రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రహస్యనేత్రం

రచన: పద్మావతి రాంభక్త
జనవరి 2022

గుప్పెడు అక్షరాలను పోగేశారు
కాసిని వాన చినుకులను చల్లారు
రవికిరణపు వెలుగులను తాగించారు
పూలరంగులను ఒంపి
పరిమళాలు అద్దారు
సీతాకోకల రెక్కలపై ఊరేగించారు
ఆకాశంలోకి ఎగరేశారు
హరివిల్లుపై ఊయలలూపారు.

ఒక్క వాక్యం కనికరించదే!
మునుపు
ఎలా కుంభవృష్టి కురిసింది
నదిలా ఉరకలేస్తూ
లోయలగుండా
ఎలా ప్రవహించింది
ఇప్పుడెందుకిలా
మనసు ఎడారైంది?

నిముషాలు రోజులై
రోజులు వారాలై నడుస్తున్నాయి
వాక్యమెందుకు పలకదు?

ఒక అంతులేని శూన్యం
నల్లమబ్బులా ఆవరించింది.

ఈ స్తబ్ధత
ఈ నిశ్శబ్దం
ఊపిరిని కొరికేస్తున్నాయి.

సరిగ్గా అప్పుడే
మహాతపస్సులో నుండి ఓ మొలక
ఆకుపచ్చ కళ్ళెత్తి పైకి లేచింది.

ఒక రహస్యనేత్రం
లోపలెక్కడో తెరుచుకుంది.

కవిత్వమూ అంతేనా?

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మూతబడ్డ పుస్తకం
  • పన్నీటిచుక్కలు
  • వాక్యం పాదాల దగ్గర
  • వ్రాయలేనితనం
  • కొన్ని సందర్భాలు

ఇటువంటివే…

  1. చెప్పేదెవరు?
  2. గోళం
  3. నిశ్శబ్దం లో నీ నవ్వులు
  4. తప్పక వస్తాను
  5. వర్చువల్ రుతువు

జనవరి 2022 సంచికలో ...

  • అబ్బలనాన్న
  • అయిదో గోడ: కల్పన రెంటాల కథలు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 3
  • ఉత్తర మొరాకో శోధనలు 2
  • ఉదాహరణములు – 3
  • ఊహల ఊట 8
  • ఐనా నేను పైకి లేస్తాను!
  • గడినుడి – 63
  • జనవరి 2022
  • నా స్నేహితులు
  • ప్రపంచమే ఒక కథనరంగం
  • బహుదూరం
  • భారతీయ పరిచయక్రమం: కాఫ్కా
  • రహస్యనేత్రం
  • రేడియేషన్ అంటే భయపడడం ఎంతవరకు సమంజసం?
  • వలసచరిత్రలో తెలుగువెలుగులు: జగమునేలిన తెలుగు
  • విశ్వమహిళానవల 14: కరొలీనా పావ్లోవా
  • వెతలే వెతుకులాట
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 63
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అబ్బలనాన్న
బహుదూరం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.