పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. రెండు కవితలు గురించి KS Kiran Kumar అభిప్రాయం:

    08/31/2007 1:27 am

    చాలా చాలా బాగున్నాయి.

  2. చిలక – గోరింక గురించి Raghu అభిప్రాయం:

    08/29/2007 1:43 am

    కథ లో సమస్య వివరించారు కాని పరిష్కారం చూపలేదు.ఆర్దిక స్వాతంత్ర్యం లేనపుడు బానిస బతుకు కింద లెక్క. కాని వ్యవస్త తీరు లో మహిళ బానిస కు బానిస మాత్రమే. మగవాళ్ళ జీవితం కూడా కార్యాలయాలలొ బానిస జివితమే కాదంటారా. ఇరువురి మద్య వ్యక్తిత్వ పోరాటం లో పిల్లల విషయం సమస్య గా మారుతుంది. నేను కథ చదువుతున్నపుడు అలాగే వెలుతుంది అనుకున్నాను. శశాంకె బాల్యంలో తను కొల్పోయిన ఆత్మీయత గురించి చెపతాడనుకున్నాను. ఉత్పత్తి కంటే పునరుత్పత్తి గొప్పది. పిల్లలని వుంచె క్రెచెస కి వెల్లి చూస్తె సంపాదన, వ్యక్తిత్వం, హక్కుల పోరాటం లో మద్యలో నిజంగా నలిగి పోతుంది వాళ్ళే అనిపిస్తుంది. కథలో చివరికి నలుగురిలో గుర్తింపు కోసమే ఉద్యోగం అనడం సమస్యను పక్కదారి పట్టించినట్టు అయింది. స్వేచ్చ కోసం చేసే పోరాటం గుర్తింపు కోసం చేసే పోరాటం వేరు. హక్కుల కోసం పోరాటం చెసేటపుడు ఇతరుల పట్ల బాద్యతను గుర్తెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలను హొల్డ్ చెసే ఓపిక, బాద్యత తక్కువ అవుతున్నపుడు మద్యలో నిజంగా కొల్పోతుంది పిల్లలే. బ్లాగ్ గురించి తెలిసి ఈ రొజే ఒపెన్ చేసి నా అబిప్రాయం చెపుతున్నాను. మొదటి సారి తెలుగు లో వ్రాయడం (టయిప్ చేయడం ఇబ్బంది ఐంది) స్పష్టంగా చెప్పలేకపొతే అన్యద బవించకండి.

  3. అతిథి వ్యయో భవ గురించి Sobhan అభిప్రాయం:

    08/27/2007 9:15 pm

    The story is really very good and interesting.

  4. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/26/2007 8:29 am

    తెలుగు భాష ప్రాచీనత గురించిన తర్జనభర్జనలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో తెలుగు భాష యొక్క చరిత్ర పట్ల ఆసక్తి పెరుగుతోంది. అందుచేత ఇంతవరకూ తెలుగుభాషా శాస్త్రంలో జరిగిన కృషి గురించి నలుగురూ తెలుసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. సామాన్యంగా తెలుగు సాహిత్యం అంటే ఇష్టపడేవారు సైతం ఇటువంటి అంశాలతో ఎక్కువ పరిచయం కలిగి ఉండరు. ఇటీవల ‘ఆంధ్రభూమి’లో దీన్ని గురించి సురేశ్ కొలిచాలగారి వ్యాసం వెలువడింది. విషయాలని గురించి సులభశైలిలో విశదపరిచే వ్యాసాలని ఆయన ‘ఈమాట’లో ఒక పరంపరగా రాస్తే బావుంటుందని నేననుకుంటున్నాను.

  5. రెండు కవితలు గురించి kbssarma అభిప్రాయం:

    08/25/2007 6:38 am

    కవితలు చాలా బాగున్నాయి. అల్పం లో అనల్పం.

  6. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Sivasankar అభిప్రాయం:

    08/23/2007 11:18 pm

    చాలా బాగా వ్రాశారు. కధని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
    ధన్యవాదములు.
    శివ శంకర

  7. టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్ గురించి sowmya అభిప్రాయం:

    08/21/2007 8:33 pm

    సూర్యకుమారి గారి గురించి వినడమే తప్ప పాటలు విన్నది లేదు ఇన్నాళ్ళూ. ఈ మధ్యనే ఓ ఆన్లైన్ సైటు ద్వారా ఒకటి రెండు పాటలు వినగలిగాను. ఈ పుస్తకం విషయం ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు.

  8. రెండు కవితలు గురించి Alok అభిప్రాయం:

    08/17/2007 1:37 am

    మోహన్ రావ్ జీ

    అక్కడి రసాస్వాదనకి ఇక్కడి రసాస్వాదనకి తేడా లేదా?

  9. ఆ రోజులు గురించి Alok అభిప్రాయం:

    08/17/2007 1:16 am

    డాక్టర్ ని గూడా రోగి బాధల్ని చూస్తూ సర్జరీ అనవస్రమని చెప్పగల్రా మోహన్ రావ్ జీ! పిల్లలు తప్పుజేస్తుంటే రసాస్వాదన జేస్తూ పెద్దలు కూర్చోగల్రా?

    ఇంతకూ రసాస్వాదన అంటే ఏమితో చెప్పండి?

  10. అతిథి వ్యయో భవ గురించి krishna అభిప్రాయం:

    08/16/2007 12:51 pm

    కథ అనేది జీవిత సంఘటనల ఆధారంగానే వ్రాయడం జరుగుతుంది. అందువల్ల disclaimers అవసరం లేదని నా అభిప్రాయం. రచయిత చేసిన కొన్ని కొత్త పద ప్రయోగాలు బాగున్నాయి. ఎదో సరదాగా కాలక్షేపానికి వ్రాసుకున్న కథ. అంతే. ఇలాంటి బాధితులకు మరొక్కడు తమలాటివాడు ఉన్నాడని తెలిసి కొద్దిగా ఉపశమనం కలగవచ్చు.
    అమెరికాలో అతిధుల వల్ల జరుగుతున్న బాధలను సరదాగా ఎత్తి చూపడం ఏమంత కొత్త విషయమం కాదు. ఇదివరకే ఎన్నో కథలు వచ్చాయి. old story told again. Nothing new అన్నిట్లోనూ పాపం భారతదేశం నుండి వచ్చిన అతిథులు విలన్లు మాత్రమే అవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎక్కువ వస్తున్న కొద్దీ అందరూ అలానే ఉంటున్నారన్న భావం చాలా బలపడుతుంది.
    ఈ కథలో సుందరమ్ మామయ్య, కమేడియన్లు అందరూ విలన్లే. అందువల్ల రచయిత చెప్పదలచుకున్న విషయం పలచబడిపోయింది. ఇంటికొచ్చిన అతిథులు అద్భుతంగా ఉంటే, వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడి ఉంటే వెంకీకి ఇంత బాధ ఉండేది కాదు. పైపెచ్చు ఆనందం కూడా వేసేది. అలాంటి ఒక వెంకీని నేనొకడిని కాబట్టి ఆపుకోలేక ఈ అభిప్రాయం చెబుతున్నాను. అందుకనే ఇదొక సరదా కథే అని, చాలా మంచిగా ఉండేవాళ్ళూ చాలా మందే ఉన్నారన్న విషయం గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం.