ఏకధాతు దివ్యనామకీర్తన – “శ్రీరామ జయరామ”

[త్యాగరాజు రచించిన ఈ దివ్యనామ సంకీర్తన ఈమాట నవంబర్ 2007 సంచికలో ప్రచురించబడిన “విద్యాసుందరి” అన్న వ్యాసానికి అనుబంధం. — సంపాదకులు]

రాగము – యదుకులకాంభోజి
తాళము – ఝంపె
శ్రీరామ జయ రామ శృంగారరామ యని
చింతింపరె ఓ మనసా
తళుకు చెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును
తప మేమి జేసెనో
కౌసల్య తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
దశరథుడు శ్రీరామ రామ యని పిల్వ మును
తప మేమి జేసెనో
దశరథుడు తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
తనివార పరిచర్య సేయ సౌమిత్రి మును
తపమేమి జేసెనో
సౌమిత్రి తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
తనవెంట జన జూచి యుప్పొంగ కౌశికుడు
తపమేమి జేసెనో
కౌశికుడు తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
తాపంబడంగి రూపవతి యౌట కహల్య
తపమేమి జేసెనో
అహల్య తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
ధర్మాత్ము చరణంబు సోక శివచాపంబు
తపమేమి జేసెనో
శివచాపంబు తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
తన తనయ నొసగి కనులార కన జనకుండు
తపమేమి జేసెనో
జనకుండు తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
దహరంబు కరగ కరమును బట్ట జానకి
తపమేమి జేసెనో
జానకి తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ
త్యాగరాజాప్త యని పొగడ నారదమౌని
తపమేమి జేసెనో
నారదమౌని తపమేమి జేసెనో తెలియ
శ్రీరామ జయ రామ శృంగారరామ