రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు వ్యాసాలు

చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ

రచన: సూరంపూడి పవన్ సంతోష్
ఈ ఈ నొక్కి చదవండి...

యుద్ధాల గురించి సాహిత్యంలో సాధారణంగా ప్రస్తావనలు వీరత్వాలు, భుజబలాల ప్రస్తావనల కేసి, లేదంటే కలిగే రక్తపాతం గురించి వుంటాయి. యుద్ధ ధర్మాలు, వీరారాధనలు వంటివి తప్ప యుద్ధ నిర్వహణలో హృదయం పెట్టి పని చేయగల నాయకుల ఆలోచనలు తూనిక వేసే అలవాటు మన సాహిత్యకారులకు చాలా అరుదు.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6

ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్

రచన: అనానిమస్సు

అమెరికా ఆదాయపుపన్ను గురించి ఈమాట పత్రికలో ఇంత వివరంగా చెప్పవలసిన అవసరం నిజంగా ఉన్నదా అన్నది (మీ) అసలు ప్రశ్న. ఎందుకంటే, ఈమాట శ్రద్ధగానో, అశ్రద్ధగానో చదివే పాఠకులు అమెరికాలో కన్నా తెలుగు భాష (ఏ యాస భాష అయితేనేం!) మాట్లాడే రాష్ట్రాలలోనే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళకెందుకీ గోల?

2

శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన

రచన: ఏల్చూరి మురళీధరరావు

శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 అంతా ఒకే పేజీలో 21

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం

రచన: కొడవళ్ళ హనుమంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.

పేజీలు: 1 2 3 4 5 6 7 అంతా ఒకే పేజీలో 22

గీతులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 10 అంతా ఒకే పేజీలో 4

సాహిత్యావగాహన: మరొక దృక్పథం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

సాహిత్యంలో పూర్తి మాతృక అన్నది నిజం కాదని గుర్తిస్తే చాలు. నమ్రత ఉన్న ప్రతి కథకుడికీ ఈ విషయం తెలుసు. మంచి రచయిత అయితే, వాడి చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. కథలో రకరకాల అందమైన లోతులు కనిపిస్తాయి. విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6

ప్లూటో గ్రహచారం

రచన: వేమూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 10

కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు

రచన: మాధవ్ మాౘవరం
ఈ ఈ నొక్కి చదవండి...

నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 13

రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు

రచన: ఏల్చూరి మురళీధరరావు

కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 8

తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు

రచన: పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు

ఈ ప్రయత్నం అంతా ఎందుకు? అంటే లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. ప్రామాణికమైన గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 9

భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం

రచన: ఏల్చూరి మురళీధరరావు

గంగనార్యుడు, పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా పద్యాన్ని కదనుతొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువుతీరింది. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 5

ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం

రచన: గారపాటి ఉమామహేశ్వరరావు

జీవి నాడిని పట్టి జీవతత్త్వాన్ని ఒక డాక్టరు ఎట్లా గ్రహిస్తాడో చేరా తెలుగు భాషా తత్తాన్ని ఇంకా చెప్పాలంటే ద్రావిడ భాషా తత్త్వాన్ని నామ్నీకరణాలతో ఆవిష్కరిస్తారు. విభక్యర్థక నామ్నీకరణంలో ఏయే నామాలు సాధ్యమో, నామ్నీకరణ ప్రక్రియల్లో నామ విభక్తుల లోపాన్నిబట్టి అంతరువులు ఉన్నాయని ఏడవ దశకంలోనే నిరూపించిన ఘనత ఆయనది.

4

మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈ ఈ నొక్కి చదవండి...

మలయాళ ఛందస్సులో సంస్కృత వృత్తములు ఉన్నాయి, కాని అందులో కొన్ని సౌలభ్యము కోసము మాత్రావృత్తము లయ్యాయి. మలయాళ దేశి ఛందస్సు ప్రారంభ దశలో తమిళ ఛందస్సునుండి ఎన్నియో వృత్తములను గ్రహించుకొన్నది. కాలక్రమేణ అవి కూడ మార్పుకు లోనయ్యాయి.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 అంతా ఒకే పేజీలో 0

కాళోజీ కవిత్వంలో మనిషి

రచన: కాత్యాయనీ విద్మహే

చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది.

0

విశ్వస్వరూపం: టెలిస్కోపులు

రచన: వేమూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

దుర్భిణిని అంతరిక్షంలో ఉంచటం వల్ల చాల లాభాలు ఉన్నాయి. భూమి వాతావరణం వల్ల చెదరకుండా ప్రతిబింబాలు ఖణిగా కనిపిస్తాయి. నక్షత్రాల దగ్గర బయలుదేరిన విద్యుదయస్కాంత తరంగాలలో కొన్ని భూమిని చేరలేవు కనుక మన దుర్భిణిని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 3

శార్దూలవిక్రీడిత వృత్తము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈ ఈ నొక్కి చదవండి...

రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 11

సమస్త సిద్ధాంతం అవసరమా?

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ.

6

మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్

రచన: పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు
ఈ ఈ నొక్కి చదవండి...

బ్రౌన్‌ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్‌ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగ పడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిర్శకంగా పరిశీలించి బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 48

పలుకుబడి: దిక్కులు, పక్కలు

రచన: సురేశ్ కొలిచాల

“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఎన్నో ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల (dexterous), బలం కలిగిన- చెయ్యి అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 9

త్రికాల సంపుటి త్రిపుర

రచన: సీతారాం
ఈ ఈ నొక్కి చదవండి...

అయినా నిరీక్షించడమంటే ఏమిటో మనకు తెలియనిది కాదు. దేనికోసం ఎవరెవరం ఎదురుచూస్తున్నామో అదే వచ్చేస్తే మనమంతా తప్పకుండా భంగపడేవాళ్ళం. అది ఆదర్శరాజ్య మైనా, కమ్యూనిస్టు సమాజమైనా, సాంస్కృతిక విప్లవమైనా సరే. అయినప్పటికీ, ‘నిరీక్షించువారు ధన్యులు. వారికన్నియును నొసగబడును,’ అని చెపుతూనే ఉంది. కొత్తదో, పాతదో ఓ నిబంధన గ్రంథం.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 1

రచనల జాబితా

వెనక్కి 1 … 28 29 30 31 32 … 57 ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.