వస్తువులోనూ, కథనంలోనూ ఎన్నదగినవిగా ఉన్నవి ముఖ్యంగా రెండు. అవి జిగిరీ, తోలుబొమ్మలాట. జిగిరీ నవల మానవుడిలో ఉన్న రెండు పార్శ్వాలను స్పృశించిన రచన. తోలుబొమ్మలాట- ఆధునికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన వినోదాలుకూడ టీవీ, సినిమాలకు పరిమితమై, దేశీయ కళలు, జానపద ప్రదర్శన కళలు కనుమరుగైపోతున్న విషయం ఇందులో వస్తువు.

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు.

తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ – చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.

అనురాగాల అందమైన జగతిలో
మమతల దీపం అమ్మ
మెరిసే నక్షత్ర వినీలాకసంలో
పున్నమి జాబిలి అమ్మ

మనోజ్ఞ జలధితరంగ విన్యాసముల వెదకితినెన్నాళ్ళు
మనోహర మాకరంద గాన మాధుర్యము కొరకు
సుందరోద్యాన సుధానికుంజముల వెదకితి నెన్నాళ్ళు
సురుచిర సౌరభశ్రీ సామీప్యము కొరకు

నే నిద్దుర లేచినపుడు నాతోనే లేచింది
ఆపై ప్రతి అడుగులోన నావెంటే నడిచింది

ఉద్యోగం దొరికినపుడు ఉద్వాసన కలిగినపుడు
ఉల్లాసం కలిగినపుడు ఉద్వేగం రేగినపుడు

నేల బంధాన్ని వదలలేక
వలస పక్షులు కాలేక
నిరీక్షణ శ్వాసకోశాలలో ఆక్సిజన్‌ని తిరిగి నింపి
ఒయాసిస్‌ ఆశతో
బ్రతుకు విత్తనాన్ని రేగడి క్షేత్రంలో నాటితే
విగత స్వప్నాలు పండుతున్నాయి.

ఆటా నిర్వహించిన కవితల పోటీ కూడా సహజంగానే ఆసక్తిని కలిగించినట్లు కవుల ప్రతిస్పందన తెలియజేస్తుంది. ఆటా వారు నిర్వహించిన పోటీకి 494 కవితలు వచ్చినాయి. 227 మంది కవులు పాల్గొన్నారు. 182 మంది పురుషులు 45 మంది స్త్రీలు. వారిలో ప్రవాసాంధ్రులు 7గురు. 6గురు ఇతరరాష్ట్రాలవారు కాగా ఒక్కరు విదేశీయురాలు. అందునా కువైట్‌ నుండి పాల్గొనటం విశేషం.

బరిబత్తల తనం బయటపడకుండా,
ఆఖరికి గోసిగుడ్డ మిగిలింది
శెలకల సారం సత్తెనాస్‌ ఐనంక
శేరిత్తులుసుక దోసిళ్ళ పడ్తలేవు
పేగు తిత్తులు ఎన్నటికి సల్లపడుతలేవు

1891లో కోనసీమలో శుద్ధశ్రోత్రియ వైదిక బ్రాహ్మణ పుటక పుట్టి, 1961లో చనిపోయే లోపల చిన్నా పెద్దా నిడివిగల 65 తెలుగుకథలు రాసిన శాస్త్రిగారిని తెలుగు ప్రపంచపు దిగ్దంతులు చాలామంది గొప్ప స్రష్టగానూ, గొప్ప వ్యక్తిగానూ గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తిగారు ఈయన్ని ‘కథక చక్రవర్తి’ అన్నారు. పోరంకి దక్షిణామూర్తిగారు ‘జాతి రచయిత’ అని చాటగా, వాకాటి పాండురంగారావుగారు ‘తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయిత’ అన్నారు. ‘కనక్‌ ప్రవాసి’గారు ఈయన రచనలమీద పి.హెచ్‌డి.,పరిశోధన గ్రంథం ప్రచురించి వాటికి ‘అకాడమీ’లో స్థానాన్ని ఇచ్చారు.

నా జాడ నేను కోల్పోయాను
నా పరిచయ వాక్యం నన్ను వెతుక్కుంటోంది
పరచుకున్న రస్తాలు
తప్పిపోయిన నా అడుగుల కోసం నిరీక్షిస్తున్నాయి
అనాథగా నా నీడ

ఈ పుస్తకానికి ‘కబురు’ అనే పేరు పెట్టడానికి కారణం, ఈ పుస్తకంలో మన జాతి మేలుకొని వినవలసిన కబురుంది. హెచ్చరిక వుంది. పిలుపుంది. మనని చుట్టుముట్టిన ‘ఎత్తుటెక్కు’ రణగొణ ధ్వనిని చీల్చుకుని, దేశం మహాబలవంతుల జాబితాలోకి చేరిపోతోందనే నినాదాల హోరుని పెకల్చుకొని మనని చేరడానికి ప్రయత్నించే సన్నని మూల్గులున్నాయి.