మా కిద్దరికీ ఈత రాదు. మా అమ్మాయి ఈదటం నేర్చుకోవాలని మాకు ఇష్టం. అదొక మంచి వ్యాయామమే కాకుండా, జీవితంలో ఎప్పటికయినా పనికొచ్చే అవసరం అని మా ఉద్దేశ్యం.
Category Archive: కథలు
మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే.
అప్పట్లో అమెరికాకు, బెంగుళూర్నుంచీ నేరు ప్లైటు కాదు కదా, రెండు మూడు సార్లు కాక, వెళ్తున్న స్థలాన్ని బట్టి కనీసం ఏడెనిమిదిసార్లు విమానాలు మారవలసి వచ్చేది.
నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్టమధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని. ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.
నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.
నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే!
ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
అతను ఒక చేత్తో పుస్తకం చదువుతూ రెండో చేత్తో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తెల్ల బొచ్చు కుక్క అతని మీద పడి అల్లరి చేస్తోంది.
పుస్తకం తనకు బహుమతి అయినప్పుడు అందులో బొమ్మలు కత్తిరించే స్వతంత్రం తనకు లేదా? అన్న ప్రశ్న కనిపించింది దాని కళ్ళలో!
సరిత, రత్తాలు చేతులు రెండూ పట్టుకుని, “రత్తాలూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను! వేళకు చక్కగా భోజనం చెయ్యి, పళ్ళూ, పాలూ విడవకుండా తీసుకో. డబ్బు నీది, బిడ్డ మాది…అన్నది మర్చిపోకు సుమీ” అంటూ రత్తాలుకి చెక్కు అందించింది.
నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!
అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా?
సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!
నా కళ్ళలో తెలీలేదా? ప్రేమ పాటలన్నీ పనిగట్టుకుని హై వాల్యూమ్ లో పెట్టినప్పుడు వికాస్ మాత్రం కంప్యూటర్లోకి దూరి ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తనకేదో చెప్పాలని ఆరాటంగా వస్తే, తను చాట్ విండోలో జోక్ కి నవ్వుకుంటూ నా మాట వినిపించుకోనప్పుడు ఎలా తెలుస్తుంది?
స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.
అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్ళకు పైనే అయ్యింది.
నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్ళబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే…
ఎయిర్మెయిల్ ఉత్తరం. పార్ అవియన్ లోగో. ఎక్కడనుంచి వచ్చిందో సరిగా తెలియటల్లేదు. అరడజను పోస్టల్ ముద్రలున్నాయి. కవరు తెరిచే ఉంది.
ఇంతలో ఓ పిల్లాడి గాలిపటం ఎంతో ఎత్తున ఎగురుతూంటే మరో గాలిపటం వచ్చి తగులుకుంది. దాంతో అంత ఎత్తునున్న గాలిపటం తెగిపోయింది.