తిరణాల

లాగించి పెసరట్టుప్మా పొట్లాలు
దట్టించి మొహానికి రంగులు
రాముడు ఆంజనేయుడు
చేస్తుంటే పద్యాల యుద్ధాలు

కూటి కోసం నకిలీ తారలు
చిరంజీవులు మాధవీలు
రూపాయి దండల రెపరెపల్లో
రగిలిపోతే మొగలి పొదలు

బొట్టు బిళ్ళలు పక్క పిన్నులు
డిస్కో తాళ్ళు రబ్బరు గాజులు
పావలా పంచదారకి చుడితేను
పట్టు దారాల పీచు మిఠాయిలు

కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
చుట్టూ గాలిలో గేలాలెన్నో
చిక్కీ చిక్కక తప్పుకుపోతూ
గుటకలు వేస్తే చెరుకు రసాలు

రంగుల రాట్నం రైతు బిడ్డకి
ఆకాశంలో చుక్కల పంటలు
కళ్ళు తిరిగితే ఒళ్ళు తూలితే
నిలబడి చుట్టూ తేరి చూస్తే

అది తిరణాల.