రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్వప్న సుందరి

రచన: వింజమూరి బాలమురళి
నవంబర్ 2012

శ్రీ కారంబునులోగొను
నాకారము లోన శ్రుతులు అమలినశశిబిం
బాకారోద్యద్గండము
నాకారమె తనుమధ్యము నాచెలిసొగసుల్!

నాస్వప్నలోకరాజ్ఞివి
నాస్వాంతము దోచుకొన్న నారీమణివే
సుస్వర జీవన సుధవై
రా, స్వాగతమందు నీకు రాకేందుముఖీ!

ఊహల రెక్కలు దాలిచి
విహరింతము కలలు కలిపి వినువీధులలో
మహదానందప్రదమగు
ఇహపరముల సంధి చేయు ప్రేమలు పొంగన్!

రామానీయారామమె
ప్రేమసుధారసధామము ప్రియములనెలవౌ
లేమా నీ సాన్నిధ్యమె
అమర సుఖమ్మొసగు నాకు అన్నులమిన్నా!

నీవే నా సర్వస్వము
నీవే నా జీవితమున తీయని తలపుల్
నీవే నా మధుమాసము
నీవే నా హృదయరాజ్ఞి నిక్కము చెలియా !

లేరిల నీ సరిలేమలు
కోరివలచి వలపు గొన్న కోమలగాత్రల్
ఏరీ నీ సరి జాణ, ల
పారపు శృంగార శాస్త్ర పారగులెన్నన్?!

భయమన్నది బహు చెడ్డది
భయపడితే ప్రేమికులకు బ్రతుకే బరువౌ
భయపడని ప్రేమ గెలుచును
లయమున్నదె? ప్రేమకిలలొ? లలనా వినుమా!

ఏ నాడు నీదుప్రేమను
నేనే పొందితినొ నీకు నిడితినొ గానీ
ఆ నాటినుంచి మతిచెడి
నేనే నను మరచిపోతినే ప్రియవచనా!

చెలి మాటలకేరీతిన
అలవడెనో ఈ మధురిమ రమ్మని ప్రేమన్
పిలిచెడి మధురాధరముల
కలయిక చే వెడలుకతన కాబోలు సఖా!

చెలిమాట వినిన చెవులకు
చెలియందము గన్నకండ్లు చెలికౌగిలిలో
వాలిన తనువున కధర-
మ్ముల నానయధరములకును ఉత్సవ మొదవున్!

ఝరులో విరిసినయమవస
ఇరులో ఘనధూపధూమ తెరలో అరయన్
శరదంబుద దొంతరలో
మెరిసే నీలాలకురుల మిన్నగు సొగసుల్!

నిజమా నీ సాంగత్యము
నిజమా నీతోడి వలపు తీర ప్రయాణాల్
నిజమాయని తలపోయుదు
సౌజన్యవతీ త్వదీయ సౌజన్యంబుల్!

1 2అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • స్వప్న సుందరి

ఇటువంటివే…

  1. అల్లాష్టకము
  2. అనంతం
  3. ప్రాసక్రీడాశతకము
  4. తిరణాల
  5. నువ్వూ – కాలం

నవంబర్ 2012 సంచికలో ...

  • 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్
  • ఈమాట నవంబర్ 2012 సంచికకు స్వాగతం!
  • కాల్వీనో కథల నుంచి – 6అ
  • కాల్వీనో కథల నుంచి – 6ఆ
  • కోనసీమ కథలు: రెండో రుమాలు
  • టి. జి. కమలాదేవి
  • తిరణాల
  • నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన
  • నిష్కృతి
  • నువ్వూ – కాలం
  • పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం
  • పలుకుబడి – కాలమానము
  • ప్రాసక్రీడాశతకము
  • మహోన్నత చిత్రకారుడు బ్రాక్
  • మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు
  • రామాయణ కల్పవృక్షచ్ఛాయ
  • రుక్మిణీ కళ్యాణం
  • వాన!
  • వ్యవహార భాష: వ్యాకరణము
  • స్వప్న సుందరి
  • స్వప్నభంగం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వాన!
కోనసీమ కథలు: రెండో రుమాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.