మొబైల్ పక్కన పడేసి, ఆమ్లెట్ నోట్లో కుక్కుకుంటూ బైటికొచ్చాను. ఇంటి ఎదురు పిట్టగోడల్లేని డాబా మీది అమ్మాయి డ్యాన్స్ రీల్స్ చేసుకుంటోంది. మొబైల్‍తో వీడియో తీసుకోడానికి కష్టపడుతోంది. నా వైపు చూసింది. చెయ్యూపాను ‘నేను రానా’ అన్నట్టు. వద్దంది, చెయ్యి గుండెకి అడ్డం పెట్టుకుంటూ. రెండు నెలల క్రితం వాళ్ళ నాన్నే వచ్చి అడిగాడు హెల్ప్ చెయ్యమని. ఫోన్‍లో ఆమె రీల్స్ రికార్డ్ చేసి పెట్టేవాడిని. రెండు మూడు రీల్స్ తరువాత తనే వచ్చి వద్దన్నాడు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పాణిని జన్నాభట్లఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
పాణిని జన్నాభట్ల రచనలు
ఆ గుడారం బయట కాపలా కాస్తూ, ఆ సంభాషణంతా వింటున్న ఓ భటుడు, ద్రోణుడు నిద్రకి ఉపక్రమించాడని నిర్థారించుకున్నాక, మెల్లగా గుడారం వెనకున్న అడవిలోకి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఓ చోట ఆగి, చెయ్యి పైకెత్తి మెల్లగా ఈల వేయడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి ఓ గద్ద రివ్వున ఎగురుకుంటూ వచ్చి అతడి చెయ్యి మీద వాలింది. దాన్ని సంతోషంగా నిమురుతూ, తన భుజానికున్న ఎర్ర తాయత్తుని తీసి దాని కాలికి కట్టాడు.
నాలుగో ఫ్లోర్‌లో ఓ స్టూడెంట్ గ్రూప్. లేదంటే ఇప్పుడిప్పుడే జాబ్‌లో చేరిన బాపతు అయి వుండచ్చు. ఒకమ్మాయి భుజం మీద పదే పదే బలవంతంగా చెయ్యేస్తున్న ఓ సన్నటి, నల్లటి కుర్రాడు. ఆ అమ్మాయి మెల్లగా ముందుకు జరుగుతోంది నవ్వుతూ, చెయ్యి తప్పిస్తూ. వాడు చెయ్యి గట్టిగా బిగించాడు ఇంకా దగ్గరికి లాక్కుంటూ. చుట్టూ వాళ్ళ బ్యాచ్‌లో ఎవరూ పట్టించుకోవట్లేదు వాడిని. వాళ్ళు పట్టించుకోరనే ధైర్యంతో వాడలా చేస్తున్నాడా?
తర్వాతి పొద్దునే లేచావు అలికిడికి. అసలు నిద్రే పట్టదనుకున్నావు కానీ నీ శరీరం నిన్ను మోసం చేసింది. ఒళ్ళంతా లాగేస్తోంది. పొట్ట కాలిపోతోంది. ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. మొదటిసారి తీసుకోలేదు కానీ ఇంకోసారి బలవంతపెడితే వద్దనలేదు నువ్వు. మెల్లగా కిందకొచ్చి సైలెంట్‌గా కుర్చున్నావు. కొంతమంది వంటింట్లో ఉన్నారు. మగవాళ్ళు బైటికీ లోపలికీ తిరుగుతున్నారు. ఎవరూ నీతో కళ్ళు కలపడంలేదు. వచ్చినవాళ్ళకి టిఫిన్‌లూ, టీలూ అందిస్తోంది ఒకామె.
భయం పుట్టింది. నాన్న గురించి నేను మాట్లాడ్డం! ఏం మాట్లాడాలి? ఏం పొగడాలి? హడావిడిగా పైకి లేచాను. బాత్రూమ్ వైపు నడిచాను. ఒంట్లో వణుకు తగ్గట్లేదు. ఓ సిగరెట్ త్వరగా రెండు పఫ్స్ తీస్కోని పడేశాను. వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కొని ఇంకో పాకెట్లో ఉన్న చిన్న బాటిల్ కోసం వెతికాను. అది దొరకలేదు. టెన్షన్ ఎక్కువైంది. “ఎక్కడైనా పడేశానా? ఇంట్లో వాడాను, పాకెట్లో పెట్టుకున్నట్టే గుర్తు. బైటికెళ్ళి వెతికే టైం లేదు. అది లేకపోతే…”
“రండి సార్, మొత్తానికొచ్చారు ఈ పేదోడి పార్టీకి!”
“నువ్వే పేదోడంటే మనదేశం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ పొసిషన్లో ఉన్నట్టేబ్బా!”
“బావున్నారాండీ?”
“ఆ కీర్తీ, బావుండామ్మా, మీ మ్యారేజ్ సిల్వర్ జూబిలీ అని మీ ఆయన ఓ పట్టుబడితే, కలిసి పోదామని వచ్చా.”
“థాంక్సండీ! ఈసారి ఖచ్చితంగా మేడమ్‌ని కూడా మా ఇంటికి తీసుకురావాలి మీరు.”