వగతభేదశూన్యాయ నమః
ఓం దయాశీలవ్రతదానాతిగుణయుక్తాయ నమః
ఓం సర్వకర్మపరిత్యాగినే నమః
ఓం శ్రీరామతారకమంత్రమాణిక్యతోరణాలంకృతనిజహృన్మందిరాయ నమః
ఓం ప్రణవనాదమంగళవాద్యరసపూరితశ్రోత్రానందాయ నమః
ఓం సారాసారవిచారవిశారదాయ నమః
ఓం నిజాచార్యస్వహస్తాబ్జవిదితచిద్వస్తుతత్త్వవేదినే నమః
ఓం విషమవిషసమస్తకలుషవిషయవిముఖాయ నమః
ఓం యాగయోగజపతపస్సత్యశౌచయుక్తాయ నమః
ఓం అనవరతరామనామసంకీర్తనతత్పరాయ నమః
ఓం వేదవేదాంతతత్త్వవివేచననిపుణాయ నమః
ఓం స్వరార్ణవరహస్యపరిజ్ఞాత్రే నమః
ఓం రాగసుధాంబుధితత్త్వరహస్యప్రకాశకాయ నమః
ఓం నాదాత్మకసప్తస్వరసుధారసపానమత్తచిత్తాయ నమః
ఓం బ్రహ్మానందసుధాంబుధిమర్మవిదుషే నమః
ఓం యోగముద్రాన్వితాయ నమః
ఓం ప్రాప్తయోగసిద్ధయే నమః
ఓం పరమభక్తజనార్చితపాదారవిందాయ నమః
ఓం యోగీంద్రాయ నమః
ఓం కలికల్మషనాశనాయ నమః
ఓం పంచసమాధిక్షేత్రస్థితాయ నమః
ఓం రామకథాసుధారసపానమత్తచిత్తభృంగాయ నమః
ఓం ముముక్షుజనసుప్రీతాయ నమః
ఓం ముక్తికాంతామనోహరాయ నమః
ఓం సర్వసంసారరోగభేషజాయ నమః
ఓం మిథ్యాసంశయనాశకాయ నమః
ఓం సర్వశాస్త్రతత్త్వజ్ఞాయ నమః
ఓం మహావాక్యప్రభావజ్ఞాయ నమః
ఓం జ్ఞానసింహాసనాధీశాయ నమః
ఓం కాషాయాంబరధారిణే నమః
ఓం సర్వతత్త్వప్రదర్శనాయ నమః
ఓం శ్రీత్యాగరాజపరబ్రహ్మణే నమః