పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. రచయితలకు సూచనలు గురించి santhosh అభిప్రాయం:

    08/07/2007 8:08 am

    ప్రియమైన ఎడిటర్ గారికి,
    మీ website చూడముచ్చటగ వుంది. మీ ప్రయత్నానికి జోహార్లు.
    ధన్యవాదములు
    ఇట్లు
    సంతోష్ కుమార్

  2. న త్వం శోచితుమర్హసి గురించి Dileep అభిప్రాయం:

    08/06/2007 3:00 pm

    ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు. వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.

    నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి – మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.

    అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “). అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (“మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.

    మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి నీళ్ళు తెప్పించారు.

    దిలీప్.

  3. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి mohanraokotari అభిప్రాయం:

    08/06/2007 6:46 am

    xellent

  4. అతిథి వ్యయో భవ గురించి sreedhar అభిప్రాయం:

    08/02/2007 2:40 pm

    To put it mildly it’s a pointless story. Writer tried (in vain) to fabricate a story around a peculiar situation he found himself (or someone he knew had been subjected to). A good writer takes a simple incident and beams it through prism of imagination, sprinkles fiction, pad little melodrama, tops with some wisdom and weaves a good story.

    Folly of many writers (or directors like dasari) is that they get carried away with mundane incidents and expect the readers to indulge in their ill-conceived euphoria.

    Having said the above, I find Mr. Raavi Subbarao’s criticism too harsh and silly. We may not like the story or the style, but to go into details and analyze sentences and criticize is child-like. Someone aptly used “Radhranveshana”.

    Cheers, DumDum Bhattu

  5. అతిథి వ్యయో భవ గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    08/01/2007 10:28 am

    కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉండి సరదగా చదువుకోవడానికి ఎంతో బాగుంది. కొన్ని ప్రయోగాలు బావున్నాయి. గొర్తి గారికి అభినందనలు.

  6. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/31/2007 6:29 am

    సి.ఎస్.రావుగారి ప్రోత్సాహానికి కృతజ్ఞత చెప్పాలి.

    సంగీతంలోని నా వ్యక్తిగత అభిరుచే కాక ఈ వ్యాసాలకు మరొక ప్రేరణ కూడా ఉంది. ‘హిందూస్తానీ సంగీతంలో ఇందరు గొప్పవారు ఇంతటి కృషి చేస్తూ ఉంటే విని మెచ్చుకున్న తెలుగువారే లేరా?’ అంటే ఉన్నారనే చెప్పాలి. ఎటొచ్చీ సదాశివ, నండూరి పార్థసారథి మొదలైన కొద్దిమంది తప్పిస్తే ‘రాసేవాళ్ళు ఆ సంగతి పట్టించుకోరు; సంగీతాభిమానులు రాయ (లే) రు’ అని నా కనిపిస్తుంది. అందుచేత తెలుగువారి తరఫునా (‘వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను’ అంటే అతిశయోక్తి అవుతుందేమో కాని) ‘వాహ్, ఉస్తాద్’ అనాలని నా కోరిక.

    కారణం తెలియదుగాని సంగీతం విషయంలో తెలుగువాళ్ళు కాస్త ‘అణగిమణగి’ ఉండడం కనిపిస్తుంది. కర్ణాటక కచేరీల్లో తమిళులు పంచెలు కట్టుకుని హడావిడిగా, అట్టహాసంగా తిరుగుతారు కాని ప్రేక్షకుల్లో 30 శాతం ఉండే తెలుగువారు మటుకు చడీచప్పుడూ కాకుండా హాజరయి వెళిపోతూ ఉంటారు.

    ఇక రచన మాటకొస్తే ఇందులో అమీర్ ఖాన్ ప్రతిభే ప్రధానం. నేను పంపిన ఆడియో లింకులు వింటూ తాను చేపట్టిన ప్రూఫ్ రీడింగ్ సంగతే మరిచిపోయానని సంపాదకులు అన్నారు. అంతకన్నా మంచి నిదర్శనం అనవసరం.

  7. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి C.S.Rao అభిప్రాయం:

    07/30/2007 6:26 pm

    ఖండాంతరాల లో సాంకేతిక పరమైన ఉద్యోగాలు చేస్తూ తెలుగు సాహిత్యంలో, సంగీతం లో వివిధ సాంస్కృతిక కళా రూపాలలో,సంప్రదాయ రీతులలో అభిరుచి,అభినివేశం కలిగి సాధికారికంగా రచనలు చేస్తున్నవారిని చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతుంది,ఆనందం వేస్తుంది.వీరికి ఇంత తీరిక ఎక్కడదా అన్పిస్తుంది.బహుశా వారి కృషిని సులభతరం చేస్తున్నది వారి expert computer access capabilities అయి ఉండవచ్చుననుకుంటాను.

    ప్రఖ్యాత హిందూస్తానీ గాయకులు ఉస్తాద్ అమీర్ ఖాన్ గారి మీద రోహిణీప్రసాద్ గారి వ్యాసం చాలా బావుంది.దానికి కారణం రచయితకు సంగీతం పైన ఉన్న గాఢమైన ప్రేమ ,విషయ పరిజ్ఞానం,సరళమైన ,నిరాడంబరమైన,ఆకర్షణీయమైన భాషలో స్వానుభవం లోంచి వచ్చిన తులనాత్మక విశ్లేషణ.We find a blend of narrative and analytical elements which lends a pleasing comprehensiveness to the article.

    వ్యాసం లో పేర్కొనబడిన సంగీత విద్వాంసులందరూ హిందూస్తానీ శాస్త్రీయ సంగీత సాధన ఒక తపస్సుగా సాగించటం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి అద్దం పడుతుంది.

    వ్యాసమంతటా విషయ విపులీకరణ,విశ్లేషణే కాని రోహిణీప్రసాద్ గారు కనిపించరు.అది ఆయన egoless exposition ని ,openmindedness ని సూచిస్తవి.

    రోహిణీప్రసాద్ గారు విషయపరమైన మౌలిక శోధనలో ,బాహిరమైన ఇతరేతర ప్రభావాలకు తాను లోను కాకుండా ఉండటం గమనార్హం,హర్షదాయకం.

    అభినందనలు
    C.S.Rao

  8. రచయితలకు సూచనలు గురించి Purnapragnabharathy అభిప్రాయం:

    07/30/2007 10:04 am

    ఈ పత్రికను మొట్టమొదటి సారి చదివినప్పుడు చాలా ఆనందం అనుభవించాను. నేను హైదరాబాదులో ఉంటాను. నేను నా రచనలని పంపవచ్చా?

  9. నందిని గురించి netijen అభిప్రాయం:

    07/29/2007 1:33 am

    కొన్నాళ్ళ క్రితం నందిని అని ఒక కథ వచ్చింది. ఆ కథ చివర్లో రచయిత “చెలియలి కట్ట” అనే మాటని అసందర్భంగా వాడారు. ప్రముఖ కవీ విమర్శకుడూ వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక విమర్శ రాస్తూ ఈ అసందర్భ ప్రయోగాన్ని చేటలో వేసి చెరిగి వొదిలి పెట్టారు.
    మీ రేమటారు?

  10. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/28/2007 10:56 am

    రూపాల్లో భేదం – ఓ సందేహం

    ముందుగా, తానా అవార్డు అందుకున్నందుకు వెల్చేరు గారికి అభినందనలు. తెలుగు భాష, సాహిత్య, చరిత్రలపై వారు చేస్తున్న నిర్విరామ కృషి ముందుతరాల వారికి మార్గదర్శకం. వేలూరి గారి వ్యాసం వెల్చేరు గారి బహుముఖ పాండిత్యానికి అద్దం పట్టేటట్లుంది..

    కాని వ్యాసం మొదట్లో అన్న మాటలు – “వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది” – నన్ను చాలా తికమక పెట్టాయి. కాల్పనిక కథకి ఒక్క రూపమే ఉండటమేమిటి? దానిని అంత నొక్కి చెప్తున్నారంటే గొప్ప ప్రాధాన్యత ఉండాలి – అదేంటో నాకర్థం కాలేదు, వేలూరి గారివీ విప్లవ్ గారివీ ఉదాహరణలు సాయపడలేదు.

    సరే, David Shullman అంత పండితుడికే అంతుపట్టని విషయం నాకు అవగతం కాదులే అని సమాధానపడ్డాను. ఇంతలో Dr. Mittapalli వ్యాసంపై నేను వెలిబుచ్చిన అభిప్రాయనికి బదులు రాస్తూ ఓ మిత్రుడు, చెప్పుకోదగ్గ చదువరి, వెల్చేరు రాసిన ఒక వ్యాసం – “When Does Sita Cease To Be Sita? Notes Toward a Cultural Grammar of Indian Narratives” – చదివారా అని అడిగారు. రామాయణం గురించి లవకుశ లాంటి సినిమాలు చూడటం వలన కలిగిన జ్ఞానం కన్నా మించి నాకు లేదు; అలాంటి లోతైన వ్యాసాలు నేనేమీ చదవలేదు మహానుభావా అనుకొని, ఆమధ్య Berkeley వాళ్ళు చవగ్గా అమ్ముతున్నారు కదా అని కొని చదవని ఓ రామాయణం పుస్తకం [1] ఇంట్లో ఉంటే దాంట్లో దీనికి సంబంధించినదేమన్నా ఉండొచ్చు అని తీశాను. దాని మొదటి పేజీలో ప్రస్ఫుటంగా వేసిన వెల్చేరు వాక్యం నన్నాకర్షించింది:

    “Fiction has only one form. True story has inevitably many.”

    దీన్ని నేను తెలుగులోకిలా తర్జుమా చేసుకున్నాను: “సామాన్య కథకి ఉండేది ఒకటే రూపం. కాని సజీవ కథకి సహజంగానే అనేక రూపాలుంటాయి.” నేను పైపైన చదివిన ఆ పుస్తకంలో రామాయణ కథకి గల అనేక రూపాలని వివరించారు. కాలం మారేకొలదీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఈ కథ కెన్ని మార్పులూ చేర్పులూ చేరాయో విశ్లేషించారు. ఇది నాకర్థమయింది.

    కాని ఆ తిరుపతి మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తూ వెల్చేరు అన్న మాటల్లో అంతరార్థం ఏమిటో నాకింకా బోధ పడలేదు. అక్కడ అన్నదీ, ఇక్కడ [1] అన్నదీ ఒకటేనా? వేరా?

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1] “Questioning Ramayanas: A South Asian Tradition,” Edited by Paula Richman. Univesity of California Press, 2001. దీంట్లోని వెల్చేరు వ్యాసం, “The Politics of Telugu Ramayanas: Colonialism, Print Culture, and Literary Movements,” చదవదగ్గది. గత శతాబ్దంలో మన సాహిత్యంలో రామాయాణం మీద వచ్చిన అనేక రకాల రచనల్ని వాటి వెనకవున్న సామాజిక కారణాలపరంగా విశ్లేషించారు.