వ్యవహార భాషావాదం పుట్టి నలభై యేళ్ళ పైచిలుకైనా ఆ వ్యవహారభాషంటో ఏమిటో, దాని సమగ్ర స్వరూపమేమిటో నిర్ణయించినవారెవరూ ఇంతవరకు లేరు. ఈ వాదానికి మూలస్తంభమని చెప్పదగిన గిడుగు రామమూర్తి పంతులు గారు మరణించి ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరములు కావస్తున్నది. కీర్తిశేషులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రులు గారు చెప్పినట్లుగా ఆంధ్ర కావ్యభాషకే సరి అయిన వ్యాకరణం మనకు ఇంతవరకూ లేదు. వ్యవహార రూపాలను ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా, తెలుగు కావ్యాలలో నున్న ప్రయోగ వైచిత్రి నంతా విశదీకరిస్తూ ఒక గ్రంథం వ్రాయడానికి తగిన పాండిత్యం ఉన్నవాళ్ళు తెలుగు దేశంలో, వేళ్ళ మీద లెక్కపెట్టదగినంత మంది కూడా లేరు. ఏ ఇద్దరు ముగ్గురన్నా ఉంటే వారికి అహమస్మి అని ముందుకు వచ్చే సాహసం లేదు. అందుచేత భాష యొక్క సమగ్రస్వరూపం నిర్ణయించడమనేది సుఖాసుఖాల మీద తేలేపని కాదు. పోనీ ఆ ఇద్దరు ముగ్గురిలో ఎవరైనా ఒకళ్ళు సాహసించి ముందుకు రాకపోవడానికి కారణం ఈ పై విషయాన్ని బాగా ఎరిగి వుండబట్టి హాస్యాస్పదులం అవుతామేమో అనే అనుకోవలసి వస్తున్నది. కావ్యభాష సంగతే ఇట్లా వుంటే దారీ తెన్నూ లేని వ్యావహారిక భాషను వ్యాకరించ బూనుకోవటం సంగతి వేరే చెప్పనక్కఱ లేదు. …
ఈ ఆలోచనాత్మక వ్యాసం పూర్తిపాఠం: వ్యవహార భాష: వ్యాకరణము (ప్రథమ ముద్రణ – జయంతి పత్రిక, మే 7, 1959.)
[సమయాభావం వల్ల ఈ వ్యాసాన్ని కేవలం పిడిఎఫ్ గానే అందిస్తున్నందుకు క్షమాపణలు – సం.]