ఉదయపు ఆకాశం
ఉతికి ఆరేసిన
అమ్మ నీలం చీరలా
నిశ్చలంగా నిర్మలంగా
మధ్యాహ్నం
శ్రమైకసౌందర్యంతో తడిసిన
ఎర్ర చీరలా గంభీరంగా
సాయంత్రం
పసుపు పూలద్దుకున్న
నారింజ చీరలా అలసటగా
రాత్రయ్యేసరికి
అక్కడక్కడ పిండి ముద్దలంటిన
నలిగిన నల్ల చీరలా.
ఉదయపు ఆకాశం
ఉతికి ఆరేసిన
అమ్మ నీలం చీరలా
నిశ్చలంగా నిర్మలంగా
మధ్యాహ్నం
శ్రమైకసౌందర్యంతో తడిసిన
ఎర్ర చీరలా గంభీరంగా
సాయంత్రం
పసుపు పూలద్దుకున్న
నారింజ చీరలా అలసటగా
రాత్రయ్యేసరికి
అక్కడక్కడ పిండి ముద్దలంటిన
నలిగిన నల్ల చీరలా.