మేకప్

ఇవ్వాళ నెరిసిన జుట్టుకు
నల్ల రంగు వేస్తూ
వయసును దాస్తున్నాను

కోరికలు తల వాలుస్తున్నప్పుడు
తెల్లని మీసాల కొత్తింటికి రంగేసి
యవ్వనాన్ని మోసం చేస్తున్నాను

మిడతలు మేసిన చేనులా
ముడతలు పడుతున్న ముఖాన్ని
బ్యూటీ పార్లర్‌లో సరిచేసుకుని
చర్మం మర్మం తెలియనివ్వను

సొలుగుతున్న అడుగులకు
బూట్లు తొడిగి
నడుస్తూ నటిస్తున్నాను

ఇది మేకప్ కాదు
వేకప్ కాల్ కూడా

ఇంతచేశాక కూడా
నుయ్యిలో పడి లోగొంతుకతో
బతుకు మూలుగుతుంది

కంప్యూటర్ కాదు
పొద్దు వాలిన జీవితం
రిఫ్రెష్ బటన్ నొక్కగానే
కరప్ట్ ఫైళ్ళను యాంటీవైరస్‌తో
ఉదయంలా శుభ్రపరచడానికి.

ఇది సెలవు తీసుకుంటున్న
నిస్సాయ సంధ్య.