రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఏప్రిల్ 2026

ఏ కళాకృతికైనా పరిశీలన, ఊహాశక్తి, అనుభూతి, సానుభూతి, సంఘర్షణ, భాషా నైపుణ్యం, శైలి — ఇవన్నీ మౌలిక వనరులు. సృజనాత్మక సాహిత్యం అనేది కేవలం పదాల కూర్పు కాదు; అది ఒక మనిషి అనుభవాల సారం, హృదయ స్పందనల ప్రతిబింబం. సాహిత్యం మానవ సహజానుభూతిని, యథార్థ సదృశమైన ఊహాప్రపంచాన్ని పాఠకుల కళ్ళముందు ఆవిష్కరించి ఆలోచనలు రేకెత్తిస్తుంది. విస్తృతంగా చదవడం, ఆకళింపు చేసుకోవడం, ఆ అవగాహనతో స్వంత ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడం ద్వారా పుట్టిన రచనాఝరి మాత్రమే పాఠకసాగరంలో విలీనమై సహజపూర్వకమైన సార్థకత పొందుతుంది. ఎక్కువ చదువుతూ, తక్కువ రాయాలన్నది అనేకమంది సాహితీ స్రష్టలు పాటించే నియమం, జగమెరిగిన సత్యం కూడా. శ్రుతి (తాను విన్నవి) స్మృతి (తాము వీక్షించి అనుభవించినవి) అన్నవి చాలామంది సృజనకు పునాదిరాళ్ళు. ప్రయోజనకరమైన ఆలోచనలను పఠనీయంగా అక్షరబద్ధం చేయడం ఒక అద్భుతమైన కళ; అది కొందరికి స్వతస్సిద్ధంగానూ, మరికొందరికి సాధన ద్వారాను అబ్బుతుందన్నది వాస్తవం.

కానీ నేడు, ప్రతి క్షణమూ పెద్ద అంగలు వేస్తూ దూసుకుపోతున్న సాంకేతికత వల్ల ఆవిర్భవించిన కృత్రిమ మేధ, పుట్టిన బిడ్డలా రోజురోజుకూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మానవమేధకు దుస్సాధ్యమైన వాటిని చిటికెలో సుసాధ్యం చేస్తోంది. ఇది మనిషి కుతూహలానికి, అన్వేషణాపటిమకు నిదర్శనమే అయినా, కవిత్వం, కథల వంటి మానవ సృజనాత్మక ప్రక్రియల్లో దీని ప్రయోగం ఎంతవరకూ సమంజసం అనేది ఇప్పటి ప్రశ్న. ఎగిరే ఏనుగు బొమ్మను సృష్టించడం, గాడిద గొంతును కోకిల స్వరంలా మార్చడం, అడిగిన వెంటనే కథనో, కవితనో అల్లిపెట్టడం అబ్బురపరచే సాంకేతిక విజయాలే కావచ్చు; కానీ అది ‘యాంత్రిక సృష్టి’ అని ద్రష్టలకూ, పాఠకులకూ సులభంగానే తెలిసిపోతోంది. అర్ధాంతరంగా ఆగిన కథకు ముగింపు సూచించమని కృత్రిమ మేధను కోరవచ్చేమో గానీ, అసలు కథనే సృష్టించి ఇవ్వమని కోరడం భవిష్యత్తులో సబబుగా మారుతుందో లేదో వేచి చూడాలి. మనిషికి మాత్రమే స్వంతమైన ఆలోచనాపటిమను అనుకరిస్తూ, లిప్తల్లో వెలువరించే ఈ రచనల్లో ‘ప్రాణం’ నింపడం కృత్రిమ మేధ ఇంకా నేర్చుకోవలసే ఉంది. ఒక రచయిత తన రక్త మాంసాలను పణంగా పెట్టి, సమాజంలోని ఆర్తిని లేదా తన అంతర్మథనాన్ని కాగితం మీద పెడతాడు. కానీ కృత్రిమమేధ కేవలం అంతర్జాలంలో ఉన్న వేల కోట్ల వాక్యాలను తిరగరాసి ఒక ‘సగటు’ రచనను ఇస్తుంది. ఈ ‘సగటు’ తనమే సాహిత్యానికి అసలైన ముప్పు.

మానవ మస్తిష్కమే ప్రధానాధారం కావలసిన రచనలకు, పూర్తిగా యంత్రాలను ఆశ్రయించడంలోని సామంజస్యం ఇంకా నిగ్గుతేలలేదు. అందుకే, కృత్రిమ మేధ సాయంతో తయారయ్యే ‘యాంత్రిక’ రచనలకన్నా, అసంపూర్ణంగా ఉన్నా సరే… ఒక మనిషి హృదయాంతరాళాల నుండి వెలువడి మరో మనిషి హృదయాన్ని తాకగలిగే మౌలిక రచనలకే మేము ప్రాధాన్యతనిస్తాము. సాహిత్యం అనేది ఒక సామాజిక బాధ్యత. కృత్రిమమేధకు నైతికత ఉండదు, దానికి బాధ్యత తెలియదు. కాబట్టి, సృజనాత్మక రంగంలో మానవ మేధస్సు స్థానాన్ని ఏ యంత్రం భర్తీ చేయలేదు, చేయకూడదు. కళారూపాల సృజనలో కరకు యంత్రాల మాట ఎంతవరకూ చెల్లుతుందనేది కాలమే నిర్ణయించాలి.

కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం

రచన: కొడవళ్ళ హనుమంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

ఈ తరంగాలు ఒక గదిని దాటగలిగినప్పుడు, ఒక ఊరిని, ఒక దేశాన్ని, ఒక ఖండాన్ని, బహుశా మహాసముద్రాలను కూడా దాటగలవు కదా!

6

తమిళ సంగ సాహిత్యం-4: కుఱుందొగై

రచన: చంద్ర మోహన్

మన ప్రియుడు ధనార్జన కోసం వెళ్లి ఏ దేశంలో ఉంటున్నాడో ఆ తెలుగు ప్రజల దేశానికే మనం వెళ్ళిపోదాం. అక్కడి వారి భాష నాకు రాదు. అయినా నా ప్రియుని కోసం ఆ దేశాన్ని నా దేశంగా చేసుకోవడానికి నేను సిద్ధమే.

1

వైరముత్తు – జ్ఞానపీఠ పురస్కారం 2025

రచన: అవినేని భాస్కర్
ఈ ఈ నొక్కి చదవండి...

మొత్తానికి ఆయన కవిత్వంలోనూ, నవలల్లోనూ సాహితీ విలువలు అథమ స్థాయిలో ఉన్నాయని వీరి ఆరోపణ. అంతేకాకుండా, వైరముత్తు మొదటి నుండి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ప్రసన్నం చేసుకుని, వారి ద్వారా పురస్కారాలు పొందడంలో దిట్ట అని విమర్శలు ఉన్నాయి.

7

సూట్‌కేస్

రచన: ఎమ్ కె కుమార్

ఆకాశం బద్దలైంది. చెవులు పగిలిపోయే పేలుడు శబ్దం రాలేదు ముందు. కేవలం తెల్లటి వెలుగు. వేలాది సూర్యులు ఒక్కసారిగా ఇంట్లోకి దిగివచ్చినట్లు… ఆ వెలుగు తీవ్రతకు తన చేతిలోని గ్లాసు, అందులోని నీరు, చుట్టూ ప్రపంచం క్షణంలో ఆవిరైపోయినట్లు అనిపించింది అమీర్‌కు.

2

పోతన భాగవతంలో దృశ్యీకరణం – 6

రచన: కె. వి. గిరిధరరావు

వ్యాస భాగవతంలో రేఖామాత్రంగా వున్న దృశ్యీకరణాన్ని పోతన ఎలా విస్తరింపజేసాడో సోదాహరణంగా వివరించాను. పోతనకు పూర్వం వచ్చిన కావ్యాలలోని దృశ్యీకరణను కొన్ని పద్యాలను, సందర్భాలను ఉదాహరణలుగా తీసుకుని చూపించాను.

0

ఓడిస్సీ – 5: అథీనా – ధూసర నయనాల దేవత

రచన: వేమూరి వేంకటేశ్వర రావు
మూలం: హోమర్

ఆయన తన ఇథకా ద్వీపాన్ని కానీ, తన భార్య పెనలొపీని కానీ, తన కొడుకు టెలెమాకస్‌ని కానీ చూసి ఇరవై ఏళ్ళు కావస్తోంది. కలిప్సో ఎంతగా ప్రేమాభిమానాలు చూపెట్టినా ఒడిస్సియస్ ఇథకాను మరచి, పెనలొపీని విడచి ఉండలేకపోయేడు. తనకు భార్య ఉండడమే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడనిన్నీ, వారిని ఇప్పుడు విడిచి వేరొకరిని వివాహమాడడం ధర్మసమ్మతంగా ఉండదనిన్నీ ప్రాధేయపడ్డాడు.

0

అటజని కాంచె కృషీవలుడు

రచన: కొడవళ్ళ హనుమంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

రవీంద్ర గ్రంథం వాటికన్నా రెండు గుణాలలో విలక్షణంగా ఉంది: దాదాపు ప్రతి అధ్యాయంలోనూ తనకు కలిగిన అనుభూతిని తనదో మరొకరిదో కవిత ద్వారా వెలిబుచ్చడం, చూసిన జనుల జీవనరీతికి స్పందించి తన బాల్యపు పల్లెటూరి అనుభవాలకి అన్వయించుకోవడం.

3

సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం

రచన: కొండలరావు పలకా
ఈ ఈ నొక్కి చదవండి...

భారత స్వాతంత్ర్యోద్యమం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు సౌతాఫ్రికా తప్పక చూడాల్సిన దేశం! గాంధీగారు సౌత్ ఆఫ్రికాలో కొంత కాలమున్నారని చిన్నప్పుడు స్కూలు పుస్తకాల్లో చదువుకున్నా, ఇండియన్ ఇండిపెండెన్స్‌లో సౌతాఫ్రికాది ఒక కీలకపాత్ర అన్న విషయం ఈ ట్రిప్పు వరకూ నాకు తెలీదు.

3

మనసును దోచే మనస్లు– 4

రచన: దాసరి అమరేంద్ర
మూలం: నిమ్మగడ్డ శేషగిరి
ఈ ఈ నొక్కి చదవండి...

మా ప్రయాణంలో మొట్టమొదటిసారిగా దూరాన ఉన్న మనస్లు శిఖరం చూసాం. ఆ శంఖువు ఆకారపు హిమశిఖర రాజస దృశ్యం మమ్మల్ని ముగ్ధులని చేసింది. కానీ మరికాసేపట్లో మబ్బులు కమ్ముకు వచ్చి శిఖరాన్ని మాకు దూరం చేసాయి. కొద్ది క్షణాల పాటైనా ఆ సుందర గంభీర శిఖరాన్ని చూడగలిగినందుకు అంతా ఎంతో సంతోషించాం.

2

తమరి బాధ్యత

రచన: అవినేని భాస్కర్
మూలం: ఎస్. రామకృష్ణన్

ఆ రైల్వే స్టేషన్ ఒక ప్రసిద్ధ ఆలయానికి సమీపంలో ఉంది. అందువల్ల మంగళ, శుక్రవారాల్లో స్టేషన్‌లో దిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇరవై ఏళ్ళ క్రితం ఆ గుడికి ఇంత ప్రాచుర్యమూ, మహత్యమూ ఉండేది కాదు. కానీ ఉన్నట్టుండి దశ తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఉత్తరాది రాష్ట్రాలనుండి కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు.

1

కళాసాగరం కర్ణాటకం-3

రచన: శ్రీనివాస్ బందా
ఈ ఈ నొక్కి చదవండి...

ఎవరు వీళ్ళు? ఈ అడవిదారిలో, అర్ధరాత్రిలా అనిపిస్తున్న చీకట్లో, అర్థమయ్యీ కాని భాష మాట్లాడుతూ సాయం చేస్తామని ముందుకొస్తున్న ఈ అపరిచితులని నమ్మాలా వద్దా?

3

నిశ్శబ్దం

రచన: ఇంద్రప్రసాద్

పుట్టేవాళ్ళని
ఆహ్వానించాలి
పుట్టిన వాళ్ళని
గుర్తుంచుకోవాలి.

0

ఆకాశ సముద్రం

రచన: వై. ముకుంద రామారావు

సముద్రానికి ఆకాశం
ఆకాశానికి సముద్రం
అనాదిగా తెరిచిన పుస్తకం

0

కొత్త రాతి యుగం

రచన: పసునూరు శ్రీధర్‌బాబు

మాటలకు రెక్కలిచ్చాం
రక్తాన్నిచ్చాం
కన్నీళ్ళనిచ్చాం
ఎగిరిపోతుంటే పట్టుకునేందుకు
వడిసెల్లో గుండెలు పెట్టి విసురుతున్నాం

1

అస్తిత్వవాద సాహిత్యం: 5ఇ. కాఫ్కా

రచన: సూరపరాజు రాధాకృష్ణమూర్తి

ఈ కథ రాయడం ఒకే రాత్రి ఎనిమిది గంటలలో ముగించానని చెప్పుకున్నాడు కాఫ్కా. తన ‘దేహము, ఆత్మ పూర్తిగా తెరచుకొని, తనలో మగ్గుతుండిన కథను బయటికి వదిలేశాయి’, అన్నాడు. కథ మొదలు పెట్టినప్పటినుండి ముగించే వరకు అతడు పడింది ప్రసవవేదన.

0

మంకుతిమ్మని మరో మిణుకు – 3 (21-30)

రచన: ఎం. ఆర్. చంద్రమౌళి
మూలం: డి.వి.గుండప్ప

ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉన్న సత్యం కాదు. అది చైతన్యంపై పడిన ప్రతిబింబం మాత్రమే. ‘దాని నీడయే ఈ జగత్తు’ అనగా అదే. నీడకు స్వంతంగా ఉనికి లేదు. నీడ ఉండాలంటే ఒక వస్తువు, కాంతి ఉండాలి. ఈ చైతన్యసత్త్వము అన్నియెడల ఉండి మనకు కనబడక ఎందుకు గూఢంగా ఉన్నది?

0

యూట్యూబ్ లో ఈమాట: మార్చి 2026

రచన:
ఈ ఈ నొక్కి చదవండి...

గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.

0

28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం

రచన: సురేశ్ కొలిచాల

స్నేహితులు – సంధానాలు, సవాళ్లు – సహకారాలు, సాంకేతికత – నైతికతలతో కూడిన 28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం

0

తన రచనకి ఒక ప్రామాణికతని సృష్టించుకున్న కథకుడు మధు పెమ్మరాజు

రచన: నౌడూరి సూర్యనారాయణ మూర్తి
ఈ ఈ నొక్కి చదవండి...

మధు పెమ్మరాజు కథల్లో, నాకు నచ్చిన విషయం: కవిత్వాన్నీ, జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న తెలుగు/ హిందీ సినిమా పాటల పల్లవుల్నీ, చరణాలనీ సందర్భానికి తగ్గట్టుగా మెటఫర్లుగా వాడుకోవడం. దానివల్ల కథనాన్నీ, వ్యక్తిత్వాలనీ, ఆ సందర్భంలో ఆవేశాల తీవ్రతనీ, క్లుప్తంగా, గాఢంగా చెప్పగలిగే సౌలభ్యం కలుగుతుంది.

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.