చిరునవ్వు నవ్వెనాన్ జిరుత మల్లియ చాన
కుసుమించు నెడనెడఁ గులుకులొలుకు
వలెవాటు గప్పెనాన్ లలి మొల్ల ఫుల్లాక్షి
సితకోరకాళిచేఁ జెన్నుమీరు
పొలయల్కఁ బూనెనాన్ బున్నాగ యెలనాగ
తూపుచూపులఁ బూవు దొడుగు బిగిని
మైపుల్క లొదవెనాన్ మందార తరుణియు
నారక్త సుప్రభ నంది పూచుతరులు లతలును వెరవునఁ దమ తలపుల
వెలువరించుచుఁ దొలికారుఁ దెలియజేయ
భావుకులకెల్ల పరవశ తావలంబి
సమయవికసన సౌందర్య సముచితముగమరల గొనంగ నిచ్ఛ పలుమారు జనింపదొ! గండు కోయిలల్
వరుసలు దీరి మామిడుల వాదనముల్ వినిపింప -వల్లరుల్
పరహితముల్ సువాసనలఁ బంచగఁ – దెమ్మె రలంట -నామనిన్
గర మరుదైన యందము వికస్వరమై ముదమీదె యెల్లచోన్మానెన్ గోయిల పాడనేఁడు సుమముల్ మానెన్ సుగంధమ్ములన్
బూనన్ గాలుల సౌకుమార్యమడగెన్ మావుల్ ముదంబీయగా
మానెన్ బూవుల దాల్చుచున్ నిలిచి యేమాత్రమ్ము లాలిత్యమే
యూనన్నామని మానె దానికతమేమో మీరు కన్నొగ్గిరేమారిన పల్లెటూళ్ళు కసుమాలమునిండిన బట్టణాలు మెం
డారిన గుండె మెత్తనలు ఆరనికక్షలు నూరుకాంక్షలున్
భారపు జీవనంబులును బైపయి పూతల నవ్వునెయ్యముల్
తోరములయ్యె నేడు; మనతో జత నచ్చునె! నూతనాబ్దికిన్!పంటపొలాల ముంపగ నపాంపతి మ్లేచ్ఛుల కారణంబుగా
మంటల గాల ప్రాణితతి మానక దీనులయార్తి యాకసం
బంట చిరంటులన్ దరిమి బన్నము సేయగ వేవిధంబులన్
దుంటరు లెట్లు సంతసముతో నరుదెంత్రు వసంతు దూతలున్ఇంతయుఁ జింతలేక మనయింతులు రేల, బవళ్ళ వీధి వి
శ్రాంత మనస్కలై చనగజాలిన కాలము దేశ సంపదన్
దొంతులు బేర్చి నాయకులు దోచని కాలము బీదబిక్కి కా
వంతయు వంతలేకఁ గుడువన్, మన, గట్టగ నబ్బుకాలమున్
సంతసమిచ్చు, నూతనవసంతునకున్ మనకీయ దీవనల్అందపు సిరి, కళ, గౌరమ
లందమ యెద, వాయి,యొడలు లందున గల యా
పొందిక గల మువ్వురు దొర
లందర రక్షింతురనుచు నాకాంక్షింతున్