బుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది.

కూతురికి 13-15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ముదురాకుపచ్చ లంగా మీద లేతాకుపచ్చ ఓణీ కట్టింది. ఆరోజే తలంటినట్టున్న జుట్టును వదులుగా వదిలి ఒక రబ్బరుబాండు పెట్టింది. చిన్న బొట్టు.. మెడలో సన్నని గొలుసు.. ఎందుకో తనలో తానే నవ్వుకొంటూ మురిసిపోతోంది. ఇంతలోనే నాయుడుగారు రంగంలోకి దిగిపోయారు.

ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు నాకు పదేళ్ళు. నీకు ఒక తమ్ముడినో చెల్లెలినో తెస్తానంటూ అమ్మ ఆస్పత్రికి వెళ్ళింది ముందు రోజు.

అంతకన్నా తెలివైన పని, ఆ చామన ఛాయ వాళ్ళకి పెద్దపెద్దవిమానాలు ఇచ్చి, పెద్దపెద్ద బాంబులు చేసుకోడానికి సహాయం చేస్తే, వాళ్ళు మనపార్టీలో చేరచ్చు,

నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…

ఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది. ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది. రోడ్డు పై జనం హడావిడిగా, కంగారుగా, భయం భయంగా వెళుతునట్టనిపించింది.

కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.

“ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ళ సాక్షిగా పెట్టని పరీక్షలు.

“ఇదేమన్నా రాఖీ పండగ అనుకున్నావా, భయపడి ఇంట్లో దాక్కోవడానికి? ఈ రోజు బయట పడకపోతే ఇంకెప్పుడు?” అంటూ తెగ ఏడిపించారు.

తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?

అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!

తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?

గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!

ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!

ఆ పెళ్ళి విందు రాజారావుకొక కొత్త అనుభవం! ఎవరో ఓ మహాకవి అన్నట్లు అనుభవాల పేజీలే కదా జీవితమంటే! తన పిల్లల ప్రవర్తనల మార్పు అనే అనుభవం అతనికి మెల్ల మెల్లగా తెలుస్తోంది. ఏ అనుభవాల అంచున ఎప్పుడు జారి పడతామో ఎవ్వరికీ తెలియదు.