అతను సంచీ లోంచి ఒక పులి తోలును తీశాడు. అప్పుడే అతని గుడ్డ సంచీని మేము గమనించింది. దానిని ఒక్క క్షణంలో తన తల మీదుగా తొడుక్కొని, గడ్డం క్రింద పులి ముసుగుని లాక్కున్నాడు. తన సొంత కళ్ళతో చిరుత పులి ముఖం లోనుంచి గదిని ఒక్క క్షణం అటూ ఇటూ చూసుకున్నాడు.
Category Archive: కథలు
ఈ రచయిత ప్రతిభ అన్నింటికన్నా ఎక్కువ వ్యక్తం అయ్యేది ఈ కథకు ఆయువుపట్టు, కథ శీర్షిక, ఆఖరు పంక్తి అయిన “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న కృష్ణుడి ప్రశ్నలో. అవును, ఎందుకు పారేస్తాడు?
నేను ముందు గది అంటే మా ఆవిడ నా కేసి చురచురా చూస్తుంది. దాన్ని డ్రాయింగ్ రూము అని పిలవాలిట. ఒక టీవీ, నాలుగు కుర్చీలు, నా లాప్టాపూ తప్ప మరేమీ లేని ఆ రూముని అలా పిలవాలంటే నాకు మనస్కరించదు.
సమాజపు రీతి రివాజులు చెయ్యకూడని పనులని చేయిస్తాయి. కానీ మానవత్వంతో నడుచుకోవడానికి, సాటి మనిషి పట్ల దయతో వ్యవహరించడానికి స్పందించే మనసు ఉంటే చాలు. మనకి ఉన్న పరిధిలో సమాజ సేవ చేయడానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు.
ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు.
విశ్వనాధం పెద్ద కూతురు సీతాలు. పదోతరగతి ఆడ గజనీ మహమ్మదులా దండెత్తింది. చదువెలాగూ అబ్బలేదని సంగీతం నేర్పిస్తున్నారు. ఆ సంగీతం నేర్పే సుబ్బారావు నాకు స్నేహితుడు. సుబ్బారావు మా అమలాపురంలో పేరున్న సంగీతం మాష్టారు.
‘రావణాసురుడి పది తలలకూ, ఒకే రకం మొహం వుంటుందా? లేక ఒక్కో తలకూ ఒక్కో రకం మొహం వుంటుందా?’ ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న! ఆరో తరగతిలో వున్నప్పుడు టీచర్‌ని అడిగాను. ఇదే ప్రశ్న ఇంట్లో అన్నయ్య నడిగితే అసలు రావణుడే లేడు పొమ్మన్నాడు. నాన్న నడగాలంటే భయం.
నాన్న చెప్పడం ప్రకారం తను పుట్టింది ఇండియాలో చిన్న పల్లెటూర్లో. దాదాపు ఇరవై ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాడు, తెలుగు మాత్రం మాట్లాడుతూ. ఇంగ్లీషొచ్చినా మాట్లాడే అవసరం రాలేదుట ఎప్పుడూ. చాలా బీద కుటుంబం. ఏమీ ఉండేది కాదు.
రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు.
గుంట్నాకొల్లందరు అవి తినీసి రొబోలకెల్తామనుకుంట్నారు గావాలని, ఐస్క్రీములన్ని కారు బైటే తిని, చేతులు మూతులు కాయితాల్తోటి తుడుసుకున్నాక సెప్పీనాది సావుకబురు చల్లగాన. ‘టిక్కట్లైపోయ్యంటఱ్ఱా పిల్లలూ! ఇంకెప్పుడైనా చూడొచ్చులే రోబో, సరేనా?’ అనీసి.
“అదేమిటి? ఇద్దరమే కూచుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సినిమాకి వెళితే నా పక్కనే కూచునేదానివి. గుర్తుందా ఒకసారి వానలో ముద్దముద్దగా తడిసి వస్తుంటే “రిం ఝిం గిరె సావన్” పాట పాడుతూనే ఉన్నావు దారంతా? నేను అడగ్గానే ఏ పాటయినా పాడేదానివి!”
అంత అద్భుతంగా ఎంత కాలమో జరగలేదు. ఆ తర్వాత, పెరిగి పెద్దవుతున్న కొద్దీ పరిస్థితుల్లో, ఆలోచనల్లొ మార్పులొచ్చాయి. మబ్బులాకాశం, పిల్ల తెమ్మెరలు, వీచే గాలులు భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని రేపేవి. చూసినప్పుడల్లా ప్రియమైన వారి గుర్తులేవో మోసుకొస్తున్న భావన కలిగేది.
నిజం చెప్పొద్దూ! అంతకన్నా ఎక్కువ బాధ కలిగించింది, నా గురించి నాలుగు ముక్కలు నేనే రాసి పంపించవలసిందని మీ అధ్యక్షులవారి తాఖీదు లాటి విన్నపం. ఇది నిజంగా నా హృదయాన్ని తొలిచివేసి గుండె పోటు తెప్పించిందంటే నమ్మండి.
మొదటి భాగంలో కప్పని మింగుతున్న పాము గురించి వెంకటాద్రికి వాడి అమ్మ కనకమ్మ చెప్పడం, ప్రతీకగా దాని అవసరం కథాంతంలోగాని బయట పడదు. ఈ రకమైన ‘ట్విస్ట్’ అలనాటి పాతకథల్లో మామూలు. ఇప్పటి కొన్ని కొత్త కథల్లోనూ ఈ రకమైన ‘విరుపు’ కనిపిస్తుంది.
నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దనీ స్నేహాన్ని తెంపేసాడు.
కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.
దాదాపు అర్థ శతాబ్దం క్రితం వ్రాసిన ఈ కథల్లో కనిపించే ప్రాంతాలు, పరిసరాలు నాకు పరిచయం లేనివి. కానీ పరిసరాలను, పాత్రలను కళ్ళ ముందు నిలిపేందుకు వాడిన భాష, వాక్యాలు నిత్యనూతనం.
ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు.
నేను మిమ్మల్ని మోసం చేయబోవడం లేదు. చేసి మీ దృష్టిని ఆకట్టుకునే ఉద్దేశమే ఉంటే నా మొదటి వాక్యం “చిమ్మ చీకట్లోంచి ఒక స్త్రీ ఆర్తనాదం హృదయ విదారకంగా వినిపించింది” అయి ఉండేది.
“ఊరందరికీ ఇలాంటి పుకార్లంటే భలే ఇష్టం. పంకజానికి పొలం వ్యవహరాల్లో మా బావ సాయం చేస్తున్నాడు. అంతే! అందర్నీ పిలిచినట్లుగానే మా అక్క ఆవిణ్ణీ పిలిచింది. ఏం పిలవకూడదా?”