రాజా! నువ్వు ఇంత కష్టపడటం వెనక నీ ఉద్దేశం తెలియకపోవటానికి, నేనేమీ రాజకీయనాయకుల ఉపన్యాసాలు నమ్మి ఓటు వేసే ప్రజల్లో ఒకడ్ని అనుకోకు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ఎలా గద్దె దింపాలో తెలిసిన ఓటర్లలాంటివాడిని నేను. నీ పన్నాగాన్ని తిప్పికొట్టటానికి ఓ కథ వినిపిస్తాను. నేనో సూర్యతేజాన్ని అనుకుని, నన్ను నీ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకుండా కారును జాగ్రత్తగా నడుపు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: తల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డిఇతరపేర్లు:
సొంత ఊరు: వైరా, ఖమ్మం జిల్లా, తెలంగాణా
ప్రస్తుత నివాసం: వైరా, ఖమ్మం జిల్లా, తెలంగాణా
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు.
టి. చంద్రశేఖర రెడ్డి రచనలు
“రాజా! నన్ను కారు తోలమని కాదు కదా నీ ఉద్దేశం?” అని అడిగాడు. విక్రమార్కుడు సమాధానం ఇవ్వకముందే, “నేను కారు తోలితే నా తోబుట్టువులకు ఆశ్రయమీయటానికి మరికొన్ని శవాలు తయారవుతాయి. అప్పుడు నీకు మోయటానికి కావలసినన్ని…” అని ఉన్న పళంగా మూడు చుక్కలు అడ్డం రావటంతో ఆగిపోయాడు. తెలుగు కథల్లో ఎక్కడ పడితే అక్కడ, అర్థంపర్థం లేకుండా కనపడటం వాటికి అలవాటే.
రాజా! నీ మొహంలో ఇంతకు ముందెప్పుడూ కనపడని విసుగు, అలసట ఈసారి నా దృష్టికి స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూస్తుంటే, మన పాఠకరావు ఒక కథల సంపుటిని చదువుతున్నపుడు వ్యక్తపరచే హావభావాలు కళ్ళకు కట్టినట్లు నాకు మళ్ళీమళ్ళీ కనపడుతున్నాయి. నాకున్న అభినివేశమంతా వినియోగించి ఆ సన్నివేశాన్ని నీకు వివరిస్తాను. చోదకచర్య పైనే నీ దృష్టి కేంద్రీకరించి నేను చెప్పేది మాత్రం విరామసంగీతంలా విను.
ఇంతకీ పాఠకరావుకు వచ్చిన కష్టం ఏమిటి? ‘అటూ ఇటూ కాకుండా ఉందే’ అని అతడన్నది దేని గురించి? ఇదీ సరయిన పద్ధతి అని అతనికి అనిపించింది దేన్ని చూసి? ఈ ప్రశ్నలకి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో, కొన్ని తెలుగు కథల్లో అర్థం పర్థం లేకుండా కొందరు రచయితలు వాడుతున్న అనేకానేక రెండుమూడునాలుగు చుక్కల్లా, నీ తల కూడా వేయి ముక్కలవుతుంది.
బేతాళా! రోజుకో విభిన్నమయిన కథని చదవాలని, పాఠకరావు తాపత్రయం. అదే అతడు ఒక్కోరోజు ఒక్కోరకంగా ప్రవర్తించటానికి కారణం. అంతే కాదు, కాలక్షేపానికి కథలు చదివేవాళ్ళు అవి విసుగు కలిగిస్తే, వాటిని విసిరేసి ఇంకో కాలక్షేపాన్ని వెతుక్కుంటారు. కాని అదే కథాప్రపంచంలోకి మాటిమాటికీ వెళ్ళరు. అందుకని పాఠకరావు కాలక్షేపానికి మాత్రమే కథలు చదువుతున్నాడన్న అపోహని వెంటనే నీ మనసులోంచి తొలగించు.
“రాజా! ఒక విషయంలో మొదటిసారి పొరపడితే అది అనుభవరాహిత్యం. రెండోసారి పడితే మూర్ఖత్వం. నిన్నటి పొరపాటు ఇవ్వాళ జరగకుండా నువ్వు తీసుకున్న జాగ్రత్త చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మరీమరీ నీతో ముచ్చటలాడాలనిపిస్తోంది. అదే పని పదేపదే చేస్తున్న నీకు విసుగు కలగకుండా మన అభిమాన పాఠకరావు ధోరణిలో మరో వింత కోణాన్ని ఈ రోజు నీ ముందు ఆవిష్కరిస్తాను. విను.”
ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడికి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి అవగాహన ఉందనిపించింది. లేకపోతే ఈ స్థాయిలో వ్యంగ్యవ్యాఖ్యలు ఎలా విసరగలడు? పొగడ్తల సంగతి తర్వాత. తనముందు ఉన్న అగడ్త దాటటం ఎలా? చూపును రహదారి మీదనే కేంద్రీకరించి కాసేపు ఆలోచించాడు.
రాజా! నువ్వు నన్నెందుకు తీసుకువెళ్తున్నదీ నాకు తెలుసని నీకూ తెలుసు. పాత తెలుగు జానపదచిత్రాలు నువ్వు చాలానే చూసి ఉంటావు. వాటిల్లో కథానాయకుడు, కథానాయికని రక్షించటానికి మారువేషం వేసుకుని వస్తాడు. వచ్చింది కథానాయకుడని, కథానాయికని రక్షించటానికి అలా వచ్చాడని ప్రతి ప్రేక్షకుడికీ తెలుస్తుంది. కాని, ప్రతినాయకుడికి మాత్రం తెలీదు. కొంప తీయకుండా నేను, అలాంటి ప్రతినాయకుడ్ని అనుకుంటున్నావేమో నువ్వు. కానే కాదు.
రాజా! పచ్చిగా చెప్పాలంటే ఈ పాఠకరావు ప్రవర్తన నాకెందుకో పిచ్చిగా కనపడింది. పత్రికలో ఉన్న కథల పేర్లు చూసినప్పుడు అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు ఎందుకు పూచింది? చిటికె వేసిన మరుక్షణంలోనే అతడి కనుబొమలెందుకలా వింటి రూపం ధరించాయి? తన ఇంటి పైకప్పు ఎలా ఉంటుందో అతడికి తెలియదా? దాని వంక ఎందుకు అతడలా చూశాడు?
కొవ్వొత్తి, అగ్గిపెట్టె తెచ్చినతను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముందుకు కదిలే ధైర్యం తనకు లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ పలాయనమంత్రం పఠించటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా, వాళ్ళు; వాళ్ళ రాకడతోనే వాళ్ళ వెనకే యాంత్రికంగా మూసుకుపోయిన గుమ్మం తలుపుల్తో యుద్ధం చేస్తున్నారు.
ఏ కథనయినా సరిగా అనుసరించాలంటే కథలోని ప్రధానపాత్రల ప్రాథమిక పరిచయం అవసరం. ప్రాథమిక పరిచయం అంటే పేరు ఒకటే కాదు. దానికన్నా ముఖ్యం ‘నేను’ కి చెందిన ఇతర వివరాలు. ప్రథమపురుష కథనంలో ఈ వివరాలన్నీ కథలో ప్రధానపాత్రలు ప్రవేశించినప్పుడో, ఆ తర్వాత కొద్దిసేపటికో సందర్భానుసారంగా తెలుస్తాయి. ఈ పాత్రల్తో పోలిస్తే ఉత్తమపురుషలో కథలో ప్రధానపాత్ర అయిన ‘నేను’ పూర్తిగా భిన్నమయినది.
విమర్శనము అంటే శబ్దార్థచంద్రిక ఇచ్చిన ఒక అర్థం పర్యాలోచనము. ఈ పదానికి అర్థం, చక్కగా ఆలోచించుట. వ్యాఖ్యలు రాసే విషయంలో; ఈమాట ఇచ్చిన సూచనల్లో అంతర్లీనంగా ఉన్న భావం, పాఠకులని చక్కగా ఆలోచించి వ్యాఖ్య రాయమనే. వ్యాఖ్య, ఒక రచనపై పాఠకుడి విమర్శ. విమర్శ అంటే ప్రతికూలస్పందన ఒక్కటే కాదు- సానుకూలస్పందన కూడా.
ఎక్‌ఫ్రాసిస్ నిజంగా తెలుగువారికి తెలియని ప్రక్రియేనా? తెలుగు పద్యసాహిత్యం అంటే కవిత్వం అనుకుంటే, తెలుగు కవిత కృతి అయితే,వాటికి మరే ఇతర కళారూపంలోనూ అనుకృతులు సృజించబడలేదా? లేదంటే, ఇతర కళారూపాల్లో ఉన్న తెలుగు కృతులకి, తెలుగు కవిత్వం రూపంలో అనుకృతులు సృష్టించబడలేదా?