జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, ”భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.

వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్ళీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది?

రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిమీదా బాలమురళికి ఎంతో అధికారమూ, నియంత్రణా ఉన్నాయి. ఆయనను మైలు దూరానికి కూడా సమీపించగల కర్నాటక గాయకులు లేరు. ఆయనకు సమకాలికులం అయినందుకు మనమంతా గర్వపడాలి.

త్యాగరాజు జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకి దైవత్వం ఆపాదిస్తూ, త్యాగరాజు జీవిత కథని భక్తి పురాణ గాధగా మార్చేసారు ఆయన శిష్యులు. వాటికి భిన్నంగా వీలైనన్ని చారిత్రక ఆధారాలు చూపిస్తూ, ఒక వాగ్గేయకారునిగా త్యాగరాజునీ, ఆయన జీవితాన్నీ అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం.

అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది. సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి అవగాహన చేసుకోకుండానే బట్టీపెట్టే అలవాటు పిల్లలలో ఎక్కువగా కనిస్తుంది.

జార్జ్ బూల్ బీజగణితాన్ని తర్కశాస్త్రానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికి పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు క్లాడ్ షానన్.

మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ వ్యాసపు ముఖ్యాశయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యాసం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు పాఠకుల ఆసక్తిని ఎక్కువ చేస్తాయని నా నమ్మకం.

కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.

తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు.

నండూరి వారు “ఎంకి”ని సృష్టించి ఎనభై ఏండ్లు నిండాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే. ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి. […]

ఇంతటి మహత్తర కోశాన్ని సంకలనం చేసిన శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారికీ, ఆ పని వారికే అప్ప చెప్పి ఓపికతో చేయించుకొని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిని మరొకమారు అభినందిస్తున్నాను. మరొకమారు చాలదు. పిదప వేరొక మారు, ఆ తరువాత ఇంకొకమారు అభినందించాలి.

తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.

సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త గా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను.

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.