రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అదేమిటో

రచన: పద్మావతి రాంభక్త
అక్టోబర్ 2021

చీకట్లను ఈదుతూ అలసిపోతున్నపుడు
ఒక్కోసారి చందమామ అడ్డం పడి
వెన్నెలను పరిచయం చేస్తుంది

అదాటున బద్ధశత్రువు కనబడి
ప్రేమగా చేతులు చాపుతుంది

ఎన్నో సంక్లిష్టప్రశ్నలకు
ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న జవాబులు
ఉన్నట్టుండి కాళ్ళకడ్డంపడతాయి

ఒక్కోసారంతే!
మిట్టమధ్యాహ్నపు ఎండ
కొలిమిలా మండుతున్నప్పుడు
ఉక్కపోతను ఊదేస్తూ
చినుకుగజ్జెలతో ఓ
తడిమేఘం నడిచొస్తుంది

ఎన్నాళ్ళుగానో మొగ్గ తొడగని మొక్కకు
ఆకులన్నీ పూలై నవ్వుతాయి

అదేమిటో అరుదుగా ఒక్కోసారి…
తాకిన ప్రతీ వాక్యం
కవిత్వపు బంగారు తొడుగుతో
కనురెప్పల పరదాల మాటు నుండి
ఆనందభాష్పమై రాలిపడుతుంది.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    దేశరాజు October 1, 2021 6:56 am

    బావుంది

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అప్‌డేట్ అవలేదు
  • ఒక క్షణమైనా
  • ఊగిసలాట
  • రెండు తీరాలు
  • వానగీతం

ఇటువంటివే…

  1. నీతో ఉన్న ఆ కాసేపు
  2. రెండు దేహాలు
  3. రెండు కన్నీటిచుక్కలు
  4. రంగు
  5. నువ్వూ – కాలం

అక్టోబర్ 2021 సంచికలో ...

  • The song cycle of Shyam
  • అక్టోబర్ 2021
  • అదేమిటో
  • ఊహల ఊట 5
  • ఎడిట్ వార్స్
  • ఒక కవిత ఏమి చేయలేదు
  • గడినుడి – 60
  • నేను సైతం
  • బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణము 2
  • భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1
  • మేము – మా భోజనపుబల్లలు
  • మౌని
  • రైల్వే స్టేషను
  • వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు
  • వాదా
  • విశ్వమహిళా నవల: 12. ఎమిలీ బ్రాంటీ
  • శిల
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 60
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మేము – మా భోజనపుబల్లలు
శిల

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.