నాకు తెలిసిన పండుగలలోకెల్లా పిల్లల కోసమనుకునే గొప్ప పండగ ఏదో తెలుసా? వినాయక చవితి. వినాయకుడు దేవుడు, కారణ జన్ముడు, ఏకదంతముపాస్మహే, కరిభిద్గిరిభిత్కరికరిభిద్గిరిగిరిభిత్కరి అనే గందరగోళమూ, భయమూ, భక్తి, లెంపలు వేసుకోడఁవూ, గుంజీళ్ళు తీసుకోడఁవూ… వంటివి కాదు.
సెప్టెంబర్ 2022
“What is freedom of expression? Without the freedom to offend, it ceases to exist.” – Salman Rushdie.
ద్వేషం అనే విత్తనం మొలకెత్తితే అది ఎప్పటికీ చావదని, కలుపుమొక్కల్లా విస్తరిస్తూనే ఉంటుందని చాటడానికి రచయిత సల్మాన్ రుష్దీపై ఇటీవల జరిగిన హత్యాప్రయత్నం ఒక ఉదాహరణ. తమ స్వార్థం కోసం, గుర్తింపు కోసం, న్యూనతలను కప్పిపుచ్చుకోవడం కోసం, కొన్ని ప్రభుత్వాలు, మతసంస్థలు సమాజంలో ద్వేషాన్ని పెంచిపోషిస్తూనే ఉన్నాయి. ఆ విద్వేషానికి స్వ-పర భేదం లేదని, తమ లక్ష్యం నెరవేర్చడం దగ్గర ఆగిపోవాలని తెలీదని, అదుపు తప్పి, నిలబడ్డ నేలనంతా మహాభూతమై కబళిస్తుందని చరిత్ర ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చేయిస్తున్నారు. చెడుపిలుపులకు, చర్యలకు సత్వరం ప్రతిస్పందించే జాంతవిక సమూహమొకటి సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. ముల్లాల ఫత్వాలు అమలు చేయడానికైనా, మసీదులు కూలగొట్టడానికైనా, కులమతాల పేరిట అసహాయులపై దాడికైనా ఈ మూర్ఖపు మూక సదా సన్నద్ధంగా ఉంటుంది. సొంత ఆలోచనంటూ లేని వీరికి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎంతటి దేవుడినైనా విమర్శించగలిగే, చివరికి హేళన కూడా చేయగలిగే అధికారం -మహాభక్తులకు, కళాకారులకు- ఇద్దరికే ఉందని. నిఖార్సైన ఏ కళాకారుడూ మతసంస్కృతులలోని సత్సంప్రదాయాన్ని విమర్శించడు. హేళన చేయడు. కాని సంప్రదాయం అనే ముసుగులో జరిగే ఘోరాలను, అత్యాచారాలను; పవిత్రత, మర్యాద అనే పట్టుబట్టలు కప్పుకున్న మానవమృగాలను విమర్శిస్తాడు. మతం పేరిట నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపుతాడు. అందుకే, “Respect for religion has become a code phrase meaning ‘Fear of Religion’. Religion, like all other ideas deserve criticism, satire and yes, fearless disrespect” అంటాడు రుష్దీ. ఏ మతమూ విమర్శ, వ్యంగ్యం, నిర్భయాపూరితమైన తిరస్కారాలకు అతీతం కాదని, కారాదని నమ్మే వారి వల్ల నిజానికి సంస్కృతీసాంప్రదాయాలకు లేశమంతైనా హాని జరగదు. కాని, పదిమందిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే నాయకుల మనోభావాలు మాత్రం గాయపడతాయి. ఏ మతమైనా మొట్టమొదట బహిష్కరించవలసినది, మనోభావాలు గాయపడుతున్నాయని దౌర్జన్యానికి దిగేవారినే. ఎందుకంటే వీరికి నిజంగా ఏ మతంతోనూ, ధర్మంతోనూ సంబంధం లేదు. మమేకమవ్వగలిగిన గుణం లేదు. వీరి దౌర్జన్యానికి బలిపశువులు కావాలి అంతే. ఎమ్. ఎఫ్. హుసేన్ చిత్రాలు తగలబెట్టి అతన్ని దేశంనుంచి వెళ్ళగొట్టినా, పెరుమాళ్ మురుగన్ను వెంటాడి వేధించినా, రుష్దీని తిరిగి స్వదేశం లోకి రానియ్యకపోయినా, వాటి వెనుక వీళ్ళకున్న అసలు కారణాలు న్యూనత, అధికార దాహం, ఆలోచనాలేమి. కోహం రండే అని అప్పుడెప్పుడో మన దేశంలో ఉదారవాదం పరిఢవిల్లిన కాలంలో అన్నాడు కాబట్టి సరిపోయింది కాని అదే మాట ఇప్పుడంటే కాళీదాసుకూ కాళ్ళూ కీళ్ళూ విరిచేసి వుందురు కాషాయభక్తులు. ఎవడబ్బసొమ్మని కులికేవు రామా అన్న రామదాసుని తరిమితరిమికొడుదురు. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్గనిస్తాన్లోను, మతప్రభుత్వాలు రాజ్యం చేస్తున్న ఇతర ముస్లిమ్ దేశాలలోనూ స్త్రీలు, పిల్లలు, మైనారిటీలు, తదితరుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే ఎవరైనా ముందు చేయవలసింది మతాన్ని అధికారానికి దూరంగా పెట్టడం. మతం, దైవం పేరుతో సమూహాలను రెచ్చగొట్టి, విమర్శను హత్య చేసి, కళాకారులను పాత్రికేయులను నియంత్రించి, నిర్బంధించి నియంతృత్వం సాగిస్తున్న ప్రభుత్వాలున్నంతవరకూ ఈ పరిస్థితి మారుతుందని ఆశించడం కష్టం. హింస ఏ మతంలో జరిగినా, ఏ కారణంతో జరిగినా హింసే. రుష్దీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని నిరసిస్తూ మన దేశంలో ఏ గొంతూ బలంగా వినపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో అభ్యుదయవాదుల, ప్రగతిశీల ఉద్యమనాయకుల దృక్పథం వారి వర్గశత్రువుల దృక్పథమంత సంకుచితంగానే ఉందని, ఉంటుందని వారూ పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు. వెన్నుదన్ను ఇచ్చే మనుషుల సంఖ్యతో సంబంధం లేకుండా, ఇట్లాంటి సందర్భాల్లో గొంతెత్తి అసమ్మతిని, వ్యతిరేకతనూ బలంగా తెలపడమే సంఘంలో ఆలోచనాపరులింకా ఉన్నారన్న హెచ్చరిక!
ఇప్పుడు ఏంటి? ఎక్కడికెళ్ళాలి? టైమ్ ఎంతైందో! బహుశా తొమ్మిది. మిగిలిన కొద్దిమందిమీ బారక్ వైపుకి నడవడం మొదలెట్టాం. సినిమా హాల్ దగ్గరికి రాగానే దాదాపు అందరూ దాని వెనక్కి దారి తీశారు. ‘వెట్ క్యాంటీన్’ ఉందక్కడ. తమిళ కుర్రాళ్ళందరూ జంబులింగం చుట్టూ చేరి వడలూ టీలూ ఆర్డర్లు ఇప్పించుకొంటున్నారు. ఆ టీ-స్టాల్ లోంచి బయటపడి బారక్ చేరుకున్నాను. ట్రంక్ పెట్టెలోంచి ఒక ఇన్లాండ్ లెటర్ తీసి, రాయడం మొదలుపెట్టాను.
కొందరైతే ఎదురుగా పుస్తకం లేందే పాడలేరు. కొందరు పాటలైతే బాగా పాడతారు కానీ పాడుతున్నప్పుడు వాళ్ళ మొహాన్నీ వాళ్ళనీ చూడలేం! కళ్ళు మూసుకుని వినాల్సిందే. బోలెడు కష్టపడిపోతూ, అప్పడాలపిండి అయిపోతూ, తాళం వెయ్యడానికి చెయ్యి ఇంతెత్తు ఎత్తుతూ ఏవిఁటో – చూడ్లేం బాబూ!
మాద్రిద్ విశ్వవిద్యాలయంలో ఆమె పేరిట ఒక పీఠం ఏర్పడడం ఎంతో అరుదుగా స్త్రీలకు లభించే గౌరవం. అయితే, మేధావులకోసం స్థాపించిన స్పానిష్ రాయల్ అకాడెమీలో తనకు స్థానం లభించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ అకాడెమీ కేవలం మగవాళ్ళకేనని తేల్చి చెప్పారు పండితులు!
ఇక్కడ, చినుకులు రాలుతున్నవి. నువ్వు సాకిన రెక్కలపై అవి పడి, ఒక జలదరింపుకి, శరీరం మనస్సూ గురి అవుతున్నవి. ఎవరివో ముఖాలూ మాటలూ గొంతుకలూ జ్ఞప్తికి వస్తున్నవి. ప్రేమించిన వాళ్ళూ, ద్వేషించిన వాళ్ళూ, ఏదో ఆశించే దరిచేరే వాళ్ళూ, నకలుగా తయారయ్యి నిందించే వాళ్ళూ, ఉన్నవాళ్ళూ లేనివాళ్ళూ, ఉండి వెళ్ళిపోయిన వాళ్ళూ, వెళ్ళిపోవడంతోనే మిగిలినవాళ్ళూ – ఇలా ఎవరెవరో – మబ్బుపట్టి, చినుకులై రాలుతుంటిరి.
క్లాసు రూములో కూచుని మా తరగతి ఉపాధ్యాయుల కేరికేచర్లు, లేకపోతే నోటు పుస్తకంలో స్కెచింగ్ మాత్రమే కాకుండా నేను తరుచుగా చేసే మరో పని కూడా ఉంది. అదేమిటంటే చిన్న చాకు కాని, సగం బ్లేడ్ ముక్క కానీ ఒకటి పుచ్చుకుని తరగతిలో ఏదో ఒక బల్లపైన నా పేరు తాలూకు అక్షరాలను చెక్కడం.
నిచ్చెన చివరిమెట్టు ఎక్కిన తర్వాత, నిటారుగా నిలబడి, మీరు చేతులు పైకి ఎత్తి చందమామను తాకవచ్చు. మేము జాగ్రత్తగా నిలబడి కొలుచుకున్నాం కూడా. (అప్పట్లో అది దూరంగా జరిగిపోతుందన్న అనుమానం ఏమాత్రం రాలేదు.) మీరు చేతులు ఎక్కడ పెడుతున్నారన్నది జాగ్రత్తగా గమనించవలసింది.
కొంచెం సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ యువకుడిని తన పందెం ప్రతిపాదనతో డిస్టర్బ్ చేయడంలో పొట్టి వ్యక్తి సఫలమయ్యాడు. కాసేపు స్థిరంగానే కూచున్నా, అతనితో ఏదో అశాంతి బయలు దేరింది. అటూ ఇటూ కుర్చీలు మారాడు. చేతుల్తో ఛాతీ రుద్దుకున్నాడు కాసేపు. వీపు మీద, మెడ మీద చేత్తో తట్టుకుంటూ ఆలోచించాడు. చివరికి ఒక కుర్చీలో కూలబడి మోకాళ్ళ మీద చేతుల్తో టక టకా కొడుతూ కూచుండి పోయాడు కాసేపు. పాదాలు నేల మీద తడుతున్నాయి.
అయితే రంగారావుగారికంటే ముందు ఇలాంటి విశ్లేషకులు లేరా? ఇకముందు రారా? ఏమిటీ ఆయన గొప్పతనం? అంటే – ఆయనకు ముందు ఇలాంటి వారున్నారేమో తెలీదు కాని, ఆయనంత నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిస్పక్షపాతంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు మాత్రం లేరు.
చైతన్యం అత్యాశగానూ చలనం అత్యవసరంగానూ తెల్లవారుతుంది.
స్పృహ కంటే శిక్ష లేదు నాబోటి వారికి.
చీర కొంగు నడుం చుట్టూ బిగించి – ఊఁహూఁ.
చీర’ మాట మరెప్పుడైనా చెప్తాను – ఈ ప్రమాదం దాటాలి ముందు.
స్తన్యాన్ని వదిలి ఆహారాన్ని కోరే మూడు నోళ్ళు. సమాజం పట్ల ప్రతిస్పందనలతో మార్గదర్శకత్వం కోసం ఆరాటపడే మూడు జతల కళ్ళు. జంటగా మోయవలసిన భారం ఒంటరి భుజాలపై పడింది. అప్పుడు ఆమెది జీవితంతో పోరాటం. వాస్తవమైన పని ఆరంభమయింది. ఆహారం ఇచ్చింది. ఆలోచనలు ఇచ్చింది. ఉన్నంతలో ఆనందాన్ని పంచటం మప్పింది.
ముంజేతులకు ముత్యాలిత్తువు
రొమ్ములపైనా రత్నాలుంతువు
సంపగి సొబగుల ఉడుపులిత్తువు
ఇంతగ నాతో రమింతువేలా?
రాముడా! నాపైన నీకింత భ్రమతేమీ?
మగత వీడి సూర్యపుష్పం విచ్చుకునే వేళ
దిగంతాన్ని కమ్మేసిన జిలుగు నీడలు చెదిరిపోయాయి
పిడికిలెత్తిన రంగు రెక్కల చిట్టి సీతాకోక చిలుక ఒకటి
మొండిగోడలపై ఇంద్రధనుస్సును అద్దుతూ
తన గూడును లోయకు ఇచ్చేసి ఎగిరిపోయింది
గగనానికి ఎగసి ఎగసి
మేఘమునై మెరసి మురిసి
విశ్వమంత వినేలా
అమ్మా భారతి
నీ ఘనతను
చాటాలని ఉంది.
దేశభక్తి గీత మొకటి పాడాలని ఉంది.
దుఃఖమెప్పుడూ పాత నేస్తమే
ఆనందాలే అనుకోని అతిథుల్లా
అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి.
నిదుర మరచింది లేదు
కలలే కనులకు దూరమయి
కలత పెడుతుంటాయి.
మాట దొరకని నిశ్శబ్దమై
మనసు నిలపని ఒంటరితనమై
నీకు నీవు మాత్రమే మిగిలేలా
అగమ్యగోచరంగా
కఠిన శూన్యంగా
మౌనమై అంతరాత్మను
మళ్ళీ మళ్ళీ శోధిస్తూ…
కలలా
హెచ్చరిస్తూ
దగ్గరగానో
దూరంగానో
మాటి మాటకి
ఉలిక్కిపడుతూ
ఉదయపు ఆకాశం
ఉతికి ఆరేసిన
అమ్మ నీలం చీరలా
నిశ్చలంగా నిర్మలంగా
మధ్యాహ్నం
శ్రమైకసౌందర్యంతో తడిసిన
ఎర్ర చీరలా గంభీరంగా
చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు.
నాలుగు కళ్ళగుండా
వేలమైళ్ళ మేటవేసి
తలలో పాతపగను తాకి
మొగ్గలేసిన సమస్య
పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది.
కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు.
క్రితం సంచికలోని గడినుడి-70కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-70 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: