రామాయణ కల్పవృక్షచ్ఛాయ

కేవల నవ కథాదరణ బుద్ధులైన కొందరు, ఇదివరకెన్నిసార్లు ఎందరెందరో వ్రాసిన రామాయణమును మరల వ్రాసినవాడు కవి యేమిటి? అనవచ్చును. అనుచునే యున్నారు. ఇదివరకెందరో ఎన్ని విధములుగానో గానము చేసిన రాఘవేశ్వరు చారిత్రమే యిది. అవి వేరు. ఇది వేరు. నవీనత కేవలము కథలోనే యుండదు. ‘రసము వేయిరెట్లు గొప్పది నవకథా దృతిని మించి’ అన్న దానిలో చర్చకు తావే లేదు. ఇది మానవులకు ప్రత్యక్షానుభవములో నున్న విషయమే గనుక.

ఇంకొక్క విషయము. మెరుపు మెరిసి మాయమయినట్లు తత్కాల ప్రతిభా విలసనము గలిగిన కవి ఏరుకొను వస్తువు వేరు. గాఢ ప్రతిభ గలవాడు ఏరుకొను వస్తువు వేరు. మత్తగజ విహారమునకు మడుగులు చాలవు. …

పాఠకులు మన్నించినచో నొక విన్నపము. ఈ తెలుగు దేశములో అసలు గ్రంథము చదువకనే, చక్కగా అధ్యయనము చేయకనే దానిని గూర్చి స్వేచ్ఛగా వ్రాయుటయో, మాట్లాడుటయో మిక్కిలిగా అలవాటు అయినది. ఈ రామాయణ కల్పవృక్షము సంస్కృత కావ్యమున కనువాదమనుట అటువంటి వానిలో నొకటి. అయినను దోషము లేదు. కాదు కనకనే కాదని చెప్పుట. కథారంభములోనే ఇది స్వతంత్ర్య కావ్యమని స్పష్టముగా దెలియును. …

ఆత్మ యున్నదా? దైవమున్నాడా? నాస్తిక్యత కాలుష్యమా? ఈ ప్రశ్నల కిచ్చట తావులేదు. తానన్నదానికి వ్యతిరేకముగా జగములో మరొకడు మాటాడగూడదనుట, అందరూ తమ మార్గమే పట్టవలయుననుట అభివృద్ధి నిరోధకుని ప్రథమ లక్షణము. …

ఈ వివరణాత్మక వ్యాసపు పూర్తి పాఠం: రామాయణ కల్పవృక్షచ్ఛాయ

[సమయాభావం వల్ల ఈ వ్యాసాన్ని కేవలం పిడిఎఫ్ గానే అందిస్తున్నందుకు క్షమాపణలు – సం.]