నేను అతిశయోక్తిగా చెప్పడం కాదిది. కానీ మేధావులు పుట్టడమే ప్రత్యేకంగా పుడతారు. ఎంతో దూరం నుంచి చూస్తున్న నాకు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యావరణంలో ముగ్గురంటే ముగ్గురే అందరికంటే ఉన్నతంగా కనిపిస్తారు. వారు గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, వెల్చేరు నారాయణ రావు.

మన సమాజానికి వైవిధ్యపు అవసరం మీద, మన భవిష్యత్తు మీద మనకు సరైన అవగాహన ఎందుకు లేకుండా పోయిందన్న ప్రశ్నకు, 2009లో నారాయణ రావు గారు, పరుచూరి శ్రీనివాస్, నేను మ్యూనిక్‌లో పెయింటింగ్ గాలరీలు చూసి వచ్చి బైట నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు, నారాయణ రావు గారు చెప్పిన సమాధానం ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది.

నారాయణ రావు ఒక సిద్ధాంతానికి, ఒక కాలానికీ పరిమితమై పోయేవాడు కాడు. గొప్ప రచయితలకి సిద్ధాంతాల చట్రాలు పట్టవు అని గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దక్షిణ భారత సాహితీ సంస్కృతి, చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన నారాయణ రావు వంటి సాహిత్య మేధావి విషయంలో మరీ మరీ అవసరం.

నారాయణ రావు (నారా) తెలుగు సాహిత్య విమర్శ రచనల్తో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని వాటన్నిటిని విహంగవీక్షణంతో చూస్తూ కొంత విశ్లేషణ అందిస్తున్నా. గుణాగుణాల్ని గుర్తించి కొన్ని మౌలిక భావాల్ని ఎత్తిచూపటానికి స్థూల ప్రయత్నం చేస్తున్నా. చివరగా పాఠకులం ఏం చెయ్యొచ్చునో ఉచిత సలహాలు, నారాతో నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని, జత చేస్తున్నా.

పిల్లవాడిని వదిలి బరువు గుండెలతో వెళ్ళే కారుణ్యమూర్తి అయిన గౌతమ బుద్ధుడు, అయోధ్య నగర అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యాన్ని వెతికే ఊర్మిళాదేవి ఉత్కంఠ, గంగానది గట్టు మీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో ఎక్కడకో కొట్టుకుపోయే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెల చప్పుడు – ఇతివృత్తాలు.

మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.

ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో గౌతమరావు లోక్‌సభకి జనతా పార్టీ నుండి పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. రాజకీయంగా ఆయనని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను.

ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.

దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనాన్ని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్య పరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.

వ్యవహార భాషావాదం పుట్టి నలభై యేళ్ళ పైచిలుకైనా ఆ వ్యవహారభాషంటో ఏమిటో, దాని సమగ్ర స్వరూపమేమిటో నిర్ణయించినవారెవరూ ఇంతవరకు లేరు. ఆంధ్ర కావ్యభాషకే సరి అయిన వ్యాకరణం మనకు ఇంతవరకూ లేదు. భాష యొక్క సమగ్రస్వరూపం నిర్ణయించడమనేది సుఖసుఖాల మీద తేలేపని కాదు. కావ్యభాష సంగతే ఇట్లా వుంటే దారీ తెన్నూ లేని వ్యావహారిక భాషను వ్యాకరించ బూనుకోవటం సంగతి వేరే చెప్పనక్కఱ లేదు.

ఈ తెలుగు దేశములో అసలు గ్రంథము చదువకనే, చక్కగా అధ్యయనము చేయకనే దానిని గూర్చి స్వేచ్ఛగా వ్రాయుటయో, మాట్లాడుటయో మిక్కిలిగా అలవాటు అయినది. ఈ రామాయణ కల్పవృక్షము సంస్కృత కావ్యమున కనువాదమనుట అటువంటి వానిలో నొకటి. అయినను దోషము లేదు. కాదు కనకనే కాదని చెప్పుట. కథారంభములోనే ఇది స్వతంత్ర్య కావ్యమని స్పష్టముగా దెలియును.

పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు.

మాత్రాఛందస్సు గురించి ప్రాకృత హిందీ భాషలలో నెక్కువగా వ్రాయబడియున్నను తెలుగులో వీటి చర్చ చాల పరిమితమే. కన్నడ తెలుగు భాషలలోని దేశి ఛందస్సులో అంశ లేక ఉపగణములను ఉపయోగిస్తారు. తెలుగులోని సూర్యేంద్రచంద్రగణములు కన్నడమునందలి బ్రహ్మ విష్ణు రుద్ర గణములనుండి పుట్టినవే.

చరిత్రకారులు నవలారచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరేట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే?

తన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్ది ధరలు పెంచటానికి బదులు తగ్గించాడు. దానితో మధ్య తరగతి ప్రజలు సహితం కొనడం ప్రారంభించారు. బహుశా ప్రజల అందుబాటులోకి తన చిత్రాలు రావడం రాయ్‌కి ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చి వుండవచ్చు.

మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను.

ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము.

బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయ్యసూరి తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి.